బ‌డ్జెట్ 2019 విశేషాలు

లోక్‌సభలో ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టారు

బ‌డ్జెట్ 2019 విశేషాలు

ఎన్నో ఆశలతో దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ మరి కాసేపట్లో వెల్లడికానుంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ తొలిసారిగా నేడు బడ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టారు. తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి బడ్జెట్‌ పత్రాల కాపీని అందజేశారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు.

లోక్‌సభలో ఉదయం 11 గంటలకు సీతారామన్‌ బడ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టారు. మోదీ 2.0 ప్రభుత్వంలో ఇదే తొలి బడ్జెట్‌. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా… ఈ సారి కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను మహిళకు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మలా సీతారామన్‌ కావడం విశేషం.

నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగం…

 • సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేయూతకు ఎలక్ట్రానిక్‌ విధానంలో నిధుల సేకరణ. ఇందుకోసం ప్రత్యేక వేదిక.
 • దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
 • వ్యాపారులు వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు చట్టపరమైన వివాద పరిష్కార విధానం
 • 2020 ఆర్థిక సంవ‌త్స‌రానికి ద్ర‌వ్యోలోటు ల‌క్ష్యం 3.3 శాతం
 • బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు. డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపు.
 • 2 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు
 • న‌గ‌దు రూపంలో వ్యాపార లావాదేవీల‌ను నివారించేందుకు, బ్యాంకు ఖాతా ద్వారా ఒక ఏడాదిలో రూ. 1కోటి న‌గ‌దు డ్రా చేసే వారికి 2 శాతం టీడీఎస్ విధింపు
 • విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5 శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం ఆ అంశం జీఎస్టీ మండలి పరిశీలిస్తోంది.
 • ప‌న్ను విధానంలో ఏలాంటి మార్పు లేదు. పాత ప‌న్ను విధాన‌మే అమ‌లు అవుతుంది.
 • బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి. రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్‌. పాన్‌ నంబర్‌ లేకపోయినా ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు అవకాశం. పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు వెసులుబాటు
 • అందుబాటు ధర‌లో నిర్మించుకున్న‌ గృహ రుణ చెల్లింపుదారుల‌కు మార్చి 2020 వ‌ర‌కు అద‌నంగా రూ.1.5 ల‌క్ష‌ల ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు
 • రూ. 45 ల‌క్ష‌ల వ‌ర‌కు గృహ రుణం తీసుకున్న వారికి రూ. 3.5 ల‌క్ష‌ల వ‌డ్డీ రాయితీ
 • పాన్ కార్డు లేని ప‌న్ను చెల్లింపుదారులు ఆధార్ నెంబ‌రుతో కూడా రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించేందుకు వీలు క‌ల్పిస్తున్నాం
 • గ‌త ఐదు సంవ‌త్స‌రాల‌లో 78 శాతం ప్ర‌త్య‌క్ష ప‌న్నులు ఆదాయం పెరిగింది. ప్ర‌త్య‌క్ష ప‌న్నుల ద్వారా 11.37 ల‌క్ష‌ల కోట్ల‌ ఆదాయం
 • ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు కొనుగోలు చేసిన వారికి అద‌నంగా రూ.1.5 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు
 • రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
 • రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం! అంధులు కూడా గుర్తించే విధంగా ఇవి ఉంటాయి.
 • రూ. 400 కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీల‌కు 25 శాతం కార్పొరేట్ ప‌న్ను
 • ఎంపిక చేసిన కేంద్ర ప్ర‌భుత్వ‌ సంస్థ‌ల్లో (సీపీఎస్ఈ) రంగాల పరిమితికి ఆధారంగా విదేశీ పెట్టుబ‌డుల వాటా పెంపు
 • భారతదేశంలో పర్యాటకుల రాకను ప్రోత్సహించేందుకు 17 ఐకానిక్ న‌గ‌రాల ఏర్పాటు
 • ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో వ్యూహాత్మ‌కంగా పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణకు ప్రాధాన్యత . ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.1.05 ల‌క్ష‌ల కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ ప్ర‌భుత్వ ల‌క్ష్యం
 • జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం
 • బ్యాంకింగ్ రంగంలో ప్ర‌క్షాళ‌న‌ వేగంగా జ‌రుగుతున్నాయి. ఒక్క ఏడాదిలో రూ. 4 ల‌క్ష‌ల కోట్ల మొండి బ‌కాయిలు వ‌సూలు
 • భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
 • ప్రైవేట్ రంగ బ్యాంకుల‌కు రూ. 70 వేల కోట్ల మూల‌ధ‌న ఆర్థిక సాయం అందించాలని ప్ర‌తిపాదించారు.
 • ఈ ఏడాది భారీ రైల్వే ఆధునీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం
 • మత్స్య రంగంలో కీలకమైన మౌలిక సదుపాయాల అంతరాన్ని పరిష్కరించడానికి 'ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన’ను ప్రభుత్వం ప్రతిపాదించింది
 • మురుగు, వ్య‌ర్థాల తొల‌గింపు యంత్రాల కోసం ఆర్థిక సాయం
 • స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌లో ఉన్న మ‌హిళ‌ల‌కు రూ. 5 వేల ఓవ‌ర్‌డ్రాఫ్ట్ స‌దుపాయం
 • ఒక్కో మ‌హిళ‌కు ముద్రా స్కీమ్ ద్వారా రూ. 1 ల‌క్ష రుణ స‌దుపాయం
 • ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మాన్‌ ధన్ యోజన కింద‌ దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఈ పథకంలో చేరారు.
 • కేంద్ర ప్ర‌భుత్వం గ్రామాలు, రైతులు, పేదల‌పై ఎక్కువ‌గా దృష్టి సారిస్తుంది. గ్రామీణ పెట్టుబ‌డుల‌ను పెంచేందుకు, వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించేందుకు కృషిచేస్తున్నాం
 • ఉజ్వ‌ల యోజ‌న కింద 35 వేల కోట్ల ఎల్ఈడీ బ‌ల్బుల‌ను పంపిణీ చేశాయి. దీని ద్వారా ఏటా రూ.18,341 కోట్లు ఆదా అయ్యింది.
 • స్టార్ట‌ప్‌ల కోసం ఒక టీవీ-ఛాన‌ల్ ఏర్పాటు చేయ‌బోతున్నాం . ఖేలో ఇండియా కార్య‌క్ర‌మాన్ని మ‌రింత‌ విస్త‌రించ‌నున్నాం
 • ఉన్న‌త విద్యాసంస్థ‌ల కోసం ఈ బ‌డ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించాము.
 • జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.
 • ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద 81 ల‌క్ష‌ల గృహాల నిర్మాణం
 • 2024 నాటికి జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ ద్వారా ప్ర‌తీ ఇంటికి తాగునీరు.
 • దేశంలో ఉద్యోగ సృష్టిక‌ర్త‌లే , దేశ సంప‌ద సృష్టిక‌ర్త‌ల‌ని సీతారామ‌న్ అన్నారు
 • జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం.
 • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయ‌డ‌మే ల‌క్ష్యాంగా సాగుతున్నాం
 • 802.5 బిలియన్ల‌ వ్యయంతో వచ్చే 5 సంవత్సరాలలో 125,000 కిలోమీటర్ల ర‌హ‌దారుల‌ ఆధునీకీకరణ.
 • 2022 నాటికి అంద‌రికీ ఇళ్లు అందుబాటులోకి తీసుకొస్తాం. అంద‌రికీ విద్యుత్, పారిశుధ్య‌త ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాం .
 • ఈ ఏడాది మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ
 • ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా 3 కోట్ల మంది రిటైల్ ట్రేడ‌ర్ల‌కు ఫించ‌ను ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టాము.
 • ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తాం.
 • సెబీ, ఆర్‌బీఐ మ‌ధ్య అంత‌ర్గ‌త కార్య‌క‌లాపాలు మెరుగుప‌డ‌నున్నాయి. విమాన‌యానం, మీడియా, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పెట్టుబ‌డుల ప‌రిమితిని పెంచడంపై ప‌రిశీలిన జరుపుతాం.
 • లిస్టెడ్ కంపెనీల‌లో ప‌బ్లిక్ హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాల‌ని సెబీకి ప్ర‌తిపాదించాం
 • ఒకే దేశం ఒకే ప‌వ‌ర్ గ్రిడ్ విధానంలో… అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాం.
 • గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
 • 2030 నాటికి రైల్వేల్లో 50లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నాం
 • ఉజ్వ‌ల్ మెట్రోరైలు సర్వీసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 657కి.మీ. మెట్రో మార్గం ఉంది. మరో 300కి.మీ. మేర అనుమతులు లభించాయి.
 • నిర్మాణాత్మ‌క‌ సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.
 • దేశీయ కంపెనీలు మేకిన్ ఇండియాను స్వాగ‌తించాల్సి ఉంటుంది.
 • ఉడాన్‌ పథకంతో చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం కలిగింది.
 • ఉద్యోగాల కల్పన కోసం మౌలిక రంగంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది.
 • ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ఐదు సంవ‌త్స‌రాల‌లో 2.5లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారత్ మారింది. ఈ ఏడాది భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది
 • సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకొని ప‌నుల‌ను వేగంగా పూర్త‌య్యేలా చేస్తాం. మౌలిక స‌దుపాయాల‌ను పెంచుతాం. డిజిట‌ల్ ఇండియా, కాలుష్య ర‌హిత దేశంగా మార్చ‌డ‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం
 • వ‌చ్చే ఐదేళ్ల‌లో 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్యాన్ని చేరుకునే సామ‌ర్థ్యం ఉంది

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly