బ‌డ్జెట్ ప్ర‌భావంతో పెరిగిన పెట్రో ధ‌ర‌లు

శుక్ర‌వారం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ధ‌ర‌లు పెరిగాయి.

బ‌డ్జెట్ ప్ర‌భావంతో పెరిగిన పెట్రో ధ‌ర‌లు

కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన త‌ర్వాత రోజే పెట్రో ధరలు ఒక్క‌సారిగా పెరిగాయి. ఒకేరోజు 2 రూపాయ‌ల పైన పెరిగాయి. ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంతో దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుపై రూ.2.45 పెరిగి రూ.72.96కు చేరింది. డీజిల్‌పై రూ.2.36 పెరిగి రూ.66.69కి చేరింది. హైద‌రాబాద్‌లో నిన్న రూ.74.88 గా ఉన్న‌ పెట్రోల్ ధ‌ర‌, నేడు రూ.77.48 గా న‌మోదైంది. డీజిల్ ధ‌ర రూ.70.06 నుంచి ఒక్క‌రోజులో రూ.72.62 కి పెరిగింది.

నిన్నటి కేంద్ర బడ్జెట్‌లో పెట్రోలు, డీజిలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.1 చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు-మౌలిక వసతుల సెస్సునూ లీటరుకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.28 వేల కోట్లకుపైగా నిధులు సమకూరనున్నాయి. మూల ధరకు ఎక్సైజ్‌ సుంకం కలిపిన తర్వాత స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్‌ను విధించారు. వాటి పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో పెట్రోలు ధర లీటరుకు రూ.2.5కిపైగా, డీజిలు ధర లీటరుకు రూ.2.3కిపైగా పెరిగింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly