గృహ రుణ చెల్లింపుల ప్ర‌ణాళిక ఎలా?

గృహ రుణం కోసం నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఈక్విటీ పెట్టుబ‌డుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

గృహ రుణ చెల్లింపుల ప్ర‌ణాళిక ఎలా?

మీరు గృహ రుణం తీసుకోవాల‌నుకుంటే బ్యాంకులు ఎంత డౌన్ పేమెంట్ అడుగుతాయో ముందుగానే అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. డౌన్ పేమెంట్ మొత్తాన్ని పొదుపు చేసుకోవాల‌నుకుంటే ముందు ప్రాప‌ర్టీ విలువ, కాల‌ప‌రిమితిని నిర్ణ‌యించుకోవాలి. ఒక 15 సంవ‌త్స‌రాలు అనుకుంటే దానికి త‌గిన‌ట్లుగా ప్ర‌ణాళిక వేసుకోవాలి. ప్ర‌స్తుతం మార్కెట్లో ప్రాప‌ర్టీకి ఎంత ధ‌ర ఉందో తెలుసుకోండి. అయితే ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా 15 సంవ‌త్స‌రాల్లో ప్రాప‌ర్టీ ధ‌ర‌ మ‌రింత పెర‌గొచ్చు. 5 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం అంచానా వేస్తే ఇప్పుడు రూ. 40 ల‌క్ష‌లు ఉన్న ప్రాప‌ర్టీ ధ‌ర‌ 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ. 83 ల‌క్ష‌లు అవుతుంది. ప్రాప‌ర్టీలో 15 శాతం డౌన్‌పేమెంట్ చేయాల‌నుకుంటే 15 సంవ‌త్స‌రాల‌లో రూ.12.5 ల‌క్ష‌లు నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

ప్ర‌తి నెల దానికోసం పొదుపు చేయండి
రూ.12.5 ల‌క్ష‌లు ఎలా స‌మ‌కూర్చుకోవాలో ముందుగా ప్ర‌ణాళిక వేసుకోవాలి. నెల‌కు కొంత సిప్ ద్వారా పొదుపు చేసుకోవాలి. ఎంత రాబ‌డి వ‌స్తుందో దాన్ని అంచ‌నా వేసి దానికి అనుగుణంగా నెల‌కు కొంత సిప్ పెంచ‌డ‌మో త‌గ్గించ‌డ‌మో చేయాలి. ఉదాహ‌ర‌ణ‌కు, 8 శాతం రాబ‌డి వ‌స్తుంద‌నుకుంటే నెల‌కు రూ.3,600 సిప్ చేస్తే 15 సంవ‌త్స‌రాల్లో రూ.12.5 ల‌క్ష‌లు జ‌మ‌వుతుంది . 12 శాతం రాబ‌డినిచ్చే సాధ‌నాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే నెల‌కు రూ.2,500 పెట్టుబ‌డులు పెడితే స‌రిపోతుంది.

మిశ్ర‌మ పెట్టుబ‌డులు
మీ క‌ల‌ల ఇంటి కోసం డ‌బ్బు పొదుపు చేస్తున్న‌ప్పుడు ఈక్విటీ, డెట్ వంటి మిశ్ర‌మ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాలి. ఇల్లు కొనుగోలు చేయ‌డం అనేది దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం కాబ‌ట్టి ఈక్విటీల‌లో ఎక్కువ పెట్టుబ‌డులు చేయ‌డం మంచింది. స‌రైన పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం తెలియ‌క‌పోతే ఆర్థిక స‌ల‌హాదారుని స‌ల‌హా తీసుకోవ‌చ్చు. డౌన్‌పేమెంట్ మాత్ర‌మే కాకుండా మొత్తం నిధిని స‌మ‌కూర్చ‌డంలో కూడా ఇలాంటి వ్యూహాన్నేఎంచుకోవాలి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly