గ‌త వారంలో సాధార‌ణం కంటే 24% త‌క్కువ వ‌ర్ష‌పాతం

అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన‌ వాయు తుఫాను రుతుప‌వ‌నాల‌ను బ‌ల‌హీన‌ప‌రిచింది.

గ‌త వారంలో సాధార‌ణం కంటే 24% త‌క్కువ వ‌ర్ష‌పాతం

జూన్ 26 తో ముగిసిన వారంలో వ‌ర్ష‌పాతం సాధార‌ణం కంటే 24 శాతం త‌క్కువ‌గా న‌మోదైంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. మ‌ధ్య, పశ్ఛిమ‌ ప్రాంతాల్లో త‌క్కువ వ‌ర్ష‌పాతం ఉంది. వ్యవసాయ ఉత్పత్తికి, ఆర్ధిక వృద్ధికి వర్షాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే దక్షిణ ఆసియాలో వ్యవసాయ యోగ్యమైన భూమి 55% వర్షాల‌పై ఆధార‌ప‌డి ఉంది. వ్యవసాయ రంగం దాదాపు 2.5-ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆర్థిక వ్యవస్థలో 15% ఉంటుంది.

వ‌ర్షాలు ఆల‌స్యంగా రావ‌డం వ‌ల‌న వేస‌విలో పండించే వ‌రి, సోయా, మొక్క‌జొన్న వంటి పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లుతుంది. పంట‌ల దిగుబ‌డి త‌గ్గుతుంది. జూన్ 1 నుంచి ప్రారంభ‌మైన ఈ సీజ‌న్‌లో సాధార‌ణం కంటే 36 శాతం త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జూన్ 8 న కేర‌ళ‌లో రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించాయి. అయితే అరేబియా స‌ముద్రంలో వాయు తుఫాను ప్ర‌భావంతో వ‌ర్ష‌పాతం త‌క్కువ‌గా న‌మోదైంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly