రికరింగ్‌ డిపాజిట్లు (ఆర్‌డీ)

నెల వారీ చిన్న చిన్న మొత్తాలను పొడుపు చేసుకునే వీలు కల్పించే రికరింగ్‌ డిపాజిట్ వివరాలు తెలుసుకుందాం.

రికరింగ్‌ డిపాజిట్లు (ఆర్‌డీ)

నిర్ణయించిన కాలపరిమితి వరకూ క్రమమైన పద్ధతిలో అనువైన మొత్తం పొదుపు చేసుకోగలిగే సొమ్ము డిపాజిట్‌ చేసేందుకు ‘రికరింగ్‌ డిపాజిట్లు’ అవకాశాన్నిస్తాయి. నెల నెలా డిపాజిట్‌ చేసేందుకు ఆర్‌డీలు అనుకూలం. చక్రవడ్డీ సూత్రం ఆర్‌డీలకు అద్భుతంగా పనిచేస్తుంది.
21 ఏళ్ల వయస్సు నుంచి ఆర్‌డీలో నెలకు రూ.1000 మదుపు చేస్తూ పోతే  58ఏళ్లు వచ్చేసరికి 7.5 శాతం వడ్డీ రేటు వర్తింపుతో రూ.24 లక్షలు జమ అవుతుంది.

ముఖ్యమైన లక్షణాలు:

  • ఎంచుకునే కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి.
  • ఆరు నెలల నుంచి 120 నెలల కాలపరిమితితో ఆర్‌డీ తెరవవచ్చు.
  • మూడు నెలలకోసారి చక్రవడ్డీ వర్తింపజేస్తారు.
  • తక్కువ మొత్తంలో రూ.10తోనూ ఆర్‌డీ ప్రారంభించవచ్చు. నెలనెలా రూ.5 గుణాంకాలతో వీటిలో డిపాజిట్లు చేయవచ్చు.
  • ఎంత మొత్తమైనా డిపాజిట్‌ చేసేందుకు వీలుండటంతో సామాన్యులకు అందుబాటులో ఉంటుందీ పథకం.

ఇతర లక్షణాలు:

  • కొన్ని బ్యాంకులు ఫ్లెక్సీ ఆర్‌డీలను అందిస్తున్నాయి. వీటిలో నెల నెలా పెట్టుబడి పెట్టే సొమ్మును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
  • కొన్ని బ్యాంకులు ఆర్‌డీ ఖాతాలపై వ్యక్తిగత ప్రమాద బీమానందిస్తున్నాయి.
  • ఆర్‌డీలకు నామినేషన్‌ సౌకర్యం ఉంటుంది.
  • అత్యవసర పరిస్థితుల్లో ఆర్‌డీ సొమ్ముకు 90శాతం సమానమైన రుణం పొందేందుకు వీలుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly