క్ర‌మ‌మైన ఆర్థిక జీవ‌నానికి 5 ముఖ్య మార్గాలు

పొదుపు చేయ‌డం, పెట్టుబ‌డులు పెట్ట‌డం మాత్ర‌మే కాదు, వాటిని స‌రైన విధంగా నిర్వ‌హించ‌డం కూడా ముఖ్య‌మే.

క్ర‌మ‌మైన ఆర్థిక జీవ‌నానికి 5 ముఖ్య మార్గాలు

ల‌క్ష్యాల‌ను సాధించేందుకు పొదుపు చేయ‌డం, పెట్టుబ‌డి పెట్ట‌డం వంటివి చాలా ముఖ్యం. ఆర్థిక ల‌క్ష్యాల‌తో పాటు ర‌క్ష‌ణ కోసం అత్య‌వ‌స‌ర నిధి, జీవిత‌బీమా వంటి వాటిని తీసుకోవాలి. ఆర్థిక ప్ర‌ణాళిక‌, పెట్టుబ‌డుల మార్గంలో ఉన్న‌వారు పెట్టుబ‌డులు పెట్ట‌డం మాత్ర‌మే కాదు, వాటి గురించి స‌రైన శ్ర‌ధ్ద చూపించాలి. ఇందుకుగాను తెలుసుకోవ‌ల్సిన 5 ముఖ్య విష‌యాలు.

 1. కుటుంబ భాగ‌స్వామ్యం:
  భార‌త‌దేశంలో ఆర్థిక అల‌వాట్ల గురించి ఎక్సైడ్ జీవిత బీమా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ప్ర‌తీ ముగ్గురు భార‌తీయుల‌లో ఇద్ద‌రు వారి ఆర్థిక లావాదేవీల గురించి వారి కుటుంబానికి తెలియ‌జేయడం లేద‌ని తేలింది. కుటుంబంలోని ఇత‌ర స‌భ్యులను మాత్ర‌మే కాకుండా వారి జీవిత భాగ‌స్వామికి కూడా ఆర్థిక నిర్ణ‌యాల గురించి తెలియ‌జేయ‌టం లేదు. ఆర్థిక‌ ప‌ర‌మైన నిర్ణ‌యాల‌లో కుటుంభ స‌భ్యుల‌ను భాగం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా సంద‌ర్భాల‌లో న‌ష్ట‌పోతున్నార‌ని, లేడ‌ర్ 7 ఆర్థిక స‌ల‌హాదారుల‌, స‌ర్టిఫైడ్ ఆర్థిక ప్ర‌ణాళికాదారుడు సురేష్ సద‌గోప‌న్ పేర్కొన్నారు.

చాలా మంది ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల గురించి జ‌రిపే చ‌ర్చ‌ల‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని మాక్స్ సెక్యూర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు ప్రకాష్ ప్రహరాజ్ చెప్పారు. అయితే ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాలి? మీ భార్య, పిల్ల‌ల‌తో పొదుపు, సిప్ వంటి విష‌యాల గురించి మాట్ల‌డితే వారు మీరు చెప్పే విష‌యాన్ని గ్ర‌హించ‌కపోవ‌చ్చు. ముందుగా వారికి తెలిసిన, ఆస‌క్తి క‌లిగించే ఆర్థిక ప్ర‌ణాళికల‌ గురించి చ‌ర్చించ‌డం మొద‌లుపెట్టాలి. ఉదాహ‌ర‌ణ‌కు విహార‌యాత్ర‌కు సంబంధించిన చ‌ర్చ‌ల‌లో పిల్ల‌లు, ఇంటికి సంబంధించిన చ‌ర్చ‌ల‌లో జీవిత భాగ‌స్వామి పాల్గొన‌డానికి ఆస‌క్తి చూపుతారు. డ‌బ్బుప‌ట్ల స‌రైన ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉండేలా చూడాలి. ముఖ్యంగా పిల్లలు. వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేప్పుడు ఏది ముందుగా అవ‌స‌ర‌మో అలాంటి వాటిని కొనుగోలు చేసేలా చూడాలి. మిగిలిన వాటిని వాయిదా వేసేలా చూడాలి. ఇది ఆచ‌ర‌ణ‌లో క‌ష్టంగానే ఉంటుంది. అయితే ఇది పిల్ల‌ల‌కు వారి తప్పొప్పుల‌ను గురించి తెలియ‌జేస్తుంది.

 1. పొదుపు:
  చాలా మంది ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు, బీమా పాల‌సీలు, పెట్టుబ‌డులు క‌లిగి ఉంటారు. అదేవిధంగా బ‌హుళ మ్యూచ‌వ‌ల్ ఫండ్ ప‌థ‌కాలు, ఒక‌టి కంటే ఎక్కువ లాక‌ర్లును క‌లిగి ఉంటారు. ఇలా అనేక రకాలుగా డ‌బ్బును వ్యాపింప చేయ‌డం వ‌ల్ల నిర్వ‌హ‌ణ స‌వాలుగా మారుతుంది. అందువ‌ల్ల మీరు పొదుపు చేసిన మొత్తాన్ని స‌మీక‌రించి స‌మ‌యానికి అనుగుణంగా మంచి వైవిధ్య‌త ఉండేలా చేసుకుంటే నిర్వ‌హ‌ణ సుల‌భం అవుతుంది.

ప్ర‌జ‌లు త‌మ ఉద్యోగం రీత్యా ఒక న‌గ‌రం నుంచి మ‌రొక న‌గ‌రానికి లేదా ప్ర‌దేశానికి మారిన‌ప్పుడు కొత్త ప్ర‌దేశంలో కొత్త‌గా ఖాతాను తెరుస్తారు. కానీ పాత ఖాతాను మూసివేయ‌డం మ‌ర్చిపోతుంటారు. ఈ విధంగా 10 నుంచి 12 ఖాతాలు ఉన్న వారు కూడా ఉంటారు. ప్ర‌తీ ఖాతాలోనూ కొంచెం మొత్తంలో న‌గ‌దు ఉండి పోతుంది. అదేవిధంగా పోస్టాఫీస్ ఖాతాల‌ను కూడా తెరుస్తారు. ఉద్యోగి వేరొక ప్ర‌దేశానికి మారిన‌ప్పుడు వాటి సంగ‌తి మ‌ర్చిపోతారు. అవి కాల‌క్ర‌మేణా మ‌నుగ‌డ‌లో లేకుండా పోతాయి. అందువ‌ల్ల పొదుపు చేసిన మొత్తాన్ని ఒకే ఖాతాలోకి బ‌దిలీ చేసుకోవాలి.

 1. విల్లు:
  చాలా కుటుంబాల వారు విల్లు త‌యారుచేయ‌డం గురించి క‌నీసం ఆలోచ‌న గానీ ప్ర‌య‌త్నం గానీ చేయ‌రు. ఎక్సైడ్ లైఫ్ ఇన్సురెన్స్ నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం 14 శాతం కుటుంబాల వారు మాత్ర‌మే విల్లును ఏర్ప‌టు చేస్తున్నారు.

ఒక‌వ్య‌క్తి జీవించిలేన‌ప్పుడు అత‌ను ఏర్పాటు చేసిన విల్లు, అత‌ను/ ఆమె కుటుంబంలో త‌గాదాలు రాకుండా నివారిస్తుంది. భ‌విష్య‌త్తు త‌రం వారికి వారి ఇష్టానుసారం వారి ఆస్తి, వ‌స్తువుల‌ను పంపిణీ చేయ‌వ‌చ్చు. అందువ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు విల్లు ఏర్పాటు చేయ‌క‌పోతే వెంట‌నే ఏర్పాటుచేయండి.

అంతేకాకుండా విల్లును అప్‌డేట్ చూస్తుండాలి. అయితే ప్ర‌తీ ఒక‌టి లేదా రెండు సంవ‌త్స‌రాల‌కు అప్‌డేట్ చేయడం మంచిది కాదు. విల్లు ఏర్పాటు చేసిన తేదీ అనంత‌రం సంపాదించే ఆస్తులు కూడా విల్లులో ఉన్న ల‌బ్ధి దారుల‌కు చెందాలి అనే ఒక స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌ను విల్లులో పొందుప‌ర‌చ‌డం మంచిది. అన్ని ఆర్థిక పెట్టుబ‌డుల‌లో నామినీ లేదా లబ్ధిదారుల‌ను ఎంచుకోవాలి. దీనిని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి.

 1. ఖ‌ర్చులు:
  చాలామంది వారు చేసే ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేస్తుంటారు. అయితే వారు వేసే అంచ‌నాకి, వాస్త‌వంగా చేసే ఖ‌ర్చుల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంటుంది. కార‌ణం వారు చేసే ఖ‌ర్చుల‌లో కొన్నింటిని మ‌ర్చిపోతుంటారు.

ఉదాహ‌ర‌ణ‌కి, మీ క్ర‌మ‌ర‌హిత కొనుగోళ్లును గుర్తుకు తెచ్చుకొండి. ఇటువంటి ఖ‌ర్చులు నెల‌వారీగా ఉండ‌వు. అందువ‌ల్ల వార్షికంగా లెక్కించిన‌ప్పుడు ఈ విధ‌మైన కొన్ని ఖ‌ర్చుల‌ను మ‌ర్చిపోతుంటారు. సాధార‌ణంగా ఇలాంటి వాటి కోసం బోన‌స్ వంటి ఆదాయాల‌లో కొంత భాగం ఖ‌ర్చు చేస్తుంటారు. మిగిలిన భాగాన్ని పిల్ల‌ల స్కూలు ఫీజులు వంటి వాటికి ఖ‌ర్చుపెడుతుంటారు. కానీ ఖ‌ర్చ‌ల‌ను లెక్కించేప్పుడు మాత్రం స్కూల్ ఫీజుకు చెల్లించిన‌ట్లు మాత్ర‌మే అనుకుంటారు త‌ప్ప, వాస్తవంగా ఎక్క‌డ ఖ‌ర్చ‌య్యిందో గ్ర‌హించ‌రు. అందువల్ల, నెలవారీ ఖర్చులు మాత్రమే కాకుండా ఇత‌ర ఖ‌ర్చుల‌ను కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి.

 1. రుణాలు:
  మ‌న దేశంలో రుణ రేట్లు ప్రైమ్ లెండింగ్ రేటు నుంచి బేసే రేటుకు, బేస్ రేటునుంచి ఎమ్‌సీఎల్ఆర్ - బేసేడ్ లెండింగ్ రేటుకు మార్పుచెందాయి. రీటైల్ రుణాల కొత్త ఫ్లోటింగ్ రేట్లు బెంచ్ మార్క్ నుంచి ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్‌కు ప్రారంభ‌మ‌వ‌నున్నాయి. అన్ని కొత్త వ్య‌వ‌స్థ‌లు ధ‌ర‌లోనూ, పార‌ద‌ర్మ‌క‌త‌లోనూ గ‌తంతో పోలిస్తే మెరుగైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మార్పులు గృహ రుణాలు వంటి వాటికి వ‌ర్తిస్తాయి. అందువ‌ల్ల పాత రుణ గ్ర‌హీత, మార్కెట్లో కొత్త రుణ గ్ర‌హాత‌కు ల‌భించే సౌక‌ర్యాల‌ను చూసి, కొంత ప్రాసెసింగ్ రుసుములు చెల్లించ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్ప‌టికీ వారి ప్రస్తుత రుణాల‌ను చెల్లించి మ‌ర‌ల రుణం తీసుకునేందుకు ఆలోచిస్తూన్నారు. మ‌రికొంద‌రు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని రుణాల‌ను కొన‌సాగించాలి అనుకుంటారు. అయితే రుణాల‌ను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించ‌డం ఏది చేస్తే ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది అనే నిర్ణ‌యం తీసుకోవాలి.

మెరుగైన‌ వ‌డ్డీ రేట్ల కోసం 2016కి ముందు బేస్‌రేటుపై ఆధార‌ప‌డి రుణాలు తీసుకున్న వారు ప్ర‌స్తుతం ఎమ్‌సీఎల్ఆర్ లింక‌డ్ రుణాల‌కు మారుతున్నారు. గ‌తంలో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచ‌గానే బ్యాంకులు కూడా త‌మ వ‌డ్డీరేట్ల‌ను వేగంగా పెంచుతూ ఉండేవి. అయితే రేట్లు త‌గ్గించిన‌ప్పుడు మాత్రం ఈ వేగాన్ని ప్ర‌ద‌ర్శించేవి కాదు. రీటైల్ రుణాల‌ ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్‌తో ఏప్రిల్‌1, నుంచి ఇది మారుతుంద‌ని భావిస్తున్నారు. అయితే ఇది ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లు కాలేదు.

పైన తెలిపిన విష‌యాలు వ్య‌క్తికి అనుగుణంగా మారుతుంటాయి. మీ ఆర్థ‌క విష‌యాల‌ను స‌ర‌ళీకృతం చేసుకోవ‌డంలో ఇవి మీకు స‌హాయ‌ప‌డ‌తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly