హర్లే డేవిడ్సన్ మోటార్సైకిళ్లపై 50 శాతం స‌రిపోదు

హేర్లీ డేవిడ్స‌న్ పై ఇచ్చిన 50 శాతం దిగుమ‌తి సుంకం ఆమోద‌యోగ్యం కాద‌ని సీబీఎస్ న్యూస్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

హర్లే డేవిడ్సన్  మోటార్సైకిళ్లపై 50 శాతం  స‌రిపోదు

అమెరికాకు చెందిన హర్లే డేవిడ్సన్ మోటార్సైకిళ్లలో 100% నుంచి 50% వరకు దాని దిగుమతి సుంకాలను భారత్ తగ్గినా, అది ఇంకా చాలా ఎక్కువగా ఉంద‌ని, ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తన నాయకత్వంలో యూఎస్ఏ ఇక మోసపోద‌ని ఆయ‌న అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు మంచి మిత్రుడు. కానీ వారేం చేశారో చూడండి. ఒక మోటార్ సైకిల్ పై 100% దిగుమ‌తి సుంకం విధించారు. అదే భార‌త‌దేశం నుంచి దిగుమ‌తి అయ్యే వాటిపై ప‌న్నులు వ‌సూలు చేయ‌డం లేదు అని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హర్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, ఈ అంశం నా హృదయానికి దగ్గరగా ఉన్న సమస్య. భారతదేశం ఈ ప‌న్నుల‌ను సున్నాకి తగ్గించాలని కోరుకుంటున్నాను.

హ‌ర్లే డేవిడ్స‌న్ ను భార‌త్ కు ఎగుమ‌తి చేస్తే వారు 100% దిగుమ‌తి సుంకం కలిగి ఉంటారు, భారతదేశం అమెరికాకు - వారు విపరీతమైన సంఖ్యలో మోటార్ సైకిళ్ళు ఎగుమ‌తి చేస్తే దిగుమ‌తి సుంకం చెల్లించ‌న‌వ‌స‌రం లేని విధానం గురించి మోడీతో తన సంభాషణను ప్రస్తావిస్తూ ట్రంప్ అన్నారు.

మోదీ ఫోన్ కాల్ ద్వారా ప‌న్ను 50% తగ్గించారు. అది ఇప్పటికీ అంగీకరింపదగనిది. అమెరికన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను సమస్యను పరిష్కరించడానికి రెండు దేశాలు ప్ర‌స్తుతం చర్చల్లో ఉన్న‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా బ్యాంకు కాదు. ప్ర‌తీ ఒక్క‌రు అమెరికాను దోచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా చేసిన ప‌నుల వ‌ల్ల ప్ర‌స్తుతం అమెరికా వాణిజ్య లోటు 800 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింద‌ని అమెరికా నుంచి ప్ర‌తీ ఒక్క దేశం ల‌బ్ధి పొందాల‌నే చూస్తుంది. ఇతర దేశాలతో వాణిజ్య లోటుల్లో $ 800 బిలియన్లు కలిగి ఉన్నామని ఆయ‌న ఒక ప్రశ్నకు జ‌వాబుగా చెప్పారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly