ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేస్తున్నారా? ఈ ప‌ది విష‌యాలు మీ కోస‌మే

ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లు స‌మ‌యంలో గుర్తుంచుకోవాల్సిన 10 విష‌యాలు

ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేస్తున్నారా? ఈ ప‌ది విష‌యాలు మీ కోస‌మే

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. పన్ను విష‌యాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకోవ‌డానికి ఇంత క‌న్నా మంచి స‌మ‌యం ఉండ‌దు. నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం కాగానే పన్ను ఆదా కోసం ఏడాది పొడ‌వునా మీరు చేసే పెట్టుబ‌డులు, ఖ‌ర్చుల వివ‌రాల‌ను తెలుపుతూ ఫారం 12 బీబీ స‌మ‌ర్పించాల్సిందిగా మీ కంపెనీ యాజ‌మాన్యం మిమ్మ‌ల్ని అడుగుతుంటారు. పెట్టుబ‌డుల‌కు స‌రైన ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తే ప‌న్ను ఆదాకు సంబంధించిన అన్ని మార్గాల‌ను వంద శాతం ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఇప్ప‌టినుంచే మీరు క‌స‌ర‌త్తులు చేస్తుంటే ఈ కింద వివ‌రించిన అంశాల‌ను ఒక్క‌సారి గ‌మ‌నించండి.

1) ఇప్ప‌టికే ఉన్న ఆర్థిక అవ‌స‌రాల‌ను విశ్లేషించుకోండి

ప్ర‌తీ నెలా మ‌న‌కు కొన్ని త‌ప్ప‌నిస‌రి ఖ‌ర్చులుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు, ఇంటి అద్దె, విద్యా రుణం లేదా ఇంటి రుణం వంటి వాటికి మ‌నం త‌ప్ప‌నిస‌రిగా డ‌బ్బులు చెల్లిస్తూ ఉండాలి. ఈ ఖ‌ర్చులు మ‌న‌కు ఎప్ప‌టికీ ఉండేవే, వీటి ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు సైతం పొంద‌వ‌చ్చు. మీరు ఇప్ప‌టికే పీపీఎఫ్‌, మ్యూచువ‌ల్ ఫండ్ల లాంటి ప‌న్ను ఆదా ప‌థ‌కాలలో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్ల‌యితే వాటితో పాటు ఈ ఖ‌ర్చుల‌ను కూడా లెక్క‌లోకి తీసుకోండి. ఈ ఖ‌ర్చుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీ సంస్థ యాజ‌మాన్యానికి తెలియ‌జేస్తూ ఉండండి. అలాగే ఈ ఖ‌ర్చుల‌న్నీ పోగా ప‌న్ను ఆదా కోసం ఇంకెన్ని పెట్టుబ‌డులు పెట్టాలో కూడా విశ్లేంషించండి.

2) ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌ను విశ్లేషించుకోండి

ప‌న్ను ఆదా కోసం ఇంకెంత మేర పెట్టుబ‌డులు పెట్టాలో అన్న విష‌యం రూఢీ అయ్యాకా, మీరు తీసుకునే రిస్క్‌, మీ వ‌ద్ద‌నున్న న‌గ‌దు ల‌భ్య‌త, రాబడుల ఆధారంగా సాధ్య‌మైనన్ని అవ‌కాశాల‌ను అన్వేషించండి.

3) అవ‌స‌ర‌మైన ప‌త్రాలను ద‌గ్గ‌ర ఉంచుకోండి

ప‌న్ను ఆదా కోసం మీరు ఎన్ని పెట్టుబ‌డులు పెట్టినా వాట‌న్నింటికీ సంబంధించిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా మీ సంస్థ యాజ‌మాన్యం మిమ్మ‌ల్ని అడుగుతుంటారు. కాబ‌ట్టి ఆయా పెట్టుబ‌డుల‌కు సంబంధించిన బిల్లులు, ర‌శీదులు వ‌గైరా లాంటివి మీ దగ్గ‌ర జాగ్ర‌త్త‌గా ఉంచుకోండి.

4) పురోగ‌తిని స‌మీక్షిస్తుండండి

మంచి ఆర్థిక జీవ‌నం అల‌వ‌డాలంటే మీ పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన పురోగ‌తిని త‌రచుగా స‌మీక్షిస్తుండండి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన ఆర్థిక ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకుని వాటికి త‌గ్గ‌ట్లు పెట్టుబ‌డులు పెడుతూ పోతుంటే మీ ల‌క్ష్యాల‌ను చేరే క్ర‌మంలో మీరు వెన‌క‌బ‌డిపోరు.

5) పీపీఎఫ్‌లోని సొమ్మును స‌మ‌ర్థ‌వంతంగా వాడండి

ప‌న్ను ఆదాతో పాటు, పెట్టుబ‌డుల‌పై మంచి రాబ‌డుల‌కు పీపీఎఫ్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఒక మంచి మార్గం. మీరు పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఏడేళ్లు దాటిన‌ట్ల‌యితే పాక్షికంగా న‌గదు ఉపసంహ‌రించుకుని మ‌ళ్లీ పీపీఎఫ్‌లో గానీ వేరే ఇత‌ర ప‌న్ను ఆదా ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది. ఇలా చేస్తే మీకు న‌గ‌దు ల‌భ్య‌త స‌మ‌స్య ఉండ‌దు.

6) ఇంటి అద్దె భ‌త్యం క్లెయిం చేసుకోండి

ఇంటి అద్దె భ‌త్యంను క్లెయిం చేసుకునేందుకు చాలా సంద‌ర్భాల‌లో అద్దె ర‌శీదులు, అద్దె ఒప్పంద అంగీకార ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. అయితే మీరు ఏడాదికి చెల్లించే అద్దె రూ.1 ల‌క్ష మించిన‌ట్ల‌యితే మీ ఇంటి య‌జ‌మాని పాన్ కార్డును కూడా పై ప‌త్రాల‌తో పాటు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

7) ప్ర‌యాణ భ‌త్యం క్లెయిం చేసుకోండి

ప్ర‌యాణ భత్యా(ఎల్‌టీఏ)నికి సంబంధించిన కొత్త బ్లాక్ పీరియ‌డ్ ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మొదలైంది. గ‌త బ్లాక్ పీరియ‌డ్‌లో దేశీయంగా చేసిన ప్ర‌యాణాల‌కు సంబంధించి ఎల్‌టీఏని క్లెయిం చేసుకోక‌పోతే 2018 లో క్లెయిం చేసుకోవ‌చ్చు. 4 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల బ్లాక్ పీరియ‌డ్‌లో రెండు సార్లు ప్ర‌యాణాల‌కు సంబంధించిన ఎల్‌టీఏని క్లెయిం చేసుకోవ‌చ్చు. ఒక వేళ గ‌తంలో ఏవైనా అన్‌క్లెయిమ్‌డ్ ఎల్‌టీఏలుంటే ఈ ఏడాదిలో క్లెయిం చేసుకోవ‌చ్చు.

8) వ‌యోవృద్ధుల‌కు సంబంధించిన వైద్య ఖ‌ర్చులు

మీ తల్లిందండ్రులు గానీ ఇంకా పెద్ద‌వాళ్లు గానీ ఉండి వారికి బీమా స‌దుపాయం లేన‌ట్ల‌యితే, వారికైన వైద్య‌, ఆరోగ్య ఖ‌ర్చుల‌కు సంబంధించి మీరు ప‌న్ను మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు. అంత‌కుముందు ఈ స‌దుపాయం సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు కూడా అమ‌లు చేస్తున్నారు.

9) ఉద్యోగం మారాల‌నుకుంటున్నారా

ఆర్థిక సంవ‌త్స‌రం మ‌ధ్య‌లోనే ఉద్యోగం మారాల‌నుకుంటున్నారా, అయితే మీ కొత్త సంస్థ యాజ‌మాన్యానికి ఫారం 12 బీ ని స‌మ‌ర్పించ‌డం మరిచిపోకండి. గ‌తంలో మీ ఆదాయం ఎంతం, టీడీఎస్‌ల‌ను లెక్కించడానికి ఈ ఫారం ద్వారా కొత్త సంస్థ‌కు వీలు చిక్కుతుంది.

10) రుణాల‌తో పెట్టుబ‌డుల‌ను పోల్చండి

కేవ‌లం ప‌న్ను ఆదా కోసం మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్ట‌కండి. మీకు ఇప్ప‌టికే అధిక వ‌డ్డీతో కూడిన రుణానికి చెల్లింపులు జ‌రుపుతున్న‌ట్ల‌యితే దానిని వీలైనంత త్వ‌ర‌గా తీర్చేందుకు ప్ర‌య‌త్నించండి. ఎందుకంటే ఆర్థికంగా ఇది మీకు భార‌మ‌వుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 15 శాతం వ‌డ్డీతో కూడిన వ్య‌క్తిగ‌త రుణం తీసుకున్న‌ట్ల‌యితే, అందుకు బ‌దులుగా ఏటా 7.9 శాతం వ‌డ్డీనిచ్చే పీపీఎఫ్‌లో మ‌దుపు చేయ‌డం మంచిది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly