వాహన బీమా క్లెయిం చేస్తున్నారా? అయితే ఇది మీకోసం..

అనుకోని సంఘ‌ట‌న‌ల వలన ప్ర‌మాదాలు జ‌రిగి కారు న‌డ‌వ‌లేని స్థితిలో వాహ‌న బీమా మ‌న‌కు సహాయంగా ఉంటుంది

వాహన బీమా క్లెయిం చేస్తున్నారా? అయితే ఇది మీకోసం..

వాహ‌నానికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు వెంటనే బీమా క్లెయిం చేసుకోవాల‌ని అనుకుంటూ ఉంటాం. ఇది కారు బీమా విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది. కారుకి ఏదైనా ప్ర‌మాదం జరిగి న‌ష్టం వాటిల్లినట్లయితే, బీమా క్లెయిం చేసుకోవ‌డం ప్రతీ ఒక్క‌రి హ‌క్కు. వాహ‌న బీమా ఉన్న‌దే అందుకోసం. అయితే కారుకి చిన్న చిన్న ప్ర‌మాదాలు జ‌రిగినా చీటికి మాటికి బీమా క్లెయిం చేసుకోవ‌డం మంచిది కాదు. వాహ‌న రంగ నిపుణుల ప్ర‌కారం, బీమా క్లెయింల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే విష‌యంలో క‌చ్చిత‌మైన నిబంధ‌న‌లు లేవు. అయితే ఈ విష‌యంలో కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పరిగణలోకి తీసుకోవడం మంచిది. అనుకోని సంఘ‌ట‌న‌ల వలన ప్ర‌మాదాలు జ‌రిగి కారు న‌డ‌వ‌లేని స్థితిలో వాహ‌న బీమా మ‌న‌కు సహాయంగా ఉంటుంది. అయితే ప్ర‌తీ చిన్న ప్ర‌మాదానికి ముఖ్యంగా కారు ప‌నితీరుపై ప్ర‌భావం చూప‌నివాటికి కూడా త‌ర‌చుగా బీమా క్లెయింలు చేసుకోవ‌డం మంచిది కాదు. దాని కారణంగా కారు మ‌ర‌మ్మ‌త్తుల సమయంలో డ‌బ్బులు చెల్లించాల్సి రావడమే కాకుండా, నో క్లెయిం బోన‌స్‌పైనా ప్ర‌భావం ప‌డుతుంది. నో క్లెయిం బోన‌స్ పై ప్ర‌భావంతో బీమా పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. మాటిమాటికి కారు బీమా క్లెయింలు చేసుకోవ‌డం మంచి విషయం కాదు, ఎందుకంటే త‌దుప‌రి పాల‌సీని పున‌రుద్ధ‌రించిన‌ప్పుడు మీరు ఎన్ని సార్లు బీమా క్లెయిం చేసుకున్నార‌న్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటార‌ని నిపుణులు అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కారు హెడ్‌లైట్, అద్దం ప‌గ‌ల‌డం లాంటి చిన్న చిన్న ప్ర‌మాదాల‌కు కూడా బీమా క్లెయిం చేసుకోవ‌డం సరైన పద్దతి కాదు. ఎందుకంటే వీటికి మీకు వ‌ర్తించే నో క్లెయిం బోన‌స్‌తో పోలిస్తే ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కార‌ణం. దీని వలన పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

కారు కి చిన్న చిన్న సొట్ట‌లు, గీత‌లు ప‌డ్డ సంద‌ర్భాల్లోనూ క్లెయిం చేసుకోవ‌డం త‌గ్గించుకోవాలి. అయితే కారు ముందు భాగం ప‌గ‌ల‌డం లాంటి తీవ్ర ప్ర‌మాదాలప్పుడు క్లెయిం చేసుకోవ‌చ్చు. ఇలాంటి ధోర‌ణితో బీమా స‌దుపాయాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకోవ‌డ‌మే కాక పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో త‌క్కువ ప్రీమియం చెల్లించే అవకాశం కూడా ఉంటుంది.

వినియోగ‌దారులు గుర్తించుకోవాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, క్లెయిం చేసుకునే సంద‌ర్భాల్లో బీమా పాల‌సీలలో మీ వంతుగా చెల్లించే సొమ్ము చాలా వాహ‌న పాల‌సీల‌లో అధికంగా ఉండొచ్చు లేదా మిన‌హాయించుకునే రకంగా ఉండొచ్చు. దీంతో చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తుల వేళ మీకు త‌క్కువ ప్ర‌యోజ‌నం ల‌భించే వీలుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో ఒక్క‌సారి క్లెయిం చేసినా మీ నో క్లెయిం బోన‌స్ సున్నాకి చేరే అవ‌కాశం ఉంది. కావున చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తుల‌కు కాకుండా పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే బీమా క్లెయిం కోసం ద‌ర‌ఖాస్తు చేయాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు, మీరు క్లెయిం చేసుకునే మొత్తం రూ. 3000 ఉండి, మిన‌హాయించుకునే మొత్తం రూ. 1000 ఉన్న‌ట్ల‌యితే, క్లెయిం చేసుకోవ‌డానికి బీమా కంపెనీకి మీరు చెల్లించాల్సిన మొత్తం రూ. 2000. ఈ సంద‌ర్భంలో వినియోగ‌దారుడు మొత్తం సొమ్మును క్లెయిం చేసుకోవ‌డం లేదు, అలాగే అత‌ని నో క్లెయిం బోన‌స్ పైనా దీని ప్ర‌భావం ప‌డుతోంది. నో క్లెయిం బోన‌స్‌తో పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో చెల్లించే ప్రీమియంలో 20 నుంచి 50 శాతం వ‌రకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. కావున చిన్న చిన్న మ‌ర‌మ్మ‌త్తుల‌ కోసం బీమా క్లెయిం చేసుకోవ‌డం మంచిది కాదు.

క్లెయిం చేసుకునేట‌ప్పుడు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు :

  • క్లెయిం చేసుకునేందుకు త‌గిన సంద‌ర్భ‌మేమిట‌న్న దానిపై ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు గానీ నిబంధ‌న‌లు గానీ లేవు. అయితే ఎంత మేర న‌ష్టం జ‌రిగింది, నో క్లెయిం బోన‌స్‌పై దాని ప్ర‌భావాన్ని అంచ‌నా వేసుకుని క్లెయిం చేసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

  • చిన్న చిన్న క్లెయింలు వినియోగ‌దారుల రిస్క్ స్థాయి పెరుగుతుంది. అలాగే పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో ప్రీమియం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. కావున ఈ త‌ప్పులు చేయ‌కూడ‌దు.

  • పాల‌సీలోని లేని అంశాలు, సంద‌ర్భాల‌ను మిన‌హాయించి బీమా సంస్థ‌లు క్లెయింల‌ను తిర‌స్క‌రించ‌వు. కావున వాహ‌న బీమా క్లెయిం చేసుకునేట‌ప్పుడు తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిద‌ని నిపుణుల అభిప్రాయం.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly