మోసాల భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్తలు అవ‌స‌రం

ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్-19 ప‌రిస్థితుల్లో సైబ‌ర్ మోస‌గాళ్లు ఇది త‌గిన స‌మ‌యంగా భావిస్తారు

మోసాల భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్తలు అవ‌స‌రం

ప్రస్తుత పరిస్థితిలో, భద్రత‌కు సంబంధించి రెండు అంశాలు చాలా ముఖ్యమైనవి - మొదటిది కోవిడ్-19 వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి సామాజిక దూరాన్ని పాటించ‌డం, ప్రస్తుత నేప‌థ్యంలో ఎక్కువ డిజిట‌ల్ లావాదేవీలు చేస్తుంటారు కాబ‌ట్టి ఆన్‌లైన్ మోసాల భారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం. దేశంలో ప్రస్తుత చెల్లింపు వ్యవస్థ ఇప్పటికే క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో పాటు ఇ-వాలెట్లు, బీమ్‌ యుపిఐ, చెల్లింపు గేట్‌వేలు, NEFT / IMPS / RTGS వంటి పలు రకాల డిజిటల్ విధానాల‌కు అనుమ‌తిస్తుంది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అంద‌రు ఆన్‌లైన్ చెల్లింపుల‌ను ఉప‌యోగించుకుంటే, సైబ‌ర్ మోస‌గాళ్లు ఇది త‌గిన స‌మ‌యంగా భావిస్తారు. కొవిడ్-19 నేప‌థ్యంలో భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, వ్యక్తిగత , బ్యాంకింగ్ వివరాలను త‌స్క‌రించ‌డం వంటి ప‌లు సంఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే న‌మోద‌వ‌య్యాయి.

ప్రముఖ బ్యాంకులు ఇప్ప‌టికే దీనిపై త‌గిన చ‌ర్య‌లు ప్రారంభించిన‌ప్ప‌టికీ, వినియోగ‌దారులు తీసుకునే జాగ్ర‌త్త‌లు కూడా మోసాల భారిన ప‌డ‌కుండా ఉంటారు.

అధికారిక స‌మాచారాన్ని పొందండి
కాలంతో పాటు మోసాలు జ‌రిగే ప‌ద్ధ‌తి కూడా మారుతోంది. ఇప్పుడు సైబర్ నేరస్థులు ప్రస్తుత COVID-19 మహమ్మారి వంటి ప్రస్తుత సంక్షోభాన్ని అలాగే నిబంధనలలో మార్పుల వల్ల తలెత్తే గందరగోళాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశ‌ముంది. మారిన నిబంధ‌న‌ల‌ను అర్థం చేసుకోవడానికి మీ బ్యాంక్‌ను సంప్ర‌దించండి. భారతదేశంలో, ఆర్‌బిఐ, ఎన్‌పిసిఐ, మాస్టర్ కార్డ్ & వీసా చెల్లింపులకు సురక్షితమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి చ‌ర్య‌లు తీసుకుంటాయి.

సైబ‌ర్ మోసాల‌పై అవ‌గాహ‌న‌
వ్యక్తులు , సంస్థల అధికారిక వెబ్‌సైట్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా వివ‌రాల‌ను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే, దాని ప్రామాణికతను ధృవీకరించడానికి అందుకున్న ఇ-మెయిల్ డొమైన్ పేరును చూడవచ్చు. COVID-19 వ్యాప్తికి సంబంధించిన అన్ని ఇమెయిల్‌లను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇటీవల, ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ఛానల్‌ ఉచిత సభ్యత్వాన్ని అందిస్తున్నట్లు ఒక సర్వే చేస్తున్న‌ట్లు త‌ప్పుడు స‌మాచారం చ‌క్క‌ర్లు కొట్టింది. ఇది తరువాత స్కామ్ అని తేలింది.

స‌మ‌గ్ర ప‌రిశోధ‌న చేయండి

మీ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్‌ల‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి. అప్పుడు మీకు సైబర్ దాడిని నివారించడానికి తాజా భద్ర‌తా విధానాలు అందుబాటులోకి వ‌స్తాయి. క‌రోనా వైర‌స్ వివ‌రాలు కూడా అధికారిక వెబ్‌సైట్లు , ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా తెలుసుకోండి. త‌ప్పుడు స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్దు. భ‌యాందోళ‌లు పెంచ‌డానికి మోస‌గాళ్లు త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేసే అవ‌కాశ‌ముంది.

పిన్ నంబ‌ర్లు, ఓటీపీలు జాగ్ర‌త్త‌
డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, పిన్, గడువు తేదీలు, సివివి నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ మొదలైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వాటిని కూడా ఎవరైనా సులభంగా తెలుసుకోలేరు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఏటిఎం పిన్‌లను రాడ‌యం లేదా వాటిని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవ‌డం కంటే గుర్తుంచుకోవడం మంచిది. ఎవరైనా వాటిని అడిగితే వారి అధికారిక ఐడి నుంచి ఇమెయిల్ పంపమని చెప్పండి.

పాస్‌వ‌ర్డ్ గుర్తుంచుకోండి
క్లిష్ట‌మైన‌ పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి. మీ పేరు, ఇంటిపేరు పుట్టిన తేదీని మినహాయించి సిఫార్సు చేసిన పాస్‌వర్డ్ మార్గదర్శకాలను అనుసరించండి. అలాగే, మీ పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకోవ‌డం మంచిది.

న‌మ్మ‌ద‌గిన, మంచి రివ్యూ ఉన్న‌ యాంటీవైరస్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించడం, పబ్లిక్ వైఫై వాడకాన్ని నివారించడం, వ్యాపారులు, సంస్థల విశ్వసనీయ వెబ్‌సైట్లలో మాత్రమే షాపింగ్ చేయడం మంచిది. మీ బ్యాంకు లేదా బీమా సంస్థ‌గా చెప్తూ మీ వ్య‌క్తిగ‌త, బ్యాంకింగ్ వివ‌రాలు అడిగితే వాటిని తెలియ‌జేయ‌కూడ‌దు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly