ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో రూ.4 లక్షల బీమా
18 నుంచి 54 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో మొబైల్ ప్రీపెయిడ్ చందాదారులకు బీమాతో కూడిన ప్యాకేజీలు అందించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందులో ఇన్-బిల్ట్ జీవిత బీమా కవర్(టర్మ్ ప్లాన్) అందించనున్నట్లు తెలిపింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ చందాదారులు రూ.249తో రీఛార్జ్ చేయించుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు 2జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు రూ.4 లక్షల జీవితబీమా (టర్మ్ పథకం) హెచ్డీఎఫ్సీ లైఫ్ నుంచి లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ రీఛార్జ్ యాక్టివ్‌గా ఉన్నంతవరకు మాత్రమే బీమా కూడా వర్తిస్తుందని సంస్థ తెలిపింది. బీమా కోసం మొదటి రీఛార్జ్ తరువాత, ఎస్ఎంఎస్ ద్వారా గానీ, మై ఎయిర్టెల్ యాప్ ద్వారా గానీ, రీటైలర్ ద్వారా గానీ చందాదారుడు తన పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తదుపరి రీఛార్జుల్లో నేరుగా వర్తిస్తుంది. ప్రతీసారీ నమోదు చేయాల్సిన పనిలేదు. ఎయిర్టెల్-హెచ్డీఎఫ్సీ భాగస్వామ్య ప్రభావం వాటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఫిజిటల్ అనుభవంతో బీమా లభించడంతో పాటు బీమా లేని, తక్కువ బీమా కలిగిన లక్షలాది భారతీయులకు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్న ప్రతీసారి బీమా సౌకర్యం అందుతుందని సంస్థ తెలిపింది. ఈ పాలసీ 18 నుంచి 54 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకు పేపర్ వర్క్గానీ, వైద్య పరీక్షలు గానీ అవసరం లేదు. అయితే వినియోగదారుడు తమ ఆరోగ్యం బాగుందనే ధ్రువీకరణను ఇస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన పాలసీని తక్షణమే డిజిటల్‌గా పంపిణీ చేస్తారు. వినియోగదారుడు కోరితే కాగిత రూపేణ కూడా పాలసీని అందిస్తారు.
ఎయిర్టెల్ కొత్తగా అందిస్తున్న రూ.249 ప్రీపెయిడ్ ఫ్యాకేజి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్2018 నాటికి కంపెనీ మొబైల్ వినియోగదారులకు సంఖ్య 28.4 కోట్లు
సిరి లో ఇంకా:
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Comments
0