అప్పు ఎప్ప‌టికైనా ముప్పేనా?

రుణం తీసుకోవ‌డం అనేది స‌హ‌జం. కానీ దానిని ఎలా నిర్వ‌హిస్తున్నామ‌న్న‌దే ముఖ్యం

అప్పు ఎప్ప‌టికైనా ముప్పేనా?

ఒక‌ వ్య‌క్తి, సంస్థ లేదా దేశం త‌మ వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక అవ‌స‌రాల కోసం రుణం తీసుకోవ‌డం అనేది స‌ర్వ‌సాధార‌ణం. తీసుకున్న రుణాన్ని గ‌డువులోగా వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తారు. బ్యాంకులు క్రెడిట్ కార్డులు, వ్య‌క్తిగ‌త రుణాలు వంటి వివిధ ర‌కాలుగా రుణాల‌ను ఇచ్చేందుకు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తుంటాయి. అయితే మ‌న సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి అప్పుతీసుకోవ‌డం అనేది అవ‌స‌రం.

అప్పు తీసుకోవ‌డం నేర‌మా, తీసుకుంటే ఏమ‌వుతుంది? అనేది చాల మందికి ఉన్న ప్రశ్న. మ‌న దేశంలో రుణం పొందేందుకు చాలా మార్గాలున్నాయి. కానీ దానిని ఎలా తీర్చాల‌న్నది మ‌నకి తెలుసుండాలి. లేక‌పోతే అసలుకే ముప్పు రావ‌చ్చు. మ‌న జీవిన విధానాన్నే దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. ఉద్యోగం చేసేవాళ్లు ఎక్కువ‌గా క్రెడిట్ కార్డులు, వ్య‌క్తిగ‌త రుణాల రూపంలో అప్పు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్పులు ఇచ్చే విధానాన్ని మార్పు చేస్తూ ఎక్కువ రేట్ల‌ను వ‌డ్డిస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతున్నాయి.

క్రెడిట్ కార్డులు, వ్య‌క్తిగ‌త రుణాలు

 • మీ క్రెడిట్ స్కోరు బాగుంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అప్పులిస్తామ‌ని వెంట‌ప‌డ‌తాయి. ఇక్క‌డే కొంచెం ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. అప్పు చేసే అవ‌సరం ఏమైనా ఉందా, చేస్తే చెల్లించేంత స్తోమ‌త ఉందా అన్నది ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.
 • వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేట్లు 11 శాతం నుంచి 16 శాతం వ‌ర‌కు ఉంటాయి. కొన్ని సార్లు ఇవి 20-30 శాతం వ‌ర‌కు కూడా ఉండే అవ‌కాశం ఉంది. క్రెడిఇట్ స్కోర్‌, ఆదాయాన్ని బ‌ట్టే బ్యాంకులు రుణాల‌ను అంద‌జేస్తాయి. వ్య‌క్తిగ‌త రుణాలు చెల్లించేందుకు కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు,7 సంవ‌త్స‌రాలు; ఒక్కోసారి ఎక్కువ‌గా కూడా ఉండొచ్చు.
 • క్రెడిట్ స్కోరు బాగుంటే ఒకేసారి వివిధ ర‌కాల రుణాలు కూడా పొందే అవ‌కాశం ఉంటుంది. మీ ఆదాయాన్ని బ‌ట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు లోన్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తాయి, అందులో మీరు ఏం పొందాల‌నుకుంటున్నారో స్ప‌ష్ట‌త క‌లిగి ఉండ‌టం మంచిది. ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా, ఆదాయం వ‌చ్చే మార్గాలు మూసుకుపోయినా వ‌డ్డీలు భారం అవుతాయి. అటువంటి సమ‌యంలో అప్పు కాస్కా ముప్పుగా మారుతుంది.
 • అలా కాకుండా మీ ఆదాయం ఎక్కువ‌గా ఉండి, రెండు మూడు ర‌కాలుగా మీరు ఆదాయం పొందుతున్న‌ట్ల‌యితే రుణం పెద్ద భారం కాదు. అది కూడా మీ ఆదాయంలో నుంచి నెల‌కు 30 శాతం కంటే త‌క్కువ‌గా చెల్లించే విధంగా ఉండాలి. అప్పుడు ఎలాంటి దిగులు ఉండ‌దు.
 • అయితే అప్పు తీసుకొని ఆదాయం సరిగ్గా లేని ప‌ని చేయ‌డం, ముఖ్యంగా కార్లు వంటివి కొనుగోలు చేయ‌డం ద్వారా ఎలాంటి ప్ర‌యోజనం ఉండ‌దు. అయితే రుణం తీసుకొని బీమా చేయ‌డం లేదా పెట్టుబ‌డులు పెట్ట‌డం లాంటివి పెద్ద రుణాల‌కు దారి తీసే అవ‌కాశం లేదు. పెట్టుబ‌డుల మూలాన రుణాలు పెరిగే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఇక్క‌డ‌ రాబ‌డి పెరుగుతుంది. రుణం పెర‌గ‌దు.
 • క్రెడిట్ కార్డులు కూడా వ్య‌క్తిగత రుణాల వంటివే. వీటికి వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. కొన్ని క్రెడిట్‌ కార్డుల వ‌డ్డీ రేట్లు 30-40 శాతం వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. ఎక్కువ క్రెడిట కార్డు రుణాల వ‌డ్డీలు చెల్లిస్తూ పోతే అప్పులు పేరుకుపోయే అవ‌కాశం ఉంది.
 • మీరు చేయ‌వ‌ల్సింది ఏంటంటే మీ ఆదాయాన్ని బ‌ట్టి అప్పు చేయండి. మీరు నెల‌కు చెల్లించే అప్పులు మీ ఆదాయంలో 30 శాతంగా ఉండేలా ప‌రిమితి ఉంచుకోండి. అంత‌గా అవ‌సరం అయితే గరిష్టంగా 40 శాతం. అంత‌కు మించి ఉంటే త‌ర్వాత చెల్లించ‌లేక రుణ‌భారం పెర‌గుతుంది

అప్పు తీసుకోవ‌డం మంచిదా? కాదా?

 • క్రెడిట్ కార్డుల‌తో వ్య‌క్తుల‌కు ఆర్థిక స్వేచ్చ‌, వినియోగం పెరుగుతుంది. జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 • వ్య‌క్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు రుణాలు నెమ్మ‌దిగా పెరుగుతుండటంతో దేశంలో బ్యాంకుల ఆర్థిక వృద్ధి కూడా స్థిరంగా పెరుగుతుంది.

 • అయితే ఎన్‌పీఏలు పెరుగుతున్న తీరు చూస్తుంటే బ్యాంకుల‌కు రుణ భారం పెరుగుతుంద‌న్న విష‌యం అవ‌గ‌త‌మవుతోంది.

  మొత్తానికి రుణం చేయ‌డం త‌ప్పు కాదు, కాని అధికంగా చేసి అబాసుపాలుకావ‌డం త‌గ‌దు. నిర్వ‌హ‌ణ చేసుకునేంత సామ‌ర్థ్యం క‌లిగి ఉంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితం గ‌డిపేయొచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly