యాక్సిస్ బ్యాంకు నిధుల స‌మీక‌ర‌ణ‌

యాక్సిస్ బ్యాంకు వ్యాపార విస్త‌ర‌ణ‌కై భారీ మొత్తంలో నిధుల‌ను స‌మీక‌రించ‌నుంది.

యాక్సిస్ బ్యాంకు నిధుల స‌మీక‌ర‌ణ‌

ప్రైవేటు రంగ మూడ‌వ అతిపెద్ద యాక్సిస్ బ్యాంకు ఈ ఏడాది రూ.35,000 కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది. దేశ, విదేశాల్లో బ్యాంకు వ్యాపార విస్త‌ర‌ణ కోసం ఈ నిధుల‌ను వినియోగించ‌నుంది. విదేశీ క‌రెన్సీ బాండ్లు, గ్రీన్ బాండ్లు, ఎన్‌సీడీలు వంటి విభిన్న ఇష్యూల ద్వారా నిధుల‌ను సేక‌రించున్న‌ట్లు బ్యాంకు తెలిపింది. ఒక సంవ‌త్స‌ర కాల‌ప‌రిమితితో బాండ్ల‌ను జారీ చేయ‌నుంది. ఏప్రిల్ 26, 2017 న జ‌రిగిన బ్యాంకు బోర్డు స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్రస్తుతం బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంకు షేర్లు రూ.4.80 లాభంతో రూ.512 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly