పిల్ల‌ల కోసం ఆదిత్య బిర్లా బాల భ‌విష్య యోజ‌న

పిల్ల‌ల ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆదిత్య బిర్లా కొత్త ఫండ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

పిల్ల‌ల కోసం ఆదిత్య బిర్లా బాల భ‌విష్య యోజ‌న

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా మ్యూచువ‌ల్ పండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను పెట్టాల్సిందిగా ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. గృహ రుణం చెల్లించేందుకు, పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం, ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు మ్యూచువ‌ల్ ఫండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పూర్తిగా పిల్ల‌లు, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డే మ్యూచువ‌ల్ ఫండ్లు కొన్ని ఉన్నాయి. అయితే ఎవి ఎక్కువ‌గా వెలుగులోకి రాలేదు. దీనికోసం ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ బాల భ‌విష్య యోజ‌న కొత్త ఓపెన్ ఎండెడ్ ఫండ్‌ను ప్రారంభించ‌నుంది. ఇది కేవ‌లం పిల్ల‌ల‌కు భ‌విష్య‌త్తుకు ఆర్థిక భ‌రోసాను అందించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. జ‌న‌వ‌రి 22, 2019 న ప్రారంభం కానున్న కొత్త ఫండ్ ఆఫ‌ర్ ఫిబ్ర‌వ‌రి 05, 2019 న ముగుస్తుంది.

పిల్ల‌లు యూనిట్ హోల్డ‌ర్‌గా ఉంటారా?

మైన‌ర్ పిల్ల‌ల పేరుతో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ప్రారంభిస్తున్న‌ప్ప‌డు పుట్టిన తేది, వివ‌రాలు అందించాలి. మైన‌ర్ మాత్ర‌మే యూనిట్ హోల్డ‌ర్‌గా ఉండాలి. ఉమ్మ‌డి ఖాతాకు వీల్లేదు. ఖాతా నిర్వ‌హించే త‌ల్లిదండ్రుల వివ‌రాలు,కేవైసీ అందించాలి. పిల్ల‌లు మేజ‌ర్ అయిన‌ప్పుడు స్టేటస్‌లో మార్పు జ‌రిగిన‌ట్లుగా డాక్యుమెంట్ల‌ను ఫండ్ సంస్థ‌ తీసుకునేంత‌వ‌ర‌కు లావాదేవీలు జ‌రిపేందుకు వీలుండదు.

లాక్‌-ఇన్ పీరియ‌డ్?

ఈ ఫండ్ లాక్‌-ఇన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు లేదా పిల్ల‌లు మేజ‌ర్ అయ్యేంత వ‌ర‌కు ఏది త్వ‌ర‌గా ఉంటే అది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. మూడేళ్ల వ‌య‌సులో ఖాతా ప్రారంభిస్తే మేజ‌ర్ అయ్యేందుకు మ‌రో 15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కు త‌ల్లిదండ్ర‌లు వారి భ‌విష్య‌త్తుకు ఉప‌యోగ‌ప‌డేలా పెట్టుబ‌డులను పెట్ట‌వ‌చ్చు.

మేజ‌ర్ అవ‌క‌ముందే విత్‌డ్రా చేసుకోవచ్చా?

ఓపెన్ ఎండెడ్ ఫండ్ల‌లో 6 నెల‌లు లేదా 12 నెల‌ల త‌ర్వాత విత్‌డ్రా చేసుకుంటే ఛార్జీలు ఉండవు. కానీ ఈ స్కీమ్ ప్ర‌త్యేకంగా పిల్ల‌ల కోసం రూపొందించింది కాబ‌ట్టి ఐదేళ్లకు ముందు లేదా మేజ‌ర్ కాక‌ముందు విత్‌డ్రా చేసుకుంటే మొత్తం విలువపై 1 శాతం రుసుములు చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. లాక్‌-ఇన్ పీరియ‌డ్ త‌ర్వాత ఉప‌సంహ‌రించుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు.

పిల్ల‌ల కోసం డెట్ లేదా ఈక్విటీ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చా?

ఈక్విటీలు ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డినిస్తుంటాయి. ఈ స్కీమ్‌లో ఈక్విటీ, డెట్ రెండు ర‌కాల ప్లాన్‌లు ఉన్నాయి. ఈక్విటీ సంప‌ద సృష్టించేది కాగా, డెట్ ప్లాన్ పొదుపు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మూల‌ధ‌న రాబ‌డి పెంచుకునేందుకు ఈక్విటీల‌లో 65 శాతం నుంచి 100 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టాలి. మ‌రోవైపు పొదుపు కోసం అయితే 75 శాతం నంచి 90 శాతం వ‌ర‌కు డెట్ ఫండ్ల‌లో పెట్ట‌వ‌చ్చు. మొత్తం పోర్ట్ఫోలియోలో ఈక్వీటీ పెట్టుబ‌డులు క‌నీసం 10 శాతం నుంచి 25 శాతం వ‌ర‌కు ఉండాలి. ఈక్విటీల‌కు ఎస్ అండ్ పీ బీఎస్ఈ 200 డెట్ ఫండ్ల‌కు అయితే క్రిసిల్ హైబ్రిడ్ 85+15 క‌న్జ‌ర్వేటివ్ ఇండెక్స్‌ను బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవాలి. రిస్క్ తీసుకునే అవ‌కాశం, నిధి అవ‌స‌ర‌మ‌య్యే స‌మ‌యాన్ని బ‌ట్టి పెట్టుబ‌డులు పెట్టాలి.

చివ‌ర‌గా:

ఇది ముఖ్యంగా పిల్ల‌ల అవ‌స‌రాల‌ను ఆధారంగా చేసుకొని ప్ర‌వేశ‌పెడుతున్న‌ ప‌థ‌కం. వారి భ‌విష్య‌త్తుల ల‌క్ష్యాల కోసం త‌ల్లిదండ్ర‌లు ఈ స్కీమ్ ప్రారంభించాలి. ముఖ్యంగా దీనికి లాక్‌-ఇన్ పీరియ‌డ్, దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులకు అనుగుణంగా ఉండ‌టం ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది. సిప్ ద్వారా ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు సిస్ట‌మేటిక్ విత్‌డ్రా ప్లాన్ ద్వారా క్ర‌మంగా తీసుకోవ‌చ్చు. మేజ‌ర్ అయిన‌ప్పుడు ఖాతా పిల్ల‌ల పేరుకి మారుతుంది. అప్పుడు చిన్న వ‌య‌సులోనే వారు పెట్టుబ‌డులు , ఆర్థిక విష‌యాల గురించి నేర్చుకునే అవ‌కాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly