ప‌న్ను దాఖ‌లుకు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన మార్పులు

రూ. 5 ల‌క్ష‌ల లోపు వార్షికాదాయం ఉన్న వారు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి ఎటువంటి ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు

ప‌న్ను దాఖ‌లుకు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన మార్పులు

ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్ నెల నుంచి ప్రారంభ‌మవుతుంది. 2019-20 కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ, ఆదాయ‌పు ప‌న్ను నుంచి జీఎస్‌టీ వ‌ర‌కు ప‌న్ను నిబంధ‌న‌ల‌లో వ‌చ్చిన మార్పులు మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌ను ప్ర‌భావితం చేస్తాయి. 2019 మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన ప‌న్ను మార్పులు ఏప్రిల్‌1 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి.

 1. ప‌న్ను రిబేట్‌:
  వార్షికాదాయం(అన్ని మినహాయింపులు పోను) రూ. 5 ల‌క్ష‌లు ఉన్న ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఈ ఆర్థిక సంవ‌త్స‌రం పూర్తి ప‌న్ను రిబేట్ ల‌భిస్తుంది. అయితే ట్యాక్స్ స్లాబ్‌లో ఎటువంటి మార్పులేదు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం అమ‌లైన స్లాబ్‌లే ఈ ఏడాది కూడా అమ‌లవుతాయి. కానీ రూ. 5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారు ఎటువంటి ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన ప‌నిలేదు. గత ఆర్ధిక సంవత్సరం ఇది రూ. 2500 ఉండేది, ఇప్పుడు దీన్ని రూ. 12,500 కి పెంచారు.

 2. నోష‌న‌ల్ ఆదాయం:
  రెండ‌వ ఇంటిపై వ‌చ్చే నోష‌న‌ల్ ఆదాయం(రెంట్‌)పై ఇక నుంచి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ఒక‌వేళ ప‌న్ను చెల్లింపుదారుల‌కు రెండు కంటే ఎక్కువ ఇళ్ళు (స్వీయ ఆక్ర‌మిత ఇళ్ళు) ఉంటే, మూడ‌వ‌, అద‌న‌పు ఆస్తుల నుంచి వ‌చ్చే నోష‌న‌ల్ అద్దెపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

 1. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ (ప్రామాణిక మినహాయింపు):
  కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో అద‌న‌పు ప‌న్ను ఆదా చేసుకునేందుకు స్టాండర్డ్ డిడ‌క్ష‌న్‌ను రూ.40 వేల నుంచి రూ 50 వేల‌కు పెంచారు. పెంచిన రూ. 10 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప‌రిధితో 30 శాతం (అత్య‌ధిక‌) ప‌న్ను బ్రాకెట్ ఉన్న వ్య‌క్తి రూ. 3,120 ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

 2. టీడీఎస్‌ పెంపు:
  త‌క్కువ ప‌న్ను వ‌ర్తించే ప‌న్ను చెల్లింపుదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు టీడీఎస్ మిన‌హాయింపు ప‌రిధిని రూ. 10 వేల నుంచి రూ.40 వేల‌కు పెంచారు. అదేవిధంగా అద్దెపై డిడ‌క్ట్‌చేసే టీడీఎస్‌ పరిమితి ని రూ.1.80 ల‌క్ష‌ల నుంచి రూ.2.40 ల‌క్ష‌ల‌కు పెంచారు.

 3. జీఎస్‌టీ:
  నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 12 శాతం నుంచి 5 శాతానికి, అఫర్డబుల్‌ హౌసింగ్ (పీఎమ్ఏవై) పై 8 శాతం నుంచి 1 శాతానికి జీఎస్టీ ప‌న్ను త‌గ్గించారు. ఈ మారిన జీఎస్‌టీ ప‌న్ను విధానాలు ఏప్రిల్ 1 నుంచి అమ‌ల‌వుతాయి. నిర్మాణం లో తక్కువ ధరకు ఇళ్ళు కొనచ్చు అనుకునే వారికి జీఎస్టీ భారం చాలా వరకు తగ్గుతుంది. నిర్మాణం పూర్తైన ఇళ్ల పై జీఎస్టీ వర్తించదు.

 4. క్యాపిట‌ల్ గెయిన్‌:
  రెండు నివాస‌యోగ్య‌మైన‌ ఇళ్ళ‌ను విక్ర‌యించినప్పుడు వ‌చ్చిన‌ దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై రూ. 2 కోట్ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని ఆర్థిక మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఈ మిన‌హాయింపు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.

 5. షేర్లు ఎల‌క్ట్రానిక్ రూపంలోనే
  సెబీ సూచ‌న‌ల ప్ర‌కారం ఏప్రిల్ 1 నుంచి డీమెటీరీలైజైడ్ రూపంలో ఉన్న షేర్ల‌ను మాత్ర‌మే విక్ర‌యించేందుకు వీల‌వుతుంది. ఇప్ప‌టి నుంచి షేర్ల‌ను డీమ్యాట్ రూపంలో ఉంచ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly