అల్యూమినియం ట్రేడింగ్

వినియోగంలో స్టీల్ త‌ర్వాతి స్థానం అల్యూమినియందే. వెండిలా త‌ళ‌త‌ళ మెరిసే లోహ ట్రేడింగ్ విధానం గురించి తెలుసుకుందాం.

అల్యూమినియం ట్రేడింగ్

ప్రాచీన కాలం నుంచి అల్యూమినం లోహాన్ని వాడుతున్నారు. గ్రీకులు, రోమ‌న్లు వీటిని ఉప‌యోగించిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. వెండిలా త‌ళ‌త‌ళ మెరిసే గుణం ఈ లోహానికి ఉంది. కొన్ని ఇళ్ల‌లో పాత్ర‌లు ఎక్కువ‌గా అల్యూమినియంతో చేసిన‌వే ఉంటాయి. అల్యూమినియం భూఉప‌రిత‌లంలో విస్తారంగ లభించే మూల‌కం. దీనిని ఎక్కువ‌గా వాహ‌న ప‌రిశ్ర‌మ‌లు, ఎల‌క్రానిక్స్, గృహ వినియోగ సంబంధ‌ వస్తు ప‌రిశ్ర‌మ‌లలో వాడ‌తారు.

కాంట్రాక్టు వివ‌రాలు:

Screen Shot 2017-05-06 at 12.43.55.png

కాంట్రాక్టుల ప్రారంభం:

కాంట్రాక్టు క్యాలెండ‌ర్లో పేర్కొన్న విధంగా నెల‌లో మొద‌టి తేదీన‌ కాంట్రాక్టులు ప్రారంభ‌మ‌వుతాయి. ఒక వేళ ఆ రోజు సెల‌వైతే మ‌రుస‌టి ప‌నిదినం మొద‌ల‌వుతాయి.

కాంట్రాక్టుల ముగింపు:

కాంట్రాక్టు క్యాలెండ‌ర్లో పేర్కొన్న‌ట్టు ముగింపు నెల‌లో చివ‌రి తేదీన‌ కాంట్రాక్టు గ‌డువు తీరిపోతుంది. ఒక‌వేళ ఆ రోజు సెల‌వు రోజ‌యితే ఆ ముందు రోజు కాంట్రాక్టులు ముగిసేలా చూస్తారు.

ట్రేడింగ్ ప‌రిమాణం:

  • ట్రేడింగ్ చేయాల్సిన క‌నీస ప‌రిమాణం 5 మెట్రిక్ ట‌న్నులు
  • ట్రేడింగ్ చేయాల్సిన గ‌రిష్ఠ‌ ప‌రిమాణం 150 మెట్రిక్ ట‌న్నులు
  • ఒక కిలోగ్రాము చొప్పున వెల నిర్ధారణ జ‌రుగుతుంది.

చెల్లింపులు :

క్యాష్ సెటిల్మెంట్ లేదా డెలివ‌రీ విధానం ద్వారా.
ప్ర‌ధాన డెలివ‌రీ కేంద్రం మ‌హారాష్ట్ర‌లోని భీవండి. మ‌రికొన్ని ఎంపిక చేసిన ప్రాంతీయ కేంద్రాల‌లోనూ చెల్లింపులు జ‌రుగుతాయి.

సెటిల్‌మెంట్ గడువు :

కాంట్రాక్టు గ‌డువు ముగిసిన రెండు రోజుల త‌ర్వాతి నుంచి చెల్లింపులు ప్రారంభ‌మ‌వుతాయి.

క‌మోడిటీలో ట్రేడింగ్ చేయాల‌నుకునేవారు ప‌రిశీలించాల్సిన అంశాలు

అంత‌ర్జాతీయ మార్కెట్ల ధ‌ర‌లు, డాల‌ర్‌తో రూపాయి మార‌కం, ప్ర‌భుత్వ పాల‌సీలు ప్రోత్స‌హ‌కాలు, పారిశ్రామిక వృద్ధి, కొత్త గ‌నుల త‌వ్వ‌కాలు, కార్మికుల స‌మ్మెలు వంటివి ప్ర‌భావం చూపుతాయి. ట్రేడింగ్‌లో పాలుపంచుకునేవారు ఈ అంశాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly