మ‌రోసారి అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌లో ఐసీఐసీఐ కార్డులతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది

మ‌రోసారి అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మ‌రోసారి త‌మ‌ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ పేరితో సేల్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు అమెజాన్ ఆదివారం ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, కెమారాలు, టీవీల‌తో పాటు ఇత‌ర గాడ్జెట్‌ల‌పై విస్తృత స్థాయిలో ఆఫ‌ర్లు, డీల్స్‌ను అందించ‌నున్నారు. అమెజాన్ పండుగ సంద‌ర్భంగా అందించే ఈ కొత్త సేల్ ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభ‌మై అక్టోబ‌రు 17వ తేదీ రాత్రి 11 గంట‌ల 59 నిమిషాలతో ముగుస్తుంది. ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఉన్న‌వారికి ఒక‌రోజు ముందుగానే…అంటే అక్టోబ‌రు 12వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సేల్ అందుబాటులోకి రానుంది.

అమెజాన్ ఈ కొత్త సేల్‌లో స్మార్ట్ ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్‌తో అందించ‌నుంది. అంతేకాకుండా ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, ఆక‌ర్షిణీయ‌మైన ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐతో అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఆపిల్, షియోమీ, వ‌న్‌ప్ల‌స్‌, శాంసంగ్‌, వివో, హాన‌ర్ వంటి ప్ర‌ముఖ బ్రాండ్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌కు డీల్స్‌ను అందించ‌నున్నారు.

వీటితో పాటు గృహోప‌క‌ర‌ణాలపై 60 శాతం డిస్కౌంట్‌, నోకాస్ట్ ఈఎమ్‌తో టీవీలు, ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్లు, ఎటువంటి ఛార్జీలు లేకుండా ఇన్‌స్టాల్ చేయ‌డంతో పాటు, ఉచిత డెలివ‌రీని అందించ‌నున్న‌ట్లు ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ తెలిపింది. హెచ్‌పీ, కెనాన్‌, బోట్‌, లెనోవోల‌తో పాటు ఇత‌ర‌త్రా200 బ్రాండ్‌ల‌పై 6000వర‌కు డీల్స్‌ను తీసుకురానున్న‌ట్లు తెలిపింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly