2019 బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపు పన్ను నిబంధనలలో 5 కీలక మార్పులు

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 2019 బడ్జెట్‌లో పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది

2019 బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపు పన్ను నిబంధనలలో 5 కీలక మార్పులు

ఈ సంవత్సరానికి ఆదాయపు పన్ను నిబంధనలలో అనేక మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లలో ఎటువంటి మార్పులేదు. కాని చాలా మంది పన్ను చెల్లింపుదారులను ప్రభావితం చేసే కొత్త ఆదాయపు పన్ను ప్రతిపాదనలను ప్రకటించారు. పన్ను దాఖలు చేసే ప్రయోజనం కోసం పాన్ కు బ‌దులు ఆధార్ ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని ప్రభుత్వం ప్రకటించింది. దీని అర్థం మీకు పాన్ లేకపోతే, మీరు ఆధార్ ఉపయోగించి రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

రూ. 45 లక్షల కన్నా తక్కువ విలువ క‌లిగిన‌ సరసమైన గృహ రుణాలపై రూ. 1.5 లక్షల అదనపు ఆదాయపు పన్ను మినహాయింపు. ఈ ప్రయోజనం మార్చి 2020 వరకు తీసుకున్న గృహ రుణాలకు అందుబాటులో ఉంటుంది. మొత్తంమీద, గృహ రుణం పై చెల్లించే వడ్డీ ప్రస్తుత ఉన్న రూ.2 లక్ష నుంచి . రూ. 3.5 లక్షల వరకు పెరుగుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం రుణాలపై చెల్లించే వడ్డీపై రూ. 1.5 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపును ప్రభుత్వం ప్రకటించింది.

సంవత్సరంలో రూ. 1 కోటికి మించిన మొత్తంపై నగదు ఉపసంహరణపై 2% టిడిఎస్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

సిపిఎస్‌ఇ (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు) ఇటిఎఫ్‌లలో రిటైల్ పెట్టుబడిదారులు బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఇఎల్‌ఎస్‌ఎస్ లాంటి ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఏడాది ప్రభుత్వం ఈ రోజు రూ.1.05 లక్షల కోట్ల ఉపసంహరణ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం, మూడు సంవత్సరాల లాక్-ఇన్ కాలంతో వచ్చే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు.

హెచ్‌ఎన్‌ఐ (అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు) ఆదాయానికి సంవత్సరానికి రూ. 2 కోట్లకు పైగా ఆదాయపు పన్ను సర్‌చార్జిని పెంచింది. రూ. 2-5 కోట్ల మధ్య సంపాదించే వారికి సర్‌చార్జ్ రేటు 15% నుంచి 25% కి పెంచింది. రూ. 5 కోట్లకు పైగా సంపాదించే వారు ప్రస్తుత 15% నుంచి 37% సర్‌చార్జిని చెల్లించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly