ఈ ఏడాది ప‌న్ను నిబంధ‌న‌ల‌లో వ‌చ్చిన 10 మార్పులు

సీనియ‌ర్ సిటిజ‌న్ల వ‌డ్డీ ఆదాయంపై రూ.50 వేల‌ వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

ఈ ఏడాది ప‌న్ను నిబంధ‌న‌ల‌లో వ‌చ్చిన 10 మార్పులు

ఈక్వీటీ పెట్టుబ‌డుల, దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల రాబ‌డి ప‌న్ను ద‌గ్గ‌ర‌ నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు అధిక వ‌డ్డీ ఆదాయ ప‌న్నుమిన‌హాయింపు, ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి వ‌చ్చే డివిడెండ్‌పై విధించే ప‌న్నుల వ‌ర‌కు ఈ సంవ‌త్స‌రం ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల్లో ప‌లు మార్ప‌లు చోటుచేసుకున్నాయి. ఇందులో చాలా భాగం 2018-19 బ‌డ్జెట్లో భాగంగా ప్ర‌వేశ పెట్టారు. వేత‌న జీవుల‌కు కూడా ఈ సంవ‌త్స‌రం ప్రామాణిక మినహాయింపు(స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్)ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య‌బీమా ప్రీమియంలో కూడా సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు అధిక మిన‌హాయింపులు ఇస్తున్నారు.

ఆదాయం పన్ను నియమాలలో వ‌చ్చిన కొన్ని ముఖ్యమైన మార్పులు :

 1. సీనియర్ సిటిజ‌న్ల‌కు అధిక వడ్డీ ఆదాయం మినహాయింపు:
  బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్ల‌పై వ‌చ్చే ఆదాయం పై గ‌తంలో అంద‌రికీ రూ.10 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. సెక్ష‌న్ 80టీటీఏ కింద ఈ మిన‌హాయింపు ఉండేది. ప్ర‌స్తుతం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌డ్డీ ఆదాయం రూ.50000 వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉంది. ఆర్థిక సంవ‌త్స‌రం 2018-19 నుంచి ఈ విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. సెక్ష‌న్ 80టీటీబీ కింద ప‌న్ను మిన‌హాయింపును రూ.50వేల‌కు పెంచుతున్న‌ట్లు 2018-19 బ‌డ్జెట్ లో పేర్కొన్నారు. సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు వ‌డ్డీ ఆదాయం రూ. 50 వేలుగా ఉంటే మూలం వ‌ద్ద ప‌న్నుమిన‌హాయింపు (టీడీఎస్‌) వ‌ర్తించ‌దు.
 1. మ్యూచువ‌ల్ ఫండ్లలో రాబ‌డి, డివిడెండ్‌పై ప‌న్ను:
  ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ల‌భించే డివిడెండ్‌పై ఇంత‌కు ముందు పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. ప్ర‌స్తుతం10 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది. పెట్టుబ‌డి దారులు వ‌చ్చే డివిడెండ్‌లు ప‌న్ను ర‌హితంగా ఉంటాయి. కానీ ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై డివిడెండ్ చెల్లించే ముందే డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ ప‌న్ను (డీడీటీ) ఇత‌ర ఛార్జీలు, సెస్‌తో క‌లిపి 11.648 శాతం మిన‌హాయించి ఇస్తారు. దీంతో పెట్టుబ‌డుదారుల‌కు వ‌చ్చే లాభం కొంత త‌గ్గుతుంది.

 2. ఈక్వీటీల‌లోదీర్ఘ కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను:
  ఏప్రిల్‌1,2018 నుంచి జాబితాలోని షేర్లు, ఓరియంటెడ్ మ్యూచువ‌ల్ పండ్లు వంటి ఈక్విటీలపై దీర్ఘకాల మూలధన రాబ‌డి (ఎల్‌టీసీజీ) ప‌న్ను విధానాల‌ను స‌వ‌రించారు. దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై ఇంత‌కు ముందు పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. సంవ‌త్స‌రం లోపే పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకుంటే రాబ‌డిని స్వ‌ల్ప‌కాలీక మూల‌ధ‌న లాభంగా లెక్కించి 15 శాతం ప‌న్ను విధిస్తారు. ఏడాది కంటే ఎక్కువ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగితే వాటిని దీర్ఘ‌కాలీక మూల‌ధ‌న లాభంగా లెక్కిస్తారు. దీనిపై లాభం ల‌క్ష రూపాయ‌లు దాటితే 10 శాతం ప‌న్ను ప‌డుతుంది

 3. రూ.40 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌:
  ఏప్రిల్ 1, 2018 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన కొత్త ఆర్థిక చ‌ట్టం-2018 ప్ర‌కారం ఉద్యోగుల‌కిచ్చే ర‌వాణా, ఆరోగ్య భ‌త్యాలకు బ‌దులుగా ఏక‌మొత్తంలో రూ.40 వేల వ‌ర‌కు ప్రామాణిక త‌గ్గింపు(స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌)ను అమ‌లు చేస్తున్నారు. ఇందుకోసం ఇత‌ర త‌గ్గింపులు, మిన‌హాయింపుల ఇచ్చే విధంగా ఏవిధ‌మైన గుర్తింపు ప‌త్రాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. వేత‌న జీవులు, పింఛ‌ను దారులు, వారి వేత‌నంపై రూ.40 వేల వ‌ర‌కు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

 4. అధిక సెస్‌:
  ఆదాయ‌పు ప‌న్ను చెల్లించే వ్య‌క్తుల, ఆదాయంపు ప‌న్ను సెస్‌ను 3 నుంచి 4 శాతానికి ప్ర‌భుత్వం పెంచింది.

 5. ఎన్‌పీఎస్‌పై పన్ను మినహాయింపు:
  ఎన్‌పీఎస్ నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి ప‌న్ను వ‌ర్తించ‌దు. ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్ర‌కారం, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఉద్యోగి 60 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగ‌తా న‌గ‌దుతో యాన్యుటి కొనుగోలు చేయాలి. ఈవిధంగా చేయడం వ‌ల్ల‌ రెగ్యుల‌ర్‌గా పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. ఇది స్య‌యం ఉపాధి పొందే వారికి కూడా వ‌ర్తిస్తుంది.

 6. 54ఈసీ బాండ్ల లాక్‌-ఇన్‌-పిరియ‌డ్‌:
  ఆస్తిని విక్ర‌యించగా వ‌చ్చిన రాబ‌డితో ఎన్‌హెచ్ఏఐ లేదా ఆర్ఈసీలు విక్ర‌యించే బాండ్ల‌ను కొనుగోలు చేస్తే సెక్ష‌న్ఈసీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. క్రితం సంవ‌త్స‌రం వ‌ర‌కు 54ఈసీ బాండ్ల పెట్టుబ‌డుల‌కు 3 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్-పిరియ‌డ్ ఉండేది. కానీ ఈ ఏడాది నుంచి ఈ పెట్టుబ‌డులు 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్-పిరియ‌డ్‌లో ఉంచాలి.

 7. ఆరోగ్య బీమా ప్రీమియంపై అధిక డిడ‌క్ష‌న్‌:
  సెక్ష‌న్ 80డీ కింద ఆరోగ్య‌బీమా పాల‌సీల‌కు చెల్లించే ప్రీమియంను ఆదాయ‌పు ప‌న్నుపై రూ.50 వేల వ‌ర‌కు సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌గ్గించుకోవ‌చ్చు. ఇది ఇంత‌కు ముందు రూ. 30 వేలుగా ఉండేది. అంతేకాకుండా, నిర్దిష్ట వ్యాధి వైద్య చికిత్సకు ఈ మినహాయింపు రూ .1 లక్షకు పెంచింది.

 8. ఎన్‌పీఎస్‌తో పాటు పీఎఫ్:
  పెట్టుబడిదార‌లను ఆక‌ర్షించేదుకు యూనియ‌న్ కేబినేట్ ప్ర‌స్తుతం ఎన్‌పీఎస్‌లో చాలా మార్పులు తీసుకువ‌చ్చింది. ఎన్‌పీఎస్ విత్‌డ్రాల‌ను పూర్తిప‌న్ను ర‌హితంగా అందుబాటులో ఉంచింది. మెచ్యూరిటీ స‌మ‌యంలో విత్‌డ్రా చేసుకునే 60 శాతం నిధిపై పూర్తి ప‌న్నుమిన‌హాయింపు వ‌ర్తిస్తున్నందున పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ల మాదిరిగా ఇందులో కూడా పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని నిపుణులు భావిస్తున్నారు.

 9. సింగిల్ ప్రీమియం ఆరోగ్య‌బీమా పాల‌సీలు:
  ఆరోగ్య‌బీమా పాల‌సీల‌లో మొత్తం కాల‌ప‌రిమితి సంబంధించిన ప్రీమియంను ఒకే సంవ‌త్స‌రంలో చెల్లిస్తే, ఆరోగ్య బీమా ప్ర‌యోజ‌నాలు పొందిన సంవ‌త్స‌రాల సంఖ్య‌కు అనుగుణంగా డిడ‌క్ష‌న్‌ల‌ను అనుమ‌తిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly