ఈ నెల‌లో అమ‌ల్లోకి వ‌చ్చిన ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌లు

కోటి రూపాయ‌ల‌కు మించి నగదు ఉపసంహరణపై 2 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది

ఈ నెల‌లో అమ‌ల్లోకి వ‌చ్చిన ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌లు

బ‌డ్జెట్ 2019 లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల్లో కొన్ని మార్పులు చేసిన‌ట్లు ప్ర‌కటించారు. సెప్టెంబ‌ర్ 1 నుంచి మారిన ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌లు ప‌రిశీలిస్తే…

1.కాంట్రాక్ట‌ర్లు, వృత్తి నిపుణుల‌కు, బ్రోక‌ర్ల‌కు చెల్లింపుల‌పై టీడీఎస్:
స్థానిక‌ కాంట్రాక్ట‌ర్లు, వృత్తి కాంట్రాక్ట‌ర్లు , బ్రోకర్లకు… వ్య‌క్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు చేసే చెల్లింపులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50 ల‌క్ష‌లు దాటితే 5 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

  1. స్థిరాస్తి కొనుగోలుపై టీడీఎస్‌:
    స్థిరాస్తి కొనుగోళ్ల‌ చెల్లింపుల విష‌యంలో… కొనుగోలుదారు క్లబ్ సభ్యత్వ రుసుము, నిర్వహణ రుసుము, ముందస్తు రుసుము, కార్ పార్కింగ్ ఫీజు, విద్యుత్, వాట‌ర్ ఛార్జీలు అన్ని క‌లిపి రూ.50 ల‌క్ష‌లు దాటితే 1 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

3.పాన్- ఆధార్ పరస్పర మార్పిడి:
ఒక వ్యక్తి ఆధార్ నంబర్- పాన్‌తో అనుసంధానం చేసిన‌ప్పుడు పాన్ అవ‌స‌ర‌మైన చోట ఆధార్‌ను చూప‌వ‌చ్చు. ఒక‌వేళ వారికి పాన్ లేక‌పోతే జారీ చేస్తారు.

  1. నగదు ఉపసంహరణపై టీడీఎస్:
    ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా వ్య‌క్తులు కోటి రూపాయ‌ల‌కు మించి నగదు విత్‌డ్రా చేసుకుంటే 2 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది.

5.పన్ను పరిధిలోకి వచ్చే జీవిత బీమాపై టీడీఎస్:

పాలసీ ప్రకారం, ఇంత‌కు ముందు ఉన్న‌ స్థూల మెచ్యూరిటీ చెల్లింపులో 1% టీడీఎస్‌కు బదులుగా, పన్ను పరిధిలోకి వచ్చే జీవిత బీమా నికర ఆదాయంపై 5% టీడీఎస్ విధించాల‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, జీవిత బీమా పాలసీలో హామీ ఇచ్చిన‌ మొత్తం వార్షిక ప్రీమియం కంటే కనీసం 10 రెట్లు ఉంటే బీమా పాలసీ మెచ్యూరిటీ ఆదాయాన్ని, ఆదాయపు పన్ను నుంచి మినహాయించారు. ఏప్రిల్ 2012 కి ముందు జారీ చేసిన పాలసీల మెచ్యూరిటీపై పన్ను ప్రయోజనం పొందడానికి ప్రీమియం హామీ, ఇచ్చిన మొత్తంలో 20% కన్నా తక్కువ ఉండాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly