మ‌దుపుతోనే ఆర్థిక భ‌ద్ర‌త‌..విశాఖ సిరి మదుపరుల సదస్సు విశేషాలు!

ప్ర‌స్తుతం సిప్ చేసేవారికి అనువైన ప‌రిస్థితులు ఉన్నాయని చెప్పారు నిపుణులు

  • మదుపు తోనే ఆర్ధిక భద్రత
  • ఒడిదుడుకులకు భయపడకూడదు, జీవిత బీమా తప్పనిసరి - సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు లో నిపుణుల సూచనలు.

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ శ‌నివారం విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది. మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు ఒడిదొడుకుల‌కు భ‌య‌ప‌డ‌కూడ‌దు. కుటుంబానికి భ‌రోసా క‌ల్పించేందుకు జీవిత బీమా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఇలాంటి మ‌రిన్ని ముఖ్య‌మైన అంశాల‌ను సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సులో నిపుణ‌లు సూచించారు.

స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌ను ఎంచుకొని, దీర్ఘ‌కాలం కొన‌సాగిన వారికి మంచి లాభాలు అందే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్థిక నిపుణులు సూచించారు. పెట్టుబడి పెట్టేముందు ఆయా ప‌థ‌కాల‌పై పూర్తి అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని తెలిపారు. శ‌నివారం న‌గ‌రంలో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్ క్ల‌బ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు విశేష స్పంద‌న ల‌భించింది. తొలుత ఈనాడు విశాఖ‌ప‌ట్నం యూనిట్ ఇన్‌ఛార్జి కె.వి రామారావు మ‌దుప‌రుల స‌ద‌స్సు ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. అనంత‌రం నిపుణులు మార్కెట్‌పై మ‌దుప‌రుల‌కు ఉన్న సందేహాల‌ను నివృత్తి చేశారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పొదుపు చేస్తే మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వివ‌రించారు.

సిప్ చేస్తూనే ఉండండి - జి.వి ర‌వి శేష‌ర్, హెడ్, ఐఎఫ్ఏ చానెల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్

IMG_20190323_183027.jpg

మార్కెట్ నియంత్ర‌ణ సంస్థ సెబీ ఇటీవ‌ల మ్యూచువ‌ల్ ఫండ్ల విభాగాల‌ను కొత్త‌గా వ‌ర్గీక‌రించింది. ఇందులో బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ల‌కు మ‌దుప‌రుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. గ‌తంలో ఈ విభాగం లేన‌ప్ప‌టికీ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఆ సేవ‌ల‌ను అందించేవి. ఇప్పుడు ప్ర‌త్యేకంగా ఆ విభాగం వ‌చ్చినందున మ‌దుప‌రుల పెట్టుబ‌డుల‌కు మ‌రింత భ‌రోసా వ‌చ్చింది. స్టాక్ మార్కెట్లో స‌హ‌జంగా ఉండే ఒడిదొడుకుల నుంచి మ‌దుప‌రుల డ‌బ్బుకు ఇప్పుడు ర‌క్ష‌ణ పెరిగింది.

  • స్టాక్ మార్కెట్లో హెచ్చుత‌గ్గులు స‌ర్వ‌సాధార‌ణం. చిన్న మ‌దుప‌రులు వీటి గురించి ఎక్కువ‌గా ప‌ట్టించుకోకూడ‌దు. ఐదేళ్ల‌పాటు త‌ప్ప‌కుండా పెట్టుబ‌డి పెడ‌దామ‌ని వ‌చ్చిన వారు కూడా రెండేళ్ల‌పాటు స‌రైన వృద్ధి క‌నిపించ‌క‌పోతే ఆందోళ‌న చెందుతారు. పెట్టుబ‌డి మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంటారు. ఫ‌లితంగా వారు ఆర్థికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది.
  • మ్యూచువ‌ల్ పండ్ల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం (సిప్) చేయ‌డం ఎప్పుడూ మంచిది. మార్కెట్లో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నా…సిప్ చేయ‌డం ఆపొద్దు. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌నే మ‌దుప‌రులు దృష్టిలో పెట్టుకోవాలి. ప్ర‌స్తుతం సిప్ చేసేవారికి అనువైన ప‌రిస్థితులు ఉన్నాయి.
  • మీ ఆదాయం ఎంత భ‌విష్య‌త్తులో ఖ‌ర్చులు ఎలా ఉంటాయి వాటిని త‌ట్టుకునేందుకు ఎలాంటి పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి ఇలా క‌చ్చిత‌మైన ప్ర‌నాళిక వేసుకోవాలి. దాని ఆధారంగా పెట్టుబ‌డులు పెట్టాలి. అప్పుడు ఆర్థికంగా విజయం సాధించ‌గ‌లం.

విశ్రాంతంలో ప్ర‌శాంతంగా…సాయికృష్ణ ప‌త్రి, స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్

IMG_20190323_195640.jpg

సంపాదించే ప్ర‌తి వ్య‌క్తీ త‌న కుటుంబానికి త‌గిన ఆర్థ‌కి భ‌రోసా క‌ల్పించాలి. ఇందుకోసం తొలుత చేయాల్సిన ప‌ని… వార్షికాదాయానికి క‌నీసం 20 రెట్ల వ‌ర‌కు జీవిత బీమా పాల‌సీని తీసుకోవ‌డం. త‌క్కుమ మొత్తానికి బీమా చేస్తే అనుకోని ప‌రిస్థితుల్లో ఆ మొత్తం కుటుంబానికి భ‌రోసా క‌ల్పించ‌దు.

  • చ‌దువుల ఖ‌ర్చుల భారం పెరిగిపోతుంది. భ‌విష్య‌త్తులో ఇవి ఇంకా పెగుతాయ‌నేది వాస్తవం. దీన్ని గుర్తించి, ఆ వ్య‌యాల‌ను త‌ట్టుకునేఉలా మ‌న పెట్టుబ‌డులు కొన‌సాగాలి.
  • క‌నీసం ఆరు నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపడే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి లేదంటే ఉద్యోగాల మారిన‌ప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి.
  • ఉద్యోగంలో చేరిప్పుడే …విశ్రాంత జీవితానికి అవ‌స‌ర‌మైన ఆదాయాన్ని సంపాదించే ప్ర‌ణాళిక వేసుకోవాలి. అందుకు అనువైన పెట్టుబ‌డులు ప్రారంభించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో మంచి మొత్తం స‌మ‌కూరుతుంది. ప‌ద‌వి విర‌మ‌ణ అనంత‌రం ఎవ‌రిపైనా ఆధార‌ప‌డాల్సిన అవ‌సరం రాదు.
  • అవ‌స‌రాలు, కోరిక‌ల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని తెలుసుకోవాలి. కోరిక‌ల‌ను అవ‌స‌రాలు అనుకొని ఖ‌ర్చు పెడితే ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తుతాయి. ఆర్థిక లక్ష్యాల‌ను గుర్తించి వాటిని సాధించేందుకు అనువైన పెట్టుబ‌డుల‌పై దృష్టి సారించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly