అపోలో మ్యునిచ్ ఆప్టిమా రీస్టోర్ ఆరోగ్య బీమా పాలసీ ప్ర‌యోజ‌నాలు

ఇందులో నో-క్లెయిమ్ బోన‌స్‌, ప‌రిమితులు లేని అద్దె గ‌దులు, న‌గ‌దు ర‌హిత లావాదేవీలు వంటివి ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి

అపోలో మ్యునిచ్ ఆప్టిమా రీస్టోర్ ఆరోగ్య బీమా పాలసీ ప్ర‌యోజ‌నాలు

అపోలోమ్యునిచ్ ఆప్టిమా రీస్టోర్ ప్లాన్‌లో మొద‌టి క్లెయిమ్ త‌ర్వాత 100 శాతం బేసిక్ హామీని తిరిగి అందిస్తుంది. మీకు రూ.5 ల‌క్షల హామీ ఉంటే ల‌క్ష రూపాయల‌ను ఏడాది ప్రారంభంలో క్లెయిమ్ చేసుకుంటే దానిని తిరిగి రీస్టోర్ చేస్తుంది. అంటే మొత్తం మీరు రూ.9 ల‌క్ష‌ల వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

ఈ పాల‌సీలోని ముఖ్యమైన అంశాలు…

 • జీవిత‌కాల‌ పున‌రుద్ధ‌ర‌ణ‌
 • రెన్యూవ‌ల్ స‌మ‌యంలో స‌హ చెల్లింపులు, ఉప‌-ప‌రిమితులు ఉండ‌వు
 • 800 న‌గ‌రాల్లో 4,500 కంటే ఎక్కువ హాస్పిట‌ల్స్‌లో న‌గ‌దు ర‌హిత చెల్లింపుల‌కు అవ‌కాశం. అందుబాటులో ప‌దివేల‌కు పైగా వైద్య నిపుణులు
 • వ్య‌క్తిగ‌త లేదా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ఆప్ష‌న్‌
 • నివ‌సిస్తున్న ప‌ట్ట‌ణాన్ని బ‌ట్టి ప్రీమియం ఛార్జీలు
 • ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపులు
 • ఇద్దరు కంటే ఎక్కువ, దీర్ఘ‌కాలిక పాల‌సీల‌పై ప్రీమియంపై డిస్కౌంట్

పాల‌సీ వివ‌రాలు:

 • ప్రారంభ వ‌య‌సు పిల్ల‌ల‌కు 91 రోజుల నుంచి
 • యుక్త వ‌య‌స్కుల‌కు క‌నీస వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు, గ‌రిష్ఠంగా 65 సంవ‌త్స‌రాలు
 • గ‌రిష్ఠంగా ఆరుగురికి బీమా హామీ ల‌భిస్తుంది. అందులో న‌లుగురుపెద్ద‌వారు (ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌లో గ‌రిష్ఠంగా ఇద్దరు పెద్దవారుఉండాలి)
 • పిల్ల‌లు గ‌రిష్ఠంగా 5 మంది
 • బీమా హామీ రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు, డిస్కౌంట్ దీర్ఘ‌కాలిక ఫ్యామిలీ ట‌ర్మ్ పాల‌సీపై పాల‌సీ కాల‌ప‌రిమితులు 1 సంవ‌త్స‌రం, రెండు సంవ‌త్స‌రాలు

ప్రీ-పాల‌సీ మెడిక‌ల్ చెక‌ప్

 • 46 సంవ‌త్స‌రాల వ‌య‌సు కంటే ఎక్కువ‌గా ఉన్నా, బీమా హామీ 15 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ‌ ఉన్నా ల‌భిస్తుంది

ముఖ్య‌మైన ఫీచ‌ర్లు
డే కేర్ ట్రీట్‌మెంట్స్:
24 గంట‌ల కంటే త‌క్కువ స‌మ‌యం ఆసుప‌త్రిలో ఉండాల్సి వ‌చ్చిన‌ప్పుడు, పాల‌సీ రోజులో అయ్యే ఖ‌ర్చుల‌ను భ‌రిస్తుంది.

నో-క్లెయిమ్ బెనిఫిట్స్‌:
ప్ర‌తి క్లెయిమ్-ఫ్రీ సంవ‌త్స‌రానికి మీరు 50 శాతం బోన‌స్‌ను పొంద‌వ‌చ్చు. గ‌రిష్ఠంగా పూర్తి బీమా హామీని ఈ విధంగా పొందే అవ‌కాశం ఉంది.

ఆర్గాన్ డోనార్ క‌వ‌ర్‌:
ప‌రిమితుల‌కు అనుగుణంగా అవ‌య‌వాల మార్పిడి చికిత్స‌కు అవ‌స‌ర‌మ‌య్యే దానికి హామి ఇస్తుంది.

ప్రీ హాస్పిట‌లైజేష‌న్‌:
ఆసుప‌త్రిలో చేర‌డానికి 60 రోజుల ముందు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించిన‌, మందుల‌కు అయిన‌ ఖ‌ర్చుల‌ను భ‌రిస్తుంది.

పోస్ట్ హాస్పిట‌లైజేష‌న్‌:
ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన త‌ర్వాత 180 రోజుల వ‌ర‌కు డాక్ట‌ర్ సంప్ర‌దింపుల‌కు, మందుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చులు

రీస్టోర్ బెనిఫిట్స్‌:
ఒక ఏడాదిలో ప్రాథ‌మిక హామీ నుంచి ఖ‌ర్చు అయిన మొత్తాన్ని తిరిగి రీస్టోర్ చేస్తుంది.

పాల‌సీ ప్ర‌యోజ‌నాలు
పోర్టబులిటీ:
మీరు వేరే కంపెనీ బీమా పాల‌సీ క‌లిగి ఉంటే అపోలో మ్యునిచ్ ఆప్టిమా రీస్టోర్ హెల్త్ ప్లాన్‌కు మార‌వ‌చ్చు. దీనివ‌ల‌న మీ పాల‌సీ ప్ర‌యోజ‌నాలు ఏమి త‌గ్గ‌వు.

ప‌న్ను మిన‌హాయింపులు:
సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
హామీ పెంపు:
అప్ప‌టివ‌ర‌కు ఎటువంటి క్లెయిమ్ చేయ‌క‌పోతే బీమా పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో హామీ మొత్తాన్ని పెంచుకునేందుకు సంస్థ‌ను కోర‌వ‌చ్చు.

రోజువారి ఆసుప‌త్రి ఖ‌ర్చులు:
ఎంచుకున్న హామీ మొత్తాన్ని బట్టి, ఆసుప‌త్రిలో చేరిన రోజు , డిశ్చార్జ్ అయిన రోజు క‌లిపి ఆరు రోజుల‌కు వెయ్యి రూపాయ‌ల వ‌ర‌కు డైలీ హాస్పిట‌లైజేష‌న్ అల‌వెన్స్ ల‌భిస్తుంది.

హెల్త్ చెక‌ప్‌:
ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కోసారి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేసుకునేందుకు హామీ మొత్తంలో 1 శాతం వ‌ర‌కు లేదా గ‌రిష్ఠంగా రూ.10 వేలు (బీమా హామీ ఆధారంగా) ల‌భిస్తుంది. ఇప్పుడు రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్క‌వ హామీకి కూడా ఇది వ‌ర్తిస్తుంది.

ఎమ‌ర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్‌:
రూ.10 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ బీమా హ‌మీ ఉంటే ఎమ‌ర్జెన్నీ అంబులెన్స్ ఖ‌ర్చుల‌ను ఇస్తుంది.

ఇంట్లో వైద్య చికిత్స :
ఇంటి ద‌గ్గ‌ర వైద్యం చేసుకుంటే ప్రాథ‌మిక బీమా హామీ ల‌భిస్తుంది. అయితే దీనికి కొన్ని ప‌రిమితులు, నిబంధ‌న‌లు ఉన్నాయి. పాల‌సీ తీసుకునే స‌మ‌యంలో వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

స్టే యాక్టివ్ బెనిఫిట్:
స్టే యాక్టివ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే రోజుకు ఎన్ని అడుగులు వేస్తున్నారో లెక్కించుకోవ‌చ్చు. దీంతో పాటు పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో 8 శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

హెల్త్ అడ్వైజ‌రీ బెనిఫిట్:
పాల‌సీ వ‌ర్తించే ఆసుప‌త్రిలో వైద్యం చేసుకుంటే రూ.5 వేలు బెనిఫిట్ ల‌భిస్తుంది.

ఈ-ఒపీనియ‌న్
తీవ్ర‌మైన వ్యాధుల‌ నిర్ధార‌ణ కొర‌కు ఉచితంగా సెకండ్ ఒపీనియ‌న్ తీసుకోవ‌చ్చు.

ఫ్రీ లుక్ పీరియ‌డ్
ఏదైనా కార‌ణం చేత పాల‌సీ నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటే, డాక్యుమెంట్ అందుకున్న‌ 15 రోజుల్లోపు రీఫండ్ కోసం కంపెనీకి తెలియ‌జేయాల్సి ఉంటుంది.

యాడ్‌-ఆన్‌ క‌వ‌ర్స్‌
క్రిటిక‌ల్ అడ్వాంటేజ్ రైడ‌ర్‌:
మీరు ప్రాథ‌మిక హామీ రూ.10 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ‌ఎంచుకుంటే ప్ర‌పంచంలో ఎక్క‌డైనా పాల‌సీకి సంబంధించిన నెట్‌వ‌ర్క్ ఉన్న ఆసుప‌త్రుల‌లో వైద్యం చేయించుకునే విధంగా ఎనిమిది తీవ్ర వ్యాదుల‌కు ఈ అవ‌కాశం ఉంటుంది. వైద్య ఖ‌ర్చులే కాకుండా ఈ రైడ‌ర్ ప్ర‌యాణ ఖ‌ర్చులు పాల‌సీదారుడితో పాటు వారితో ఉన్న ఒక‌రికి, నివాస ఖ‌ర్చులు, సెకండ్ ఒపీనియ‌న్‌, పోస్ట్ హాస్పిట‌లైజేష‌న్ ఖ‌ర్చుల‌ను కూడా భ‌రిస్తుంది.

ప్రీమియం రేట్లు:

A = Adults
C= Child

Apollo optima premium 1.png
prem 2.jpg
prem 3.jpg

రిమితులు, నిబంధ‌న‌లు:

కో-పేమెంట్:
పాల‌సీదారుడి వ‌య‌సు లేదా పాల‌సీలో ఉన్న స‌భ్యుడి వ‌య‌సు 61 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ ఉంటే క్లెయిమ్ సయంలో మీరు 20 శాతం స‌హ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఉప‌-ప‌ర‌మితులు:
అద్దె గ‌దిపై ఎలాంటి ఉప‌ప‌రిమితులు లేవు. ఈ పాల‌సీతో మీకు న‌చ్చిన గ‌దిలో వైద్యం చేసుకోవ‌చ్చు
వెయిటింగ్ పీరియ‌డ్

కూలింగ్ ఆఫ్ పీరియ‌డ్:
పాల‌సీ తీసుకున్న 30 రోజుల వ‌ర‌కు ఎటువంటి క్లెయిమ్‌ను అనుమ‌తించ‌రు. అయితే ప్ర‌మాదం వ‌ల‌న ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది.

ప్ర‌త్యేక వ్యాదులు:
కొన్ని ర‌కాల ప్ర‌త్యే క వ్యాదుల‌కు పాల‌సీ 24 నెల‌ల త‌ర్వాత‌నే హామీ ఇస్తుంది.

ముందే ఉన్న‌ వ్యాదులు:
ముందుగానే ఉన్న వ్యాదుల‌కు చికిత్స కోసం పాల‌సీ తీసుకున్న 36 నెల‌ల త‌ర్వాత క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉటుంది.

శాశ్వ‌త మిన‌హాయింపులు:
ఈ పాల‌సీ కొన్ని ర‌కాలు చికిత్స‌కు హామీని అందించ‌వు. అవి ఏంటంటే…
ఆత్మ‌హ‌త్య‌ , మ‌ధ్య‌పానం, మ‌త్తు ప‌దార్థాలు తీసుకోవ‌డం, ఎయిడ్స్, గ‌ర్భ‌ధార‌ణ‌, ప్ర‌స‌వం, అబార్ష‌న్, నాన్‌-అల్లోప‌తిక్ ట్రీట్‌మెంట్, ఇన్‌ఫెర్టిలిటీ, విట్రో ఫెర్టిలైజేష‌న్, గొడ‌వ‌లు, అల్ల‌ర్ల వ‌ల‌న జ‌రిగిన గాయాలు వంటి వంటి వాటికి హామీ ఉండ‌దు. పాల‌సీ డాక్యుమెంట్‌లో హామీ ల‌భించని వ్యాదుల గురించి స్ప‌ష్టంగా తెలుసుకోవ‌చ్చు.

చివ‌ర‌గా:

ఒక ఏడాదిలో పాల‌సీ నుంచి క్లెయిమ్ చేసుకున్న త‌ర్వాత తిరిగి పొందేందుకు అపోలో మ్యునిచ్ ఆప్టిమా రీస్టోర్ హెల్త్ ఇన్సూరెన్స్ స‌రిపోతుంది. అదేవిధంగా ఇందులో నో-క్లెయిమ్ బోన‌స్‌, ప‌రిమితులు లేని అద్దె గ‌దులు, న‌గ‌దు ర‌హిత లావాదేవీలు, మంచి నెట్వర్క్ ఆసుపత్రులు వంటివి మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. వ్య‌క్తిగ‌త లేదా కుటుంబం కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల‌నుకున్న‌వారు దీనిని ప‌రిశీలిస్తే మేలు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly