ఐఆర్‌సీటీసీ, ఓలా అందిస్తున్న ప్ర‌యాణ బీమా పాల‌సీ ప్ర‌యోజ‌నాలు

ఐఆర్‌సీటీసీ, ఓలా అందించే ఆప్ష‌న‌ల్ బీమా స‌దుపాయంలో ప్రీమియం త‌క్కువ‌గా, హామీ ఎక్కువ‌గా ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ, ఓలా అందిస్తున్న ప్ర‌యాణ బీమా పాల‌సీ ప్ర‌యోజ‌నాలు

ప్ర‌యాణాల‌లో ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే క‌లిగే ఆర్థిక‌ న‌ష్టాన్ని త‌గ్గించేందుకు ప్ర‌యాణ బీమాను కొనుగోలు చేస్తారు. ఇందులో మీ వ‌స్తువులు పోవ‌డం కూడా క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. దేశీయ ప్ర‌యాణాల‌కు ప్ర‌యాణ బీమా త‌ప్ప‌నిస‌రి కాద‌నే చెప్పుకోవాలి. అయితే త‌క్కువ ప్రీమియంతో లేదా ఉచితంగా ప్ర‌యాణ బీమా సౌక‌ర్యం ల‌భిస్తున్న‌ప్పుడు దానిని తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణ బీమా
రైలు ప్ర‌యాణాల‌లో ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ఐఆర్‌సీటీసీ బీమా హామీని ఇస్తుంది. అయితే దీనిని ప్ర‌యాణికులు టిక్కెట్ బుకింగ్ స‌మ‌యంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిని థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలు బ‌జాజ్ అలియాంజ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్‌, రాయ‌ల్ సుంద‌రం వంటి కంపెనీలు అందిస్తాయి. ఆన్‌లైన్‌లో టిక్కెట్ కొనుగోలు చేసిన‌వారికి మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునేవారు బీమా స‌దుపాయాన్ని ఎంచుకోవ‌చ్చు.

ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణ బీమా వివరాలు

 • బీమా స‌దుపాయం పొందేందుకు ఒక వ్య‌క్తికి 0.49 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
 • విదేశీయుల‌కు ఈ స‌దుపాయం ఉండ‌దు.
 • ఈ స్కీమ్ ప్ర‌యాణికుల ఇష్టానుసారం ఎంచుకోవ‌చ్చు.
 • ఎస్ఎంఎస్ ద్వారా వినియోగ‌దారుడికి స‌మాచారం అందుతుంది. నేరుగా బీమా సంస్థ‌ల నుంచి మెయిల్‌కి పాల‌సీ గురించి సందేశం వ‌స్తుంది. లింక్ ద్వారా నామినేష‌న్ వివ‌రాలు తెలియ‌జేయ‌వ‌చ్చు.
 • 5 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు ఇది వ‌ర్తించ‌దు.
 • ఒక‌సారి ప్రీమియం చెల్లించిన త‌ర్వాత ర‌ద్దు చేసేందుకు వీలుండ‌దు. అదేవిధంగా అన్ని సంద‌ర్భాల్లో రీఫండ్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.

ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణ బీమా ప్ర‌యోజ‌నాలు
ప్ర‌యాణికుడు మ‌ర‌ణిస్తే, తీవ్ర ప్ర‌మాదం జ‌రిగితే, శాశ్వ‌త వైక‌ల్యం లేదా గాయాల‌తో ఆసుప‌త్రిలో చేరితే క‌వ‌రేజీ ల‌భిస్తుంది. దేనికి ఎంత బీమా హామీ ల‌భిస్తుందంటూ

 • వ్య‌క్తి మ‌ర‌ణిస్తే రూ.10,00,000
 • పూర్తి వైక‌ల్యానికి రూ.10,00,000
 • శాశ్వ‌త పాక్షిక వైక‌ల్యానికి రూ.7,50,000
 • గాయ‌పడితే చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చుకు రూ.2,00,000
 • మృత అవ‌శేషాల రవాణాకు రూ.10,000

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ?
హామీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవ‌డం చాలా సుల‌భం. నామినీ లేదా వార‌సుడు ప్ర‌మాదం జ‌రిగిన నాలు నెల‌ల్లోపు బీమా సంస్థ‌కు వివ‌రాలు అందించి హామీ పొంద‌వ‌చ్చు. క్లెయిమ్‌కు సంబంధించి స‌రైన ఆధారాల‌ను వారు చూప‌వ‌ల‌సి ఉంటుంది. థ‌ర్డ్ పార్టీ బీమా కాబ‌ట్టి సంస్థ‌ల వెబ్‌పైట్‌లో దాఖ‌లు చేయాలి. ఇండియ‌న్ రైల్వేలో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు ప్రీమియం త‌క్కువ‌గా, హామీ ఎక్కువ‌గా ఉండే ఈ బీమా ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు.

ఓలా ట్రావెల్ ఇన్సూరెన్స్‌
ఓలా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సంస్థ రైడ‌ర్ల‌కు అందిస్తుంది. దీనిని క‌స్ట‌మ‌ర్ ట్రిప్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. అకో జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ భాగ‌స్వామ్యంతో ఓలా వినియోగ‌దారుల‌కు బీమా స‌దుపాయం అందిస్తుంది. ఇంట్రాసిటీ, రెంట‌ల్ అదేవిధంగా అవుట్‌స్టేష‌న్ రైడ్ల‌కు కూడా ఈ సౌక‌ర్యం ఉంది. ఓలా సేవ‌లు అందిస్తున్న 110 న‌గ‌రాల్లో ఈ బీమా స‌దుపాయం అందుబాటులో ఉంది. ఒలా రైడ్ ఇన్సూరెన్స్ పొందేందుకు…

మొబైల్‌లో ఉన్న ఓలా యాప్ ఓపెన్ చేసిన త‌ర్వాత Ola app > My Profile > Ride Settings > Ride Insurance ఉంటుంది. రైడ్ ఇన్సూరెన్స్‌లో చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఎంచుకోవాల‌నుకుంటే బీమా స్విచ్ ఆన్ చేయాలి. బీమా క‌వ‌రేజ్ వివ‌రాల‌ను మెను నుంచి ఎంచుకోవ‌చ్చు. రైడ్‌కు ఒక్క రూపాయి ప్రీమియం ఉంటుంది. రెంట‌ల్, అవుట్‌స్టేష‌న్ రైడ్ల‌కు రూ.15, రూ.49 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఓలా ఇన్సూరెన్స్ ముఖ్య‌మైన అంశాలు

 • ఓలా రైడ‌ర్ల‌కు ఇది ఆప్ష‌న‌ల్ ఇన్సూరెన్స్ పాల‌సీ
 • ఇది థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాబ‌ట్టి నేరుగా ఓలా హామీని అందించ‌దు.
 • విమానం మిస్ అయిన‌, వైద్య చికిత్స‌ల‌కు, వ‌స్తువులు పోతే క‌వ‌రేజ్ ల‌భిస్తుంది.
 • ఇది వ్య‌క్తిగ‌త ప్ర‌మాదాలు, హాస్పిట‌ల్ ఖ‌ర్చులు వంటి వాటికి కూడా క‌వ‌రేజ్ ఇస్తుంది.
  ఓలా రైడ్ ఇన్సూరెన్స్ ప్ర‌యోజ‌నాలు
 • డైలీ రైడ్స్‌కు వ్యక్తిగ‌త ప్ర‌మాద బీమా హామీ రూ.5 లక్ష‌లు
 • హాస్పిట‌ల్ ఖ‌ర్చులు ల‌క్ష రూపాయ‌లు
 • విమానం మిస్ అయితే రూ.5000
 • వైద్య ప‌రిక‌రాల‌కు రూ.10,000
 • రెంట‌ల్‌, అవుట్‌స్టేష‌న్ రైడ్ల‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా హామీ కింద రూ.7.5 ల‌క్ష‌లు, ఆసుప‌త్రి ఖ‌ర్చులు రూ.2 ల‌క్ష‌లు ఉంటాయి. అవుట్‌స్టేష‌న్ ప్ర‌యాణాల‌కు మ‌రింత ఎక్కువ‌గా హామీని అందిస్తుంది.

క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?
క్లెయిమ్ చేసుకోవ‌డం చాలా సుల‌భం. నేరుగా ఓలా యాప్ ద్వారా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. యువ‌ర్ రైడ్స్ లోకి వెళ్లి ఏ రైడ్ మీద‌ క్లెయిమ్ చేసుకోవాల‌నుకుంటున్నారో అక్క‌డ చేసుకోవ‌చ్చు. కింద మీకు స‌పోర్ట్ బ‌ట‌న్ క‌నిపిస్తుంది. అది క్లిక్ చేస్తే “Claim Insurance for this ride” అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఓలా రైడ్స్‌కు వెళ్తున్న‌ప్పుడు ఆప్ష‌న‌ల్ బీమాను ఎంచుకోవ‌డం మంచిది. ఎందుకంటే ఇందులో ప్రీమియం త‌క్కువ‌గా, హామీ ఎక్కువ‌గా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly