మ్యూచువ‌ల్ ఫండ్‌ పెట్టుబ‌డుల్లో సాధార‌ణ పొర‌పాట్లు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుప‌రులు సాధార‌ణంగా చేసే పొర‌పాట్లు, వాటిని ప‌రిష్క‌రించే ఉపాయాల‌ను తెలుసుకుందాం.

మ్యూచువ‌ల్ ఫండ్‌ పెట్టుబ‌డుల్లో సాధార‌ణ పొర‌పాట్లు

మొదటిసారి తన కార్యాలయానికి వచ్చిన మ‌దుప‌ర్లు చేస్తుండే పెట్టుబ‌డి త‌ప్పిదాల గురించి గుర్గావ్ కు చెందిన మ్యూచువల్ ఫండ్ పంపిణీదారుడు ఆషీష్ చదా విశ్లేషించ‌నున్నారు.

స‌మ‌యంతో పాటుగా

మార్కెట్లు గ‌రిష్ఠ‌స్థాయిని తాకిన‌ ప్ర‌తీసారి కొన్నిర‌కాల‌ మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల‌ అమ్మ‌కాలు జోరందుకుంటాయి. 2008లో ప‌రిస్థితి మౌలికరంగ, మిడ్ క్యాప్ ఫండ్ల‌కు మంచి డిమాండు ఉండేది. కొత్త కొత్త ఫండ్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. త‌ర్వాత వ‌చ్చిన‌ మాంద్యం దెబ్బ‌కు కంపెనీలు కుదేలైపోయాయి. ఫ‌లితంగా వాటిలో మ‌దుపుచేసిన ఫండ్లు కూడా న‌ష్ట‌పోయాయని చదా పేర్కొన్నారు. మ్యూచువ‌ల్ ఫండ్లు యూనిట్ల‌ను ఆయ‌న విక్ర‌యించక పోయిన‌ప్ప‌టికీ తాను ప‌నిచేస్తున్న బ్యాంకు విక్ర‌యించింద‌ని ఆయ‌న అన్నారు.

స్థిరాదాయ ప‌థ‌కాల‌ ప‌ట్ల‌ నిర్ల‌క్ష్యం

మ‌దుప‌ర్లు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎక్కువ‌ ఆస‌క్తి క‌న‌బ‌రిచి స్థిరాదాయ ప‌థ‌కాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. ఈక్విటీ ఫండ్లు 20 శాతం వ‌ర‌కూ రాబ‌డినిస్తుంటే స్థిరాదాయ ప‌థ‌కాల‌కు చెందిన ఫండ్ల‌లో మ‌దుపుపై 7-8 శాతం రాబ‌డి వ‌స్తుంది. మ‌దుప‌ర్లు స్థిరాదాయ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డిని తీసేస్తున్నారు. దీంట్లో డిస్ట్రిబ్యూట‌ర్ల వంతు కూడా ఉంద‌ని ఆయ‌న అన్నారు. వారి వినియోగ‌దార్ల‌ను వ‌దులుకోవ‌డం ఇష్టంలేక వారు చెప్పేవిధంగా మ‌దుపు చేస్తుంటారు. చదా స‌ల‌హా ప్ర‌కారం స్టాక్ మార్కెట్లు గ‌రిష్ఠ స్థాయిని చేరిన‌పుడు ఈక్విటీలో కొంత భాగాన్ని విక్ర‌యించి స్థిరాదాయ ప‌థ‌కాల్లోకి మ‌ళ్లించ‌డం మంచిది. దీని మూలంగా త‌క్కువ రాబ‌డి వ‌చ్చినా స‌రే భ‌ద్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది.

వెబ్ సైట్లలో స‌ల‌హాలు

మార్కెట్లు తారాస్థాయికి చేరిన‌పుడు మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను మ‌రిచి స్థిరాదాయం క‌లిగించే పెట్టుబ‌డుల్లో మ‌దుపు చేయ‌డం ఆపేస్తారు. ఇంట‌ర్నెట్ లో వ‌చ్చే టిప్‌ల‌ను ఆధారంగా వారు షేర్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల షేర్ల‌ను అడుగుతుంటారు’’. అని చదా అన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly