హెల్త్‌గార్డ్ పాల‌సీ పున‌రుద్ద‌ర‌ణ

ప్రైవేట్ రంగ బ‌జాజ్ అల‌యెంజ్ హెల్త్‌గార్డ్ పాల‌సీలో అద‌న‌పు స‌దుపాయాలు క‌ల్పించి మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది.

హెల్త్‌గార్డ్ పాల‌సీ పున‌రుద్ద‌ర‌ణ

బ‌జాజ్ అల‌యెంజ్ హెల్త్‌గార్డ్ పాల‌సీని పున‌రుద్ద‌రించి మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను జ‌త చేస్తూ మార్కెట్లోకి విడుద‌ల చేసింది. దీనిలో పాల‌సీ పీరియ‌డ్‌ను మూడేళ్ల‌కు పెంచింది. ఈ పాల‌సీలో దాదాపు కుటుంబ‌మంత‌టికీ క‌వ‌రేజీ స‌దుపాయం క‌ల్పించారు. 10 రోజులకు మించి ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన వారికి పోషకాహ‌రం ఖ‌ర్చులు, ఆస్ప‌త్రి ఖ‌ర్చులు, ఆరోగ్య ఉప‌క‌రణాలు త‌దిత‌ర స‌దుపాయాలు అందిస్తుంది.

పాల‌సీదారుడు ఉండే ప‌ట్ట‌ణం బ‌ట్టి ప్రీమియం ధ‌ర మారుతుంది. పాల‌సీదారుడిపై ఆధార ప‌డ్డ పిల్ల‌ల వ‌య‌స్సును సైతం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల‌కు పెంచింది. 35 ఏళ్ల లోపు బీమా క‌వ‌రేజీని పున‌రుద్ధ‌రించుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఇంకా అద‌నంగా ప్ర‌సూతి క‌వ‌రేజీ, అప్పుడే పుట్టిన పిల్ల‌ల క‌వరేజీ, అంబులెన్స్‌, అవ‌య‌వ దాత ఖ‌ర్చులు, రోజువారీ ఖ‌ర్చులు, హెల్త్ చెక‌ప్, ఆయుర్వేదిక్, హోమియోప‌తి ఖ‌ర్చులు మొద‌లైన‌వి పాల‌సీదారుల‌కు అందిస్తుంది.
#Bajaj Allianz, #బ‌జాజ్ అల‌యెంజ్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly