భార‌త్‌-22 ఈటీఎఫ్‌ అద‌న‌పు ఇష్యూతో రూ.10 వేల కోట్లు

భార‌త్-22 ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.22,900 కోట్లను స‌మీక‌రించింది.

భార‌త్‌-22 ఈటీఎఫ్‌ అద‌న‌పు ఇష్యూతో రూ.10 వేల కోట్లు

భారత్‌-22 ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) అదనపు ఇష్యూ ఫిబ్ర‌వ‌రి 14 న ముగిసింది. ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంచిన‌ ఈ ఇష్యూలో టైల్‌ విభాగం సహా అన్ని కేటగిరీల్లో అధిక స్పందన వచ్చింది. రూ.3,500 కోట్ల కనీస సమీకరణతో గురువారం ఈ ఇష్యూను అందుబాటులో ఉంచగా, సాయంత్రం 7 గంటల వరకు పది రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగం సహా అన్ని కేటగిరీల్లో అధిక స్పందన వచ్చిందని, దీంతో రూ.10,000 కోట్ల మేర నిధులను పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధించేందుకు ఉప‌యోగించాల‌ని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే భారత్‌–22 ఈటీఎఫ్‌ తాజా ఇష్యూ నిర్వహించడం జరిగింది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనార్టీ వాటాలను విక్రయించడం ద్వారా సుమారు రూ.46,000 కోట్ల నిధులను సమీకరించింది. భార‌త్-22 ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.22,900 కోట్లను రాబట్టుకుంది. 2017 నవంబర్లో రూ.14,500 కోట్లు, 2018 జూన్‌లో రూ.8,400 కోట్ల సమీకరణ చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌లను జారీ చేయడం ఇది రెండోసారి. గతేడాది నవంబ‌ర్‌లో ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.17,300 కోట్లు స‌మీక‌రించింది. అయితే దేశంలో ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఆఫ‌ర్ చేసిన ఈటీఎఫ్‌ల కంటే పెద్ద‌ది. ఈ భారత్-22 ఈటీఎఫ్‌లలో ఓఎన్‌జీసీ, ఐవోసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్‌ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్‌ఎల్‌సీ ఇండియాలతోపాటు ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు , ఇతర కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly