బ‌డ్జెట్ 2019-20: రైతులకు ఏటా రూ.6,000

2 హెక్టార్ల‌ లోపు రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది

బ‌డ్జెట్ 2019-20: రైతులకు ఏటా రూ.6,000

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం వరాలు కురిపించింది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 2 హెక్టార్లు(5ఎక‌రాల) లోపు రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.

ఈ కొత్త ప‌థ‌కం 2018 డిసెంబర్‌ నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ.2 వేల‌ రూపాయిల‌ను మార్చి, 2019కి ముందు రైతుల ఖాతాల‌లో ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి రాధా మోహ‌న్ సింగ్ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ.6 వేల‌ను మూడు వాయిదాల‌లో ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పథకంతో 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. దీంతో 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 75వేల కోట్లు, 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ.20 వేల కోట్లు అదనపు భారం పడనుందని పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly