నెమ్మ‌దించిన బ్యాంకుల రుణాలు, డిపాజిట్ల వృద్ధి

జూన్ నెల‌లో బ్యాంకుల రుణాల వృద్ధితో పాటు డిపాజిట్లు మంద‌గించాయి. మ‌రోవైపు ఆహారేత‌ర రుణాలు పెరిగాయి.

నెమ్మ‌దించిన బ్యాంకుల రుణాలు, డిపాజిట్ల వృద్ధి

జూన్ 7 తో ముగిసిన ప‌క్షానికి బ్యాంకుల రుణాల‌తో పాటు డిపాజిట్లు కూడా త‌గ్గిన‌ట్లు ఆర్‌బీఐ నివేదిక‌లో పేర్కొంది. బ్యాంకుల రుణ వృద్ధి 9.92 శాతంతో రూ.96.52 ల‌క్ష‌ల కోట్లు కాగా గ‌తేడాది ఇది రూ.85.94 ల‌క్ష‌లుగా న‌మోదైంది. డిపాజిట్లు 12.31 శాతం వృద్ధితో 114.08 ల‌క్ష‌ల కోట్లకు చేరాయి. మ‌రోవైపు ఆహారేత‌ర రుణాలు 11.9 శాతం పెరిగాయి. గ‌తేడాది ఇవి 10.7 శాతంగా ఉన్నాయి. మే 24 నాటికి ముగిసిన ప‌క్షానికి అడ్వాన్సులు 12.70 శాతం పెరిగి రూ.96.22 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. డిపాజిట్లు 10.09 శాతం పెరిగి రూ.124.98 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్నాయి.

ఏప్రిల్ నెల‌లో వ్య‌వ‌సాయ సంబంధిత రుణాలు 7.9 శాతం పెరిగాయి. 2018 ఏప్రిల్ నెల‌లో ఇవి 5.9 శాతంగా ఉన్నాయి. సేవా రంగ రుణాలు 16.8 శాతం కాగా, గ‌తేడాది ఇదే నెల‌లో 20.7 శాతం. ఇక‌ వ్య‌క్తిగ‌త రుణాల వృద్ధి 19.1 శాతం నుంచి 15.7 శాతానికి త‌గ్గింది. ప‌రిశ్ర‌మ‌ల రుణాలు 1 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly