విద్యార్థులు అదనపు ఆదాయం పొందేందుకు 20 మార్గాలు

చ‌దువుకునే స‌మ‌యంలో ఆదాయాన్ని పొందేందుకు విద్యార్థులకు అనువైన‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ వ్యాపార మార్గాలు

విద్యార్థులు అదనపు ఆదాయం పొందేందుకు 20 మార్గాలు

విద్యార్థుల‌కు చ‌దువు పూర్తికాగానే ఉద్యోగం సంపాదించ‌డం ఎంత క‌ష్ట‌మో తెలిసిందే. దీంతో నిరుద్యోగులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి విద్యార్థులు కేవ‌లం ఉద్యోగం కోసం వేచిచూడ‌కుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించ‌డం మంచి ఆలోచ‌న‌. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే చాలా ప్ర‌యోజ‌నాలుంటాయి. విద్యా రుణం వంటివి తీసుకోవ‌డం త‌ప్పుతుంది. ఇత‌ర ఆర్థిక విష‌యాల్లో కుటంబ‌స‌భ్యుల‌కు మీ వంతు స‌హ‌కారం అందించిన‌వార‌వుతారు. విద్యార్థి ద‌శ‌లో ఉన్న‌ప్పుడు త‌క్కువ ఖ‌ర్చుతో లేదా పెట్టుబ‌డి లేకుండా ఏదైనా మంచి వ్యాపారం పెట్టాల‌నే ఆలోచ‌న ఉన్న‌వారికోసం అందుబాలో ఉన్న కొన్ని వ్యాపార సూచ‌న‌లు మీకోసం…

 1. బ్లాగ‌ర్ (Blogger)
  ఆన్‌లైన్ వ్యాపారాల్లో విద్యార్థుల‌కు సుల‌భంగా ఉండేది బ్లాగింగ్. ఇది వారికి మంచి ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు. ఫైనాన్స్, ట్రావెలింగ్, టెక్నాల‌జీ వంటి ఏదైనా ప్ర‌త్యేక అంశాల‌తో కూడిన బ్లాగ్‌ను ఏర్పాటుచేయాలి. ఒక‌సారి బ్లాగ్‌కు ట్రాఫిక్ పెరిగిన త‌ర్వాత ప్ర‌క‌ట‌న‌ల‌నుంచి నేరుగా డ‌బ్బులు పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టికే చాలామంది ఈ విధంగా బ్లాగింగ్ ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు.

 2. వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్
  వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ కూడా విద్యార్థుల‌కు ఉన్న వ్యాపార మార్గాల‌లో సూచించ‌ద‌గిన‌ది. ఇది పూర్తి ఆన్‌లైన్ వ్యాపారంగా చెప్పుకోవ‌చ్చు. Amazon Mturk, Fiverr వంటి వాటిలో లాగిన్ తో ఉద్యోగం పొంద‌వ‌చ్చు. లెట‌ర్ టైపింగ్, ఈమెయిల్ రిప్ల‌యింగ్ , మీటింగ్ స్కెడ్యులింగ్ వంటివి చేయాల్సి ఉంటుంది. ప‌ని గంట‌ల‌ను బ‌ట్టి డ‌బ్బును అంద‌జేస్తారు.

 1. యూట్యూబ్‌లో ఫేమ‌స్ అయిపోండి
  మ‌రొక అద్చుత‌మైన ఐడియా యూట్యూబ్‌లో ఫేమస్ కావ‌డం. యూట్యూబ్‌లో మీకు ఉన్న ప్ర‌తిభ‌ను న‌లుగురికి న‌చ్చేలా మ‌లిచి వీడియోను అప్‌లోడ్ చేసి సెల‌బ్రిటీ అయిపోవ‌చ్చు. దీనికోసం సొంతంగా యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించాల్సి ఉంటుంది. సినిమాలు, గాసిప్స్‌, వార్త‌లు, కామెడి ఇలా ఏదైనా ప్ర‌త్యేక‌త ఉన్న వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తే మంచి పేరుతో పాటు త‌గిన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన వీడియోల‌ను పోస్ట్ చేయాలి. ఒక‌సారి మీ ఛాన‌ల్ పాపుల‌ర్ అయిపోతే యూట్యూబ్ ఛాన‌ల్ పాట్న‌ర్ ప్రోగ్రామ్‌కి అప్ల‌య్ చేయ‌వ‌చ్చు. ఇది ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌చురించ‌డం ద్వారా మీరు ఆదాయం పొందేందుకు ఉప‌క‌రిస్తుంది.

 2. ఈ-బుక్ ర‌చ‌యిత‌
  ఈ-బుక్ ర‌చ‌యిత ప‌ని ఏంటంటే సొంతంగా ఒక పుస్త‌కం రాసి ఆన్‌లైన్‌లో అమెజాన్ లేదా ఈబే ద్వారా విక్ర‌యించ‌వ‌చ్చు. మీకు ర‌చ‌నా నైపుణ్యం ఉండి ఇంగ్లీష్ మీద మంచి ప‌ట్టు ఉంటే ఇది స‌రైన ఆప్ష‌న్ అని చెప్పుకోవ‌చ్చు. ఈ వ్యాపారంలో వేర్వేరు అంశాల‌తో కూడిన పుస్త‌కాల‌ను రాయాలి. కోర్సు బుక్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ-బుక్‌ను ప్ర‌మోట్ చేసేందుకు కొంత శ్ర‌మించాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా చాలా ఆదాయం పొంద‌వ‌చ్చు.

 3. పెయిడ్ స‌ర్వే
  పెయిడ్ స‌ర్వే అంటే వేర్వేరు ఉత్ప‌త్తుల‌పై మీ అభిప్రాయాన్ని ఆన్‌లైన్‌లో తెలియ‌జేయాల్సి ఉంటుంది. చాలా కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల గురించి నిజ‌మైన అభిప్రాయాల‌ను తెలుసుకోవాల‌నుకుంటాయి. దీనికోసం త‌గినంత చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు SwagBucks, SurveySavvy వంటి వివిధ స‌ర్వే వెబ్‌సైట్లలో లాగిన్‌ కావాలి. త‌ర్వాత త‌గినంత ఆదాయాన్ని పొందే అవ‌కాశం ఉంటుంది.

 4. పీటీసీ (పే టు క్లిక్) యాడ్స్
  పీటీసీ అనేది కొత్త ప్రొఫెష‌న్. దీంతో అడ్వ‌ర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేస్తే ఆదాయం పొంద‌వ‌చ్చు. చాలావ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌మైన పీటీసీ వెబ్‌సైట్లు ఈ స‌ర్వీసుల‌ను అందిస్తున్నాయి. ఇందులో రిజిస్ట‌ర్ చేసుకొని వెబ్‌సైట్ ప‌ని ప్రారంభించాలి. దీనిపై కేవ‌లం ఒక‌టి లేదా రెండు గంట‌లు ప‌నిచేసి మంచి ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు.

 5. అనుబంధ మార్కెటింగ్‌
  పెట్టుబ‌డులు అవ‌స‌రం లేకుండా ప్రారంభించే వ్యాపారాల‌లో అనుబంధ మార్కెట్ కూడా మ‌రోటి. అంటే అనుబంధ కంపెనీల‌కు ఉత్ప‌త్తుల‌ను లేదా సేవ‌ల‌ను విస్త‌రించ‌డం ద్వారా అమ్మ‌కాల‌ను పెంచేందుకు స‌హ‌క‌రించాలి. ప్ర‌తి విక్ర‌యానికి మీకు క‌మీష‌న్ ల‌భిస్తుంది. చాలా కంపెనీలలో ఈ ర‌క‌మైన కార్య‌క‌లాపాలు అందుబాటులో ఉన్నాయి. మీరు అఫిలియేట్‌గా రిజిస్ట‌ర్ చేసుకుంటే లింక్‌తో పాటు ప్ర‌మోష‌న్ మెటీరియ‌ల్ కూడా అందిస్తారు. మీరు ఈ మెటీరియ‌ల్‌ను ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఈ-మెయిల్ వంటి మాధ్య‌మాల‌ ద్వారా షేర్ చేసి ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు.

 6. ఫ్రీలాన్స‌ర్‌
  ఫ్రీలాన్సింగ్‌ కోసం ప్ర‌త్యేక‌మైన నైపుణ్యాలు అవ‌స‌రం. ఉదాహ‌ర‌ణ‌కు డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్, మొబైల్ యాప్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఎస్ఈఓ వంటివి. ఇందులో మీకు ప్ర‌తిభ ఉండి నిపుణులు అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. అయితే దీనికి డెడ్‌లైన్స్ ఉంటాయి. క‌చ్చిత‌మైన స‌మ‌యానికి ప‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. UpWork, Murk వంటి కొన్ని వెబ్‌సైట్లు ఫ్రీలాన్స‌ర్ జాబ్స్ ఆఫ‌ర్ చేస్తున్నాయి.

 7. ఆన్‌లైన్‌లో వ‌స్తువుల‌ను అమ్మ‌కాలు-కొనుగోళ్లు
  ఆన్‌లైన్‌లో వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం, విక్ర‌యించ‌డం అనేది చాలా సుల‌భ‌మైన వ్యాపారంగా చెప్పుకోవ‌చ్చు. మీ వ‌ద్ద ఉన్న వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించ‌డం లేదా వ‌స్తువుల‌ను త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యించ‌డం వంటివి చేయ‌వ‌చ్చు. అయితే వ‌స్తువుల ఎంపిక‌ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.

 8. డిజిట‌ల్ మార్కెటింగ్
  డిజిట‌ల్ మార్కెటింగ్ అనేది స‌రికొత్త కెరియ‌ర్ ఆప్ష‌న్. చాలావ‌ర‌కు కంపెనీలు వారి ఉత్ప‌త్తుల‌ను మార్కెటింగ్ చేసేందుకు. ఆన్‌లైన్ నిపుణుల కోసం చూస్తుంటాయి. డిజిట‌ల్ మార్కెటింగ్ అంటే స‌ర్చ్ ఇంజ‌న్ మార్కెటింగ్, సోష‌ల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ వంటివి వ‌స్తాయి. డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్స్‌లో ముందు చేరి ఆ త‌ర్వాత వ్యాపారం ప్రారంభించ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఆఫ్‌లైన్ పార్ట్‌టైమ్ వ్యాపార మార్గాలు

 1. హోమ్ ట్యూష‌న్‌
  ఆఫ్‌లైన్ వ్యాపారం అంటే విద్యార్థుల‌కు స‌రిప‌డే మొద‌టి ప‌ని హోమ్ ట్యూషన్ అంటే ఇంట్లోనే పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డం. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌గ‌లిగే నైపుణ్యం ఉన్న విద్యార్థులు ఈ త‌రహా ఉద్యోగాన్ని ఎంచుకోవ‌చ్చు. ఖాళీ స‌మ‌యంఓ వాళ్ల ఇంటికి వెళ్లి పాఠాలు చెప్పి త‌గినంత డ‌బ్బు సంపాదించుకోవ‌చ్చు.

 2. కంప్యూట‌ర్ రిపేర్
  ఇక ఆఫ్‌లైన్‌లో చేసుకోగ‌లిగే రెండ‌వ ప‌ని కంప్యూట‌ర్ రిపేర్ బిజినెస్. దీనికోసం కంప్యూట‌ర్ హార్డ్‌వేర్‌పై ప‌ట్టుండాలి. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేముందు Jetking లేదా ITI లో ఐటీ కోర్సు నేర్చుకోవాలి. వ్యాపారాన్ని విస్త‌రించేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ కూడా ప్రారంభించ‌వ‌చ్చు. మొద‌ట స‌ర్వీస్ నుంచి ప్రారంభించి ఆ త‌ర్వాత ఐటీ హార్డ్‌వేర్ విక్ర‌యాల వ‌ర‌కు వ్యాపారాన్ని విస్త‌రించుకోవ‌చ్చు.

 3. డీజే స‌ర్వీసెస్
  డీజే స‌ర్వీసెస్ విద్యార్థుల‌కు చాలా ఇష్ట‌మైన పాపుల‌ర్ బిజినెస్‌గా చెప్పుకోవ‌చ్చు. సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు సృజ‌నాత్మ‌కంగా ఆలోచించేవారు ఈ వ్యాపారాన్ని మొద‌లుపెట్ట‌వ‌చ్చు. సీడీ ప్లేయ‌ర్‌, ట‌ర్న‌బుల్, మిక్స‌ర్స్, స్పీక‌ర్ వంటి వాటిపై పెట్టుబ‌డులు పెట్టి ప్రారంభించ‌వ‌చ్చు.

 4. కంప్యూట‌ర్ శిక్ష‌ణ‌
  కంప్యూట‌ర్ శిక్ష‌ణ ఇవ్వ‌డం అనేది కూడా మ‌రో మంచి వ్యాపార ఆలోచ‌న‌. ఇప్పుడు ఏ రంగంలో అయిన కంప్యూట‌ర్ గురించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న అవ‌స‌రం. ఐటీ నైపుణ్యాలు, కంప్యూట‌ర్ మీద ప‌ట్టు ఉన్న‌ విద్యార్థులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. ఇంటి నుంచి కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. దీనికోసం కొన్ని పాత కంప్యూట‌ర్లు తీసుకొని శిక్ష‌ణ ప్రారంభించాలి.

 5. బీమా ఏజెన్సీ
  బీమా ఏజెన్సీ అనేది పార్ట్‌-టైమ్ ఉద్యోగాల‌కు స‌రిపోయే ఆలోచ‌న‌. ఈ వ్యాపారంలో బీమా పాల‌సీలు విక్ర‌యించాల్సి ఉంటుంది. ప్ర‌తి పాల‌సీ మీద క‌మీష‌న్ ల‌భిస్తుంది. దీనికోసం మాట్లాడే నైపుణ్యం, నేర్ప‌రిత‌నం క‌లిగి ఉండాలి. ఎలాగైనా బీమా పాల‌సీ తీసుకునే విధంగా ఇత‌రుల‌ను ఒప్పించ‌గ‌ల‌గాలి.

 6. ఎంఎల్ఎం నెట్‌వ‌ర్క్ మార్కెటింగ్
  ఎంఎల్ఎం లేదా నెట్‌వ‌ర్క్ మార్కెటింగ్ బిజినెస్ కూడా మంచి ఐడియా అనే చెప్పుకోవ‌చ్చు. ఈ వ్యాపారంలో రాణించేంద‌కు బాగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇందులో అనుబంధ కంపెనీల‌కు సంబంధించిన‌ ఉత్ప‌త్తులు లేదా సేవ‌ల‌ను విక్ర‌యించాల్సి ఉంటుంది. అమ్మ‌కాల ఆధారంగా క‌మీష‌న్ ల‌భిస్తుంది.

 7. లోక‌ల్ టూర్ గైడ్
  లోక‌ల్ టూర్ గైడ్ అనేది ప్ర‌త్యేక‌ ప్రాంతాల‌కు సంబంధిచినది. ప‌ర్యాట‌క ప్రాంతాల్లో నివ‌సిస్తుంటే లేదా చ‌దువుతున్న‌వారైతే ఇది స‌రైన వ్యాపారంగా చెప్పుకోవ‌చ్చు. ఈ వ్యాపారంలో మీరు ట్రావెల్ గైడ్ మాదిరిగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం గురించి బౌగోళిక విశేషాలు, చ‌రిత్ర గురించి పూర్తి గా తెలుసుండాలి.

 8. అకౌంట్ అండ్ రికార్డ్ కీపింగ్
  ఫైనాన్స్ సాఫ్ట్‌వేర్ లో ప్ర‌తిభ ఉన్న‌వారైతే అకౌంట్ అండ్ రికార్డ్ కీపింగ్ బిజినెస్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. ఇందులో ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన రికార్డుల‌న్నీ భ‌ద్ర‌ప‌ర‌చాల్సి ఉంటుంది. దీనికి కొంత క‌చ్చిత‌మైన డ‌బ్బు మీకు అందుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ అవ‌స‌రం ఉండొచ్చు.

 9. హౌజ్ క్లీనింగ్ స‌ర్వీసెస్‌
  ఇంటిని శుభ్రం చేసే ప‌నులు కూడా విద్యార్థుల‌కు పార్ట్ టైమ్ బిజినెస్‌గా చేసుకోవ‌చ్చు. దీనికోసం నైపుణ్యాలు అవ‌స‌రం లేదు ప‌నిచేసే వ్య‌క్తులు ఉంటే చాలు. కాంట్రాక్ట్ తీసుకొని వ్య‌క్తుల‌ను నియ‌మించుకొని ప‌ని ప్రారంభించ‌వ‌చ్చ‌. దీనికోసం క్లీనింగ్ కిట్, వాక్యుమ్ క్లీన‌ర్ వంటివి అవ‌స‌రం అవుతాయి.

 10. హోమ్ రిపేర్ స‌ర్వీసెస్
  ఇంటికి సంబ‌ధించిన మ‌రో వ్యాపారం హోమ్ రిపేరింగ్ స‌ర్వీసెస్ . ప్ర‌తి ఇంటికి రిపేరింగ్ అవ‌స‌రం ఉంటుంది. కాబ‌ట్టి ఇది చాలా మంచి వ్యాపారం అవుతుంది. సివిల్‌, ప్లంబింగ్, ఎల‌క్ర్టిక‌ల్ వంటి విభాగాల‌లో నిపుణుల‌ను నియ‌మించుకొని వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు.

చివ‌ర‌గా:
చేయాల‌నుకుంటే చాలా వ్యాపారాలు విద్యార్థుల‌కు అందుబాటులో ఉన్నాయి. ఎందులో నైపుణ్యాలు ఉన్నాయో దానిని ఎంచుకొని త‌గిన స‌మ‌యం కేటాయించాలి. మీ చ‌దువుల‌కు వ్యాపారం ఆటంకం క‌లిగించ‌కుండా చూసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly