ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మంచి లాభాలు

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ గురించి తెలుసుకుందాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మంచి లాభాలు

ఒకటి లేదా రెండేళ్ల కోసం లంప్‌స‌మ్ సొమ్మును పెట్టుబ‌డిగా పెట్టి మంచి రాబ‌డుల‌ను పొందాల‌ని చూస్తున్నారా? సంప్ర‌దాయ విధానాల్లో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్నారా?. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ ఎఫ్‌డీల‌పై 9-10శాతం దాకా వ‌డ్డీ వ‌చ్చేది. ఈ మ‌ధ్య‌కాలంలో బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్ల‌ను గ‌మ‌నించారా? 1-2 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధి క‌లిగిన డిపాజిట్ల‌పై కేవ‌లం 6.75-7శాతం వ‌డ్డీని మాత్ర‌మే ఇస్తున్నారు. నిజానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు చాలా సుర‌క్షితమైన‌వి. అయితే వీటి పై వ‌చ్చే త‌క్కువ రాబ‌డులు స‌రిపోతాయా? ముందుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల ముఖ్య‌మైన అంశాల‌ను తెలుసుకొని ఆ త‌ర్వాత వాటికి ప్ర‌త్యామ్నాయ మ‌ర్గాల‌ను వెతుకుదాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు - క‌చ్చిత‌మైన రాబ‌డులు అందిస్తాయి. ఇదే వీటితో ఉన్న అతి పెద్ద ప్ర‌యోజ‌నం. సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి విధానం కాబ‌ట్టి ఎక్కువ‌గా పాత త‌రం వారు దీనికి ప్రాధాన్య‌త‌నిచ్చేవారు. ఎఫ్‌డీల‌పై రుణం పొంద‌డం సుల‌భం. ఎఫ్‌డీ విలువ‌లో 90శాతం రుణం ల‌భిస్తుంది. న‌గ‌దు ల‌భ్య‌త అంత‌గా ఉండ‌దు. ఇందులో ఉన్న సొమ్మును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోలేం. ఆదాయపు ప‌న్ను ఆదా కోణంలో వీటిలో పెట్టుబ‌డులు ఏమంత లాభ‌దాయ‌కం కాదు. అదే డెట్ ఫండ్లు అయితే, మ‌దుప‌రుల సొమ్మును ప్ర‌భుత్వ బాండ్లు, స‌ర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్, కార్పొరేట్ బాండ్లు, ట్రెజ‌రీ బిల్లులు, మ‌నీ మార్కెట్ సాధ‌నాల్లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. వీటి నిర్వ‌హ‌ణ‌ను ఫండ్ నిర్వాహ‌కులు చూసుకుంటారు. వ‌డ్డీ రేట్ల‌లో క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి పెట్టుబ‌డుల్లో త‌గిన మార్పుచేర్పులు చేస్తుంటారు. డెట్ ఫండ్ల‌ను 1 రోజు నుంచి 5ఏళ్ల దాకా మెచ్యూరిటీ నందించే ప‌థ‌కాల్లో పెట్టుబ‌డిగా పెట్టి వ‌చ్చే రాబ‌డుల‌ను అందుకుంటారు. డెట్ ఫండ్స్‌ను లిక్విడ్ ఫండ్స్‌, అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్‌, ఇన్‌క‌మ్ ఫండ్స్‌, గిల్ట్ ఫండ్స్ ఇలా ర‌క‌ర‌కాలుగ వ‌ర్గీక‌రించారు. ఇక లిక్విడ్ ఫండ్ల విషయానికి వస్తే, లిక్విడ్ ఫండ్స్ యావ‌రేజీగా 30 నుంచి 90రోజులలోపు మెచ్యూరిటీకి చేరుకుంటాయి. అంటే 1 నుంచి 3 నెల‌ల పాటు అవ‌స‌రాల‌కు వీటిలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో కెల్లా ఇదే అత్యంత సుర‌క్షిత‌మైన ఫండ్స్‌గా ప‌రిగ‌ణిస్తారు. వీటిపై రాబ‌డి అంచ‌నా వార్షికంగా 7-8శాతం మ‌ధ్య‌లో ఉండ‌వ‌చ్చు. అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్‌ - వీటి స‌రాస‌రి మెచ్యూరిటీ వ్య‌వ‌ధి 90 రోజుల నుంచి ఏడాది దాకా ఉంటుంది. లిక్విడ్ ఫండ్ల‌లో స్వ‌ల్పంగా న‌ష్ట‌భ‌యం ఉంటుంది. వీటిపై రాబ‌డులు 7-9 శాతం మ‌ధ్య‌లో ఉండ‌వ‌చ్చు. ఇన్‌క‌మ్ ఫండ్స్‌ - వీటి యావ‌రేజ్ మెచ్యూరిటీ గ‌డువు 1 నుంచి 3ఏళ్లు. వ‌డ్డీ రేట్లలో మార్పుల‌ను బ‌ట్టి వార్షికంగా 8-10శాతం దాకా రాబ‌డుల‌ను ఆశించ‌వ‌చ్చు. స‌రాస‌రి మెచ్యూరిటీ గ‌డువు ఎక్కువున్నందుకు వీటిలో పెట్టుబ‌డుల‌పై స్వ‌ల్పంగా న‌ష్ట‌భ‌యం ఉంటుంది. గిల్ట్ ఫండ్స్‌ - ఇందులోని సొమ్మును దీర్ఘ‌కాల ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. వీటి స‌రాస‌రి మెచ్యూరిటీ గ‌డువు 3-5ఏళ్లు. ఇత‌ర డెట్ ఫండ్ల‌తో పోలిస్తే వీటిలో ఉండే పెట్టుబ‌డుల‌కు రిస్క్ ఎక్కువ‌. అయితే 5ఏళ్ల పాటు ఇందులో పెట్టుబ‌డుల‌కు 10-11 శాతం దాకా మంచి రాబ‌డులే వ‌స్తాయి.

FIX DEP-DEBT FUNDS.png

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly