పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)
ఆర్ధిక విషయాల వైపు మొదటి అడుగు పొదుపు ఖాతా ప్రారంభించడం. పొడుపు ఖాతా గుఇరించిన ప్రాధమిక విషయాలను తెలుసుకుందాం.
వ్యక్తుల్లో పొదుపు చేసే అలవాటును పెంపొందించడమే పొదుపు ఖాతా ముఖ్యోద్దేశం. ఈ ఖాతాలను అర్హత కలిగిన వ్యక్తులు ఎవరైనా తెరవవచ్చు. సొమ్ము నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు తీసుకునేందుకు పొదుపు ఖాతాలు చక్కగా ఉపయోగపడతాయి.
కేవైసీ నిబంధనలను సంతృప్తి పరిచిన వ్యక్తులు, వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలను బ్యాంకులో సమర్పించి పొదుపు ఖాతాలను తెరుచుకునే వీలుంది.
పొదుపు ఖాతా నిర్వహించేందుకు కనీసం మూడు నెలలకు ఒక్కసారైనా లావాదేవీ జరపాల్సి ఉంటుంది. ఖాతాలో కనీస నిల్వను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ కనీస నిల్వ కన్నా తక్కువ సొమ్ము ఉన్నట్ల యితే బ్యాంకులు రుసుములు విధిస్తాయి.
ఇతర లక్షణాలు:
- ఎన్ని సార్లు డిపాజిట్లు చేయాలన్న దానిపై కనీస పరిమితులు ఉండవు.
- విత్‌డ్రాల విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి.
- ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) ద్వారా చెల్లింపులు చేసె సదుపాయం ఉంటుంది.
- జీతం లేదా పింఛను వచ్చే ఖాతాలైతే తాత్కాలిక ఓవర్ డ్రాఫ్టులు తీసుకునే వీలుంది.
- పొదుపు ఖాతాలో వడ్డీని మూడు లేదా ఆరునెలలకు ఒకసారి జమచేస్తారు.
పొదుపు ఖాతాపై బ్యాంకులు అందించే ఉచిత సదుపాయాలు
- నగదు లావాదేవీలు
- ఏటీఎంలు, షాపింగ్ టెర్మినళ్ల దగ్గర ఉపయోగించుకునేందుకు డెబిట్ కార్డులు
- ఏటీఎంల ద్వారా లావాదేవీలు
- స్థానిక చెక్కుల క్లియరెన్స్
- ఫిక్స్డ్ డిపాజిట్లను పొదుపు ఖాతాతో అనుసంధానం
- ఫోన్ బ్యాంకింగ్ సేవలు
- మొబైల్ బ్యాంకింగ్ సేవలు
- క్రమమైన చెల్లింపులు జరిపేందుకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు వెసులుబాటు
- కరెంటు, ఫోన్ బిల్లులు చెల్లించేందుకు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవల సదుపాయం
- పన్ను చెల్లింపులు
పొదుపు ఖాతా ద్వారా అందించే విలువ ఆధారిత సేవలు:
- నగదు, చెక్కులను అందించేందుకు, పొందేందుకు హోమ్ డెలివరీ సదుపాయం
- ఎక్కడైనా బ్యాంకింగ్ చేసుకునే సదుపాయం
- ఏటీఎంల నుంచి పెద్ద మొత్తాలో నగదు విత్‌డ్రా చేసుకోసుకునే అవకాశం
- ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి సొమ్ము తీసుకునే సదుపాయం
- ఫోన్ బ్యాంకింగ్ ద్వారా సత్వర స్పందన వచ్చే సేవలు
- సత్వర సేవలకు బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు
Comments
0