బిట్‌కాయ‌న్ల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు

31 అక్టోబ‌ర్‌, 2017న‌ బిట్‌కాయిన్ విలువ రూ.5ల‌క్ష‌ల మార్కును దాటింది. ఒక ఏడాదిలో 844శాతం భారీ రాబ‌డినందించింది.

బిట్‌కాయ‌న్ల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు

ఆఫీసులో తీరిక స‌మ‌యాల్లో స్నేహితుల‌తో స‌ర‌దాగా మాట్లాడుకునేట‌ప్పుడు ఎప్పుడైనా పెద్ద పెద్ద పెట్టుబ‌డుల గురించి చ‌ర్చ మొద‌ల‌వుతుంది. ఒక‌ప్పుడు స్థిరాస్తి, షేర్లు, బంగారంలో పెట్టుబ‌డుల గురించి ఎక్కువ‌గా చ‌ర్చ న‌డిచేది. ఇప్పుడు అది కాస్తా క్రిప్టో క‌రెన్సీల వైపున‌కు మ‌ళ్లింది. ఇంకా క‌చ్చితంగా చెప్పాలంటే బిట్‌కాయ‌న్ల గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు.

2017లో దాదాపు ప్ర‌తి రెండు నెల‌ల్లో ఒక సారి బిట్ కాయిన్ల విలువ జీవన‌కాల గ‌రిష్టానికి చేరుకున్నాయి. అక్టోబ‌ర్ 31న అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 844 రెట్లు పెరిగి ఏకంగా రూ.5ల‌క్ష‌ల‌కు చేరుకుంది.

ఈ నేప‌థ్యంలో బిట్‌కాయిన్లు, క్రిప్టోక‌రెన్సీల గురించి మ‌రింత వివ‌రంగా తెలుసుకుందాం…

క్రిప్టో క‌రెన్సీ అంటే …

డిజిట‌ల్ క‌రెన్సీలో … క్రిప్టోక‌రెన్సీ ఒక భాగ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. డిజిట‌ల్ క‌రెన్సీల‌ను సాధార‌ణంగా కేంద్రమే జారీచేసి వాటిని త‌మ దేశం లేదా ప్రాంతంలో లేదా కొన్ని సంస్థ‌ల‌కే అందుబాటులో ఉండేలా పంపిణీ చేస్తుంది. అయితే వీటికి భిన్నంగా క్రిప్టోక‌రెన్సీ ఉంటుంది.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో క్రిప్టోక‌రెన్సీ ఈ మ‌ధ్య హాట్ టాపిక్‌గా నిలిచిపోయింది.

క్రిప్టోక‌రెన్సీని డిజిట‌ల్ రూపంలో ఆస్తిగా రూపొందించి వాటి సుర‌క్షిత‌మైన బ‌దిలీకి క్రిప్టోగ్ర‌ఫీ అనే సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తారు. అద‌న‌పు యూనిట్ల సృష్టి జ‌ర‌గ‌కుండా త‌గిన నియంత్ర‌ణ‌లు పాటిస్తారని వీటి మార‌కానికి యాప్ సేవ‌ల‌ను అందిస్తున్న‌ ప్ర‌ముఖ‌ బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్ జీబ్‌-పే అన‌లిస్ట్ సుమంత్ నేప్ప‌లి తెలిపారు.

బిట్‌కాయిన్ అంటే ఏమిటి…?

బిట్ కాయిన్‌ను 2009లో సృష్టించారు. అప్ప‌టి నుంచి అనేక ఇత‌ర క్రిప్టోక‌రెన్సీలు పుట్టుకొచ్చాయి. వీటిని ఆల్ట్‌కాయిన్స్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తారు. ఆల్ట్ అంటే బిట్‌కాయిన్‌కు ఆల్ట‌ర్నేటివ్స్ అని. బిట్‌కాయిన్లు డీసెంట్ర‌లైజ్డ్ విధానాన్ని అనుస‌రిస్తాయి. వీటిని ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తులు త‌యారుచేశారంటారు.

బిట్‌కాయిన్ల సంఖ్య‌కు 21 మిలియ‌న్ల వ‌ర‌కు ప‌రిమితి ఉంది. జూన్ 2016నాటికైతే 16.4 బిట్‌కాయిన్లు ఉనికిలో ఉన్న‌ట్టు స‌మాచారం.

ఈ క్రిప్టోక‌రెన్సీల‌కు అస్థిత్వం ఏది… వీటిని ఏ ర‌క‌మైన పెట్టుబ‌డితో కొల‌మానంగా భావించ‌వ‌చ్చు. నిజానికి కాగితం రూపంలో ఉండే డ‌బ్బుకు ఏం విలువ ఉంటుంది. వాటిని ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా విలువ‌ను సంత‌రించుకుంది, అలా చేశారు. దీన్ని ఒక కొల‌మానంగానూ చూడ‌డం అల‌వాటు అయ్యింది.

క్రిప్టోక‌రెన్సీల‌తో వ‌చ్చిన చిక్కేమిటంటే వాటిని ప్ర‌భుత్వాలు నిర్మించ‌లేదు. అయితే క్రిప్టోక‌రెన్సీల విలువ వాటి వాడ‌కం వ‌ల్ల‌, వాటిని అంగీక‌రించ‌డం వ‌ల్ల వ‌స్తుంద‌ని బిట్‌కాయిన్ల విశ్లేష‌కుడు ఒక‌రు అంటున్నారు.

వీటిని ఎక్క‌డ‌, ఎలా కొన‌డం?

వీటిని ఆన్‌లైన్‌లో కొనొచ్చు లేదా మైనింగ్ ద్వారా సంపాదించ‌వ‌చ్చు. వ‌స్తు, సేవ‌ల‌కు ప్ర‌తిగా ఇత‌రుల నుంచి బిట్‌కాయిన్ల‌ను అంగీక‌రించ‌వ‌చ్చు. ఎక్స్ఛేంజీల ద్వారా లేదంటే వెండింగ్ మెషిన్ల నుంచి నేరుగా వీటిని పొంద‌వ‌చ్చు. బిట్‌కాయిన్ వాలెట్ సేవ‌ల‌ను అందించే యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌, ఇత‌ర ఆన్‌లైన్ మాధ్య‌మాల ద్వారా వీటిని బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

మైనింగ్ అనే విధానంలో బిట్‌కాయిన్ల‌ను సంపాదించ‌వ‌చ్చు. మైనింగ్ అంటే క్రిప్టోగ్ర‌ఫీ ప‌జిల్స్‌ను పూర్తి చేయ‌డం. క్రిస్టోగ్ర‌ఫీలో లావాదేవికి సంబంధించిన కొన్ని కీల‌క ప‌జిల్స్ ఉంటాయి. వాటిని పూర్తి చేయ‌డం ద్వారా బిట్‌కాయిన్ల‌ను సంపాదించుకోవ‌చ్చు అని చెప్తారు.

బిట్‌కాయిన్ల‌ను సృష్టించేదెవ‌రు?

బిట్‌కాయిన్ల‌ను సృష్టించే ప్ర‌క్రియ‌ను మైనింగ్ అంటారు. బిట్ కాయిన్ మైనింగ్ లో భాగంగా శ‌క్తివంత‌మైన సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించి క్లిష్ట‌మైన అల్గారిథ‌మ్‌ల‌ను ప‌రిష్క‌రించి లావాదేవీల‌ను వెరిఫై చేస్తారు. మైనింగ్ చేసేవాళ్లు విజ‌య‌వంతంగా ఈ ప్ర‌క్రియ‌లో గెలుపొందితే వారికి కొన్ని బిట్‌కాయిన్ల‌ను అంద‌జేస్తారు. మైనింగ్‌లో భాగంగా బిట్‌కాయిన్ నెట్‌వ‌ర్క్‌లో లావాదేవీలు స‌జావుగా సాగేట్టు చూడాల్సి ఉంటుంది.

మైన‌ర్స్ మ‌ధ్య పోటీ వ‌ల్ల, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వ‌ల్ల బిట్‌కాయిన్ మైనింగ్ మ‌రింత అధునాత‌న‌మైంది. మైనింగ్ ను త‌ర‌చూ చేయ‌డం వ‌ల్లే బిట్‌కాయిన్ల ఉనికి మ‌నుగడలో ఉండిపోగ‌లుగుతుంది. మైనింగ్‌లోనూ , మైనింగ్ హార్డ్‌వేర్‌లోనూ చాలా ర‌కాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతారు.

‘స‌తోషి న‌క‌మోటా’ పేరుతో ఉన్న ఓ బిట్‌కాయిన్ల త‌యారీ అజ్ఞాత వ్య‌వ‌స్థ కేవ‌లం 21 మిలియ‌న్ బిట్‌కాయిన్లను మాత్ర‌మే సృష్టించ‌డం వీలుప‌డుతుందని తెలిపిన‌ట్టు స‌మాచారం.

Courtesy: LiveMint

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly