ఉచితంగా యాపిల్ కీబోర్డు మ‌ర‌మ్మ‌త్తులు

కొన్ని యాపిల్ మ్యాక్ బుక్ మోడ‌ళ్ల కీబోర్డుల‌కు ఉచితంగా మ‌ర‌మ్మ‌త్తు సేవ‌లు అందించ‌నున్న‌ట్లు యాపిల్ సంస్థ పేర్కొంది.

ఉచితంగా యాపిల్ కీబోర్డు మ‌ర‌మ్మ‌త్తులు

యాపిల్ మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో మోడళ్ల లాప్టాప్లలో బ‌ట్ట‌ర్ ఫ్లై కీబోర్డుల్లో టైపింగ్-సంబంధిత సమస్యలను రిపేరు చేయ‌నున్న‌ట్లు యాపిల్ తెలిపింది.టైపింగ్ చేసేట‌పుడు అక్ష‌రాలు పున‌రావృత్త‌మ‌వ‌డం, కనిపించక‌పోవ‌డం, ప్రతిస్పందించని కీలు మొద‌లైన వాటికి సంబంధించి ఉచితంగా మ‌ర‌మ్మ‌త్తులు చేయ‌నున్న‌ట్లు యాపిల్ పేర్కొంది.

కీబోర్డు సమస్యల గురించి సోషల్ మీడియా, యాపిల్-సెంట్రిక్ బ్లాగులు, వెబ్ సైట్లపై విమర్శలు ఎదుర్కొంది. యాపిల్ అధీకృత సర్వీస్ ప్రొవైడర్ యాపిల్ మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో బోర్డులకు ఉచితంగా మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని నిర్ణ‌యించింది. కీబోర్డుల‌ను పరిశీలించిన తర్వాత సేవ రకాన్ని నిర్ణయించబడుతుంది.

గత జూన్ లో కొన్ని మోడ‌ళ్ల కీబోర్డులను రిపేర్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ప్ర‌స్తుతం ఈ ప‌రిధిని పెంచుతూ మ‌రిన్ని మోడళ్లకు సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. గ‌తంలో, యాపిల్ ప్రపంచవ్యాప్తంగా మ్యాక్ బుక్ బ్యాట‌రీల‌కు ఉచిత రీప్లేస్మెంట్ అందించింది.

ఈ కింది మోడ‌ళ్లు కీబోర్డు సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా సేవ‌లు పొంద‌వ‌చ్చు.

మ్యాక్ బుక్ (రెటినా, 12-అంగుళాల, ఎర్లీ 2015)

మ్యాక్ బుక్ (రెటినా, 12-అంగుళాల, ఎర్లీ 2016)

మ్యాక్ బుక్ (రెటినా, 12-అంగుళాల, 2017)

మ్యాక్ బుక్ ఎయిర్ (రెటినా, 13-అంగుళాల, 2018)

మ్యాక్ బుక్ ప్రో (13-అంగుళాల, 2016, 2థండ‌ర్ బోల్ట్ 3 పోర్ట్స్)

మ్యాక్ బుక్ ప్రో (13-అంగుళాల, 2017, 2థండ‌ర్ బోల్ట్ 3 పోర్ట్స్)

మ్యాక్ బుక్ ప్రో (13-అంగుళాల, 2016, 4థండ‌ర్ బోల్ట్ 3 పోర్ట్స్)

మ్యాక్ బుక్ ప్రో (13-అంగుళాల, 2017, 4థండ‌ర్ బోల్ట్ 3 పోర్ట్స్)

మ్యాక్ బుక్ ప్రో (15-అంగుళాల, 2016)

మ్యాక్ బుక్ ప్రో (15-అంగుళాల, 2017)

మ్యాక్ బుక్ ప్రో (13-అంగుళాల, 2018, 4 థండ‌ర్ బోల్ట్ 3 పోర్ట్స్)

మ్యాక్ బుక్ ప్రో (15-అంగుళాల, 2018)

మ్యాక్ బుక్ ప్రో (13-అంగుళాల, 2019, 4థండ‌ర్ బోల్ట్ 3 పోర్ట్స్)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly