వీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?

ఈపీఎఫ్ డిపాజిట్ల‌పై చెల్లించే వ‌డ్డీ రేటునే, స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) డిపాజిట్ల‌కూ చెల్లిస్తారు.

వీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?

ఉద్యోగం చేసే ప్ర‌తి ఒక్క‌రికీ ఉండే దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌లో ఒక‌టి త‌మ ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితానికి కావ‌ల‌సిన నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం. ఇందుకోసం ఉద్యోగులు తాము సంపాద‌న ప్రారంభించిన తొలి రోజుల నుంచే కొద్ది కొద్దిగా న‌గ‌దును పొదుపు చేసి, పోస్టాఫీసులు పొదుపు ప‌థ‌కాలు, యులిప్స్‌, ఈక్వీటీలు, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈపీఎప్‌, పీపీఎఫ్ వంటి ప్రభుత్వ విర‌మ‌ణ ప‌థ‌కాల వంటి ప‌లు మార్గాల‌ను ఎంచుకుని పెట్టుబ‌డులు పెడుతుంటారు.
ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందించే ప‌థ‌కాల‌లో ఒక‌టైన ఉద్యోగ‌ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ చెల్లించాలని ప్రతిపాదించినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్ ఇటీవ‌లే వెల్లడించారు. ప్రస్తుతం 8.55 శాతం వడ్డీ రేటు ఉన్న వ‌డ్డీరేటును 8.65 పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెల‌పాల్సి ఉంది. ప్ర‌భుత్వం ఈపీఎఫ్‌కు చెల్లించిన వ‌డ్డీనే, వీపీఎఫ్‌(వాలెంట‌రీ ప్రావిడెండ్ ఫండ్‌)కు చెల్లిస్తుంది. అంటే ఈపీఎఫ్ఓ వ‌డ్డీ రేట్లు పెరిగితే వీపీఎఫ్ చందాదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ఈ నేప‌థ్యంలో రిస్క్ శాతం త‌క్కువ‌గా వుండి, ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌తో పాటు, ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌ల‌ను అందించే వీపీఎఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వీపీఎఫ్‌లో పెట్టుబ‌డి ప్ర‌యోజ‌నాలు:

 • వీపీఎఫ్ చందాదారులు త‌మ వేత‌నం నుంచి క‌నీసం 12శాతం మొత్తాన్ని వీపీఎఫ్‌కు చెల్లించ‌వచ్చు. గ‌రిష్టంగా 100 శాతం(బేసిక్ శాల‌రీ+డీఏ అల‌వెన్స్‌) శాల‌రీని కాంట్రీబ్యూట్ చేయ‌వ‌చ్చు.
 • ఈపీఎఫ్ చందాదారుల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటును వీపీఎఫ్ చందాదారుల‌కు చెల్లిస్తారు.
 • 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్‌-పిరియ‌డ్ త‌రువాత విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.
 • పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
 • కాంట్రీబ్యూష‌న్‌, పెట్టుబ‌డులు, వ‌డ్డీ, రాబ‌డులు, ఉప‌సంహ‌ర‌ణ‌లు ఇలా ఏ స‌మ‌యంలోనైనా ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.
 • వివాహం, గృహ కొనుగోలు, పిల్ల‌ల విద్య వంటి వాటికి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.
 • వీపీఎఫ్ కాంట్రీబ్యూట్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రికాదు. ఉద్యోగులు త‌మ ఇష్టానుసారం వీపీఎఫ్‌కు చందాదారులుగా చేర‌వ‌చ్చు. అయితే ఒక సారి చేరిన త‌రువాత ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం త‌మ‌ చందాల‌ను కొన‌సాగించాల్సి ఉంటుంది.

నియ‌మ, నిబంధ‌న‌లు:

 • సంవత్సరం మధ్యభాగంలో వీపీఎప్‌ పథకం నుంచి న‌గ‌దు ఉపసంహణ‌ లేదా వైదొల‌గం వంటివి అనుమ‌తించ‌రు.
 • ఈపీఎఫ్ చందాదారులైన ఉద్యోగ‌స్తుల‌కు మాత్ర‌మే ఇందులో చేరేందుకు అవ‌కాశం ఉంటుంది.
 • ఉద్యోగి త‌న 100 శాతం ప్రాథ‌మిక వేత‌నం పాటు డీఏను కూడా చందాగా చెల్లించ‌వ‌చ్చు.
 • వీపీఎఫ్ మొత్తాన్ని 5 సంవ‌త్స‌రాల‌లోపు విత్‌డ్రా చేయాలంటే , మీరు వీపీఎఫ్‌కు చెల్లించిన చందాల‌పై వ‌చ్చిన వ‌డ్డీకి ప‌న్నుచెల్లించాల్సి ఉంటుంది.

ఈక్వీటీ వాటాను త‌గ్గించుకుని డెట్ వాటాను పెంచుకోవాల‌నుకునే అధిక వ‌య‌సు గ‌ల వారికి వీపీఎఫ్ మంచి ఎంపిక‌. ఇటువంటి వారు ఈక్వీటీ పెట్టుబ‌డుల‌ను త‌గ్గించుకుని అదే మొత్తాన్ని వీపీఎఫ్‌కు చెల్లించ‌డం ద్వారా రిస్క్‌ను త‌గ్గించుకోవ‌డం మాత్ర‌మే కాకుండా మంచి రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly