ఆరోగ్య బీమాలో చోటుచేసుకున్న 5 మార్పులు

వినియోగ‌దారుల సౌక‌ర్యార్ధం, మ‌రింత ప్రామ‌ణికంగా ఆరోగ్య బీమా పాల‌సీల‌ను అందించే లక్ష్యంతో ఐఆర్‌డీఏఐ ప‌నిచేస్తుంది

ఆరోగ్య బీమాలో చోటుచేసుకున్న 5 మార్పులు

ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేవారు, ప్రీమియంను ఇక‌పై నెల‌వారీ, త్రైమాసిక, అర్థ సంవ‌త్స‌రం మొద‌లైన వాయిదాల‌లో చెల్లించ‌వ‌చ్చ‌ని ఇన్సురెన్స్ రెగ్యూలేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అంత‌కు ముందు ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రీమియంను వార్షిక ప్రాతిప‌దిక‌న వ‌సూలు చేసేవి.

బీమా పాల‌సీల‌ను మ‌రింత ప్రామాణికంగా, ప్ర‌జ‌ల‌కు చేరువ చేసే విధంగా ఐఆర్‌డీఏఐ ప్ర‌స్తుతం అనేక మార్పులు చేస్తుంది. ఆరోగ్య బీమాలో ఇటీవ‌ల చేసిన కొన్ని మార్పులను ఇప్పుడు చూద్దాం:

  1. బీమా పాల‌సీల గ‌రిష్ట వ‌యోప‌రిమితిని పెంచేందుకు బీమా సంస్థ‌ల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు, నియంత్ర‌ణ సంస్థ‌ గ‌త నెల‌లో విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌లో పేర్కొంది. సాధార‌ణంగా ఆరోగ్య బీమా పాల‌సీల గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 65 సంవ‌త్స‌రాలు ఉంటుంది. మార్పు గురించి ధృవీక‌ర‌ణ ప్రాతిప‌దిక‌న‌ బీమా సంస్థ, రెగ్యులేట‌ర్‌కు తెలియ‌జేయాల్సి ఉంటుంద‌ని ఐఆర్‌డీఏఐ తెలిపింది.
  1. ఆరోగ్య బీమా పాల‌సీను ఇక‌పై వాయిదాల(నెల‌వారీ, త్రైమాసికం, అర్థ సంవ‌త్స‌రం) ప‌ద్ద‌తిలో చెల్లించేందుకు అనుమ‌తించింది. అయితే బీమా నియ‌మ, నిబంధ‌న‌ల‌లో ఎలాంటి మార్పులు ఉండ‌వు.

  2. నిర్థిష్ట పాల‌సీల‌ కోసం అద‌న‌పు పంపిణీ మార్గాల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఆరోగ్య బీమా సంస్థలను అనుమతించింది. ధృవీకరణ ప్రాతిపదికన(స‌ర్టిఫికేష‌న్ బేసిస్‌) ఆమోదించిన వ్య‌క్తిగ‌త బీమా పాల‌సీల‌లో చిన్న చిన్న మార్పులు చేయ‌వ‌చ్చు. ఇందుకోసం రెగ్యూలేట‌ర్ ఆమోదం కోసం వేచిచూడాల్సిన అవ‌స‌రం లేదు.

  3. మార్పుల కార‌ణంగా వ‌చ్చే న‌ష్ట నిష్ప‌త్తిని ఆధారంగా చేసుకుని బీమా సంస్థ‌లు, ఆరోగ్య బీమా ప్రీమియంల‌ను 15 శాతం పెంచ‌వ‌చ్చు లేదా త‌గ్గించ‌వ‌చ్చు. ఒక‌వేళ పెంచాల్సి వ‌స్తే, వ్య‌క్తిగ‌త పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెట్టిన నాటి నుంచి మూడు సంవ‌త్స‌రాల త‌రువాత మాత్ర‌మే ప్ర‌మీయం రేట్ల‌ను పెంచ‌వచ్చ‌ని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

  4. వినియోగ‌దారుల సౌక‌ర్యార్ధం, నిర్ధిష్ట ఆరోగ్య బీమా పాల‌సీలను వృద్ది చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి. ముందుగా ఉన్న వ్యాధిని వెల్ల‌డించిన వారికి ఆరోగ్య బీమా క‌వ‌రేజ్‌ని విస్త‌రించేందుకు బీమా సంస్థ‌లు ప్ర‌య‌త్నించాల‌ని ఐఆర్‌డీఏఐ బీమా సంస్థ‌ల‌ను కోరింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly