రెపో రేటు అనుసంధానిత‌ రుణాలను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో రేటుతో అనుసంధానించిన రుణాలను ప్రారంభించింది.

రెపో రేటు అనుసంధానిత‌ రుణాలను ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే రెపో రేటుతో అనుసంధానించిన కొత్త గృహ రుణ ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఇప్ప‌టికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ త‌ర‌హా ప‌థ‌కాల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవ‌లె ద్రవ్య విధాన కమిటీ 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు నిర్ణయం తరువాత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్ సహా అనేక ప్రభుత్వ బ్యాంకులు బాహ్య బెంచ్ మార్కుతో అనుసంధానించిన‌ రుణ సాధ‌నాల‌ను ప్రారంభించాలనే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశాయి.

ప్రస్తుతానికి, కొత్త ఉత్పత్తులు ఎక్కువగా గృహ, ఆటో రుణాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. గృహ రుణ ఉత్పత్తిని ఎంచుకునే బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కస్టమర్‌లకు ఎమ్‌సీఎల్ఆర్ అనుసంధాన రేటు - బ్యాంక్ నిధుల వ్యయానికి సూచిక లేదా రెపో రేటుతో అనుసంధానించిన‌ రేటు ప్ర‌కారం ఉంటుంది. మెరుగైన వడ్డీ రేటు ప్రసారానికి వీలుగా, త్వరలోనే తన గృహ‌, వాహ‌న రుణ పోర్ట్‌ఫోలియోను రెపో రేటుతో అనుసంధానిస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్య రెపో రేటు 75 బిపిఎస్ తగ్గినప్పటికీ, బ్యాంకులు కొత్త గా ఇచ్చే రుణాలపై సగటు రుణ రేట్లను (డ‌బ్ల్యూఏఎల్ఆర్) ఇదే కాలంలో కేవలం 29 బిపిఎస్ తగ్గించాయని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గ‌తంలో వెల్ల‌డించారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly