మ్యూచువ‌ల్ ఫండ్ల మ‌దుపులో ఈ త‌ప్పులు చేయ‌కండి

మీరు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెడుతున్నారా? అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి.

మ్యూచువ‌ల్ ఫండ్ల మ‌దుపులో ఈ త‌ప్పులు చేయ‌కండి

ఈక్విటీ ఆధారిత పెట్టుబ‌డుల చెల్లించే డివిడెండ్ల పంపిణీ ప‌న్ను 10 శాతం ప్ర‌వేశ‌పెట్ట‌డంతో డివిడెండ్ ప‌థ‌కాల పై కొంత ఆస‌క్తి త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే ఇప్ప‌టికీ కొన్ని ఫండ్ల నిర్వాహ‌కులు డివిడెండ్లు వ‌స్తాయ‌నే హామీ ఇస్తున్నాయి. అయితే కొంద‌రు మ‌దుప‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై వ‌చ్చే డివిడెండ్ల‌ను అద‌న‌పు ఆదాయంగా భావిస్తుంటారు. ఒక‌ ఫండ్ ఆర్జించిన‌ లాభాల్లో నుంచే డివిడెండ్లను ఇస్తుంద‌ని గ‌మ‌నించాలి. దీంతో ఆ ఫండ్ యూనిట్ పై ఇచ్చిన డివిడెండ్ మేర‌కు యూనిట్ ఎన్ఏవీ త‌గ్గుతుంది. గ్రోత్ ఆప్ష‌న్ లో అయితే ఏ విధ‌మైన డివిడెండ్ ఉండ‌దు కాబ‌ట్టి ఆ మొత్తం యూనిట్ ఎన్ఏవీకి క‌లిసి ధ‌ర పెరుగుతుంది. బ్యాలెన్స్‌డ్ ఫండ్లు ప్ర‌తి సారీ లాభాల‌ను ఇస్తాయ‌నే ఆలోచ‌న‌తో మ‌దుప‌ర్లు ఉండ‌టం మంచిది కాదు. బ్యాలెన్స‌డ్ ఫండ్లలో కూడా ఈక్విటీ ఫండ్లలానే న‌ష్ట‌భ‌యం కొంత ఎక్కువగా క‌లిగి ఉంటాయి. వీటిలో కూడా క‌చ్చితంగా ఆదాయం వ‌స్తుంద‌నే హామీ ఉండ‌దు. వీటిలో దీర్ఘ‌కాలం పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా కొంత న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉన్నా మంచి రాబ‌డిని పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈక్విటీ సంబంధిత ఫండ్ల‌ను ఎంచుకునే ముందు దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డి కొన‌సాగించాల‌నే ఆలోచ‌న‌తో ఉండాలి.

సెక్టార్, క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ల‌లో:

సెక్టార్ ఫండ్ల హ‌వా ఇప్ప‌టికే త‌గ్గింది కానీ క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ల‌ది మాత్రం కొన‌సాగుతుంది. ఇటీవ‌లె జ‌రిగిన మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గీక‌ర‌ణ‌తో క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ల‌ను ప్ర‌త్యేక‌మైన థీమ్ ఆధారంగా ఉంటేనే త‌ప్ప అనుమ‌తించేంది లేద‌ని సెబీ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టికే కొన్ని పెట్టుబ‌డి వ్యూహాల‌తో కొన‌సాగుతున్న ఫండ్ల లాంటి వాటిని ప్రారంభించేందుకు అవ‌కాశం లేదు. కాబ‌ట్టి విచిత్ర‌మైన పేర్ల‌తో కొత్త ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి అమ్మే అవ‌కాశం ఏఎమ్‌సీల‌కు లేన‌ట్లే. ఇది ఒక్క క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్ల‌నే కాదు ఓపెన్ ఎండ్ ఫండ్ల‌కు కూడా వ‌ర్తింస్తుంది.

మ‌దుప‌ర్ల‌కు మంచిదే:

ఇది మ‌దుప‌ర్ల‌కు మంచి చేకూర్చే ప‌రిణామంగా చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల‌ను విక్ర‌యించేందుకు న‌ప్పిన వారికి న‌ప్ప‌ని వారికి అని లేకుండా ఎవ‌రికీ ఏదైనా అమ్మేయ‌డం జ‌రుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫండ్ల సంఖ్య త‌గ్గ‌డం వ‌ల్ల మ‌దుప‌ర్ల‌కు కూడా స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

డెట్ ఫండ్లే కానీ:

డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల విక్ర‌యాలు ముఖ్యంగా డెట్ ఫండ్లు 1999 సంవ‌త్స‌రంలో ప్రారంభం అయ్యాయి. ఆ స‌మ‌యంలోఈక్విటీ, డెట్ రెండింటి పై వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను ఉండేది కాదు. డెట్ ఫండ్ల‌ను మ‌దుప‌ర్లు కొంత శాతం క‌లిగిఉండ‌డం అవ‌స‌రం. అయితే మ‌దుప‌ర్లు డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేముందు మ‌దుప‌ర్లు వాటిలో ఉండే క్రెడిట్ రిస్క్, ఇంట్ర‌స్ట్ రేట్ రిస్క్ ల‌ను అర్థం చేసుకోవాలి. డెట్ ఫండ్ల పై వ‌చ్చే రాబ‌డిపై నిర్వ‌హ‌ణ రుసుము ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి వీటిలో మ‌దుపు చేసే ముందు నిర్వ‌హ‌ణ రుసుమును కూడా చూసుకోవాలి.

చాలా సంద‌ర్భాల్లో పెట్టుబ‌డి త‌ప్పిదాల‌ను స‌రిదిద్దుకునేందుకు ఆల‌స్య‌మైంద‌ని అనిపిస్తుంటుంది. అయితే మ‌దుప‌ర్లు అప్ప‌టి నుంచి చేసే పెట్టుబ‌డుల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై దృష్టి పెట్టాలి. దీనికి మ‌దుప‌ర్లు ఒక సారి త‌మ ఆర్థిక ల‌క్ష్యాలేంటి. ఎంత కాలం పెట్టుబ‌డి కొన‌సాగించాల‌నుకుంటున్నారా త‌దిత‌ర వివ‌రాల‌న్నీ చూసుకుని పోర్టుఫోలియోను పున‌నిర్మించుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly