ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ గృహ రుణం

బ్యాంకులో ఖాతా ఉన్న వేత‌న జీవుల‌కు ఐపీఐసీఐ బ్యాంక్ కోటి రూపాయ‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ గృహ రుణాన్ని అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కోటి రూపాయ‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ గృహ రుణం

ప్ర‌వేటు రంగా ఐసీఐసీఐ బ్యాంక్ కోటి రూపాయ‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ గృహ రుణాన్ని అందించే ఇన్‌స్టంట్‌ హోమ్‌ లోన్‌, ఇన్‌స్టా టాప్‌ అప్‌ లోన్‌ అనే రెండు ర‌కాల ఉత్ప‌త్తుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం తుది ఆమోదం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పొందే రెండు రకాల గృహ రుణ ఉత్పతుల్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. వీటి ద్వారా వినియోగదార్లు రూ.1 కోటి వరకు వెంటనే రుణం పొందొచ్చని తెలిపింది.
‘ఇన్‌స్టంట్‌ హోమ్‌ లోన్‌’ పథకం కింద ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా కలిగిన, ముందస్తు ఆమోదం పొందిన (ప్రీ అప్రూవ్డ్‌) ఉద్యోగులు 30 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి వరకు గృహ రుణం పొందొచ్చు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డిజిటల్‌ పద్ధతిలో వెంటనే ఈ రుణం పొందే అవకాశం ఉంది.

‘ఇన్‌స్టా టాప్‌ అప్‌ లోన్‌’ పథకం కింద ఇప్పటికే గృహ రుణం ఉన్న ఖాతాదారులు 10 ఏళ్ల వ్యవధితో రూ.20 లక్షల వరకు, అదనపు గృహ రుణం పొందే అవకాశం కల్పించింది. కాగితాలతో పని లేకుండా డిజిటల్‌ పద్ధతిలో ఈ రుణాలు పొందే వెసులుబాటును బ్యాంకు కల్పించింది. ఈ రెండు రకాల రుణాలకు సంబంధించిన మొత్తం సదరు ఖాతాదారుడి ఖాతాలోకి వెంటనే వచ్చి చేరుతుందని బ్యాంక్‌ ప్రకటించింది.

దీంతో కొత్త‌గా ఇంటిని కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌వారికి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంకు వినియోగ‌దారులు ఈ స‌దుపాయం పొందుతారు. టైర్ 2, టైర్ 3 ప‌ట్ట‌ణాలు, సూక్ష్మ మార్కెట్‌పై దృష్టి సారించిన‌ట్లు బ్యాంకు తెలిపింది. అఫ‌ర్డ‌బుల్ హౌసింగ్ ప్రాజెక్టులతో మోర్ట‌గేజ్ పోర్ట్‌ఫోలియో వేగంగా వృద్ధి చెందుతుంద‌ని వెల్ల‌డించింది.

ఈ కింది కథనాలు కూడా చదవండి:
ఎస్‌బీఐ మ్యాక్స్ గెయిన్ గృహ రుణంపై అవగాహన పొందండిలా…
రుణంతో ఇల్లు - తిరిగి చెల్లింపులు

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly