బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను ఎందుకు త‌గ్గిస్తున్నాయి?

బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డానికి కార‌ణం క్రెడిట్‌-డిపాజిట్‌ రేషియో (సీడీఆర్‌)

బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను ఎందుకు త‌గ్గిస్తున్నాయి?

ఆర్‌బీఐ త‌గ్గించిన వ‌డ్డీ రేట్ల‌తో పాటు బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించేందుకు, త‌గ్గించ‌క‌పోవ‌డానికి క్రెడిట్-డిపాజిట్ రేషియో (సీడీఆర్‌) ముఖ్య కారణం. సెప్టెంబ‌ర్ 2019 లో సీడీఆర్ భారీగా త‌గ్గింది. దీంతో బ్యాంకులు వ‌రుస‌గా వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తున్నాయి. అస‌లు సీడీర్‌కు, బ్యాంకుల వ‌డ్డీ రేట్లకు సంబంధం ఏంటి? తెలుసుకుందాం…

క్రెడిట్ డిపాజిట్ రేషియో (సీడీఆర్‌) అంటే ఏంటి?
క్రెడిట్ డిపాజిట్ నిష్ప‌త్తి (సీడీఆర్) అంటే బ్యాంకు ఇచ్చే మొత్తం రుణాలు, మొత్తం బ్యాంకు డిపాజిట్ల నుంచి తీసివేస్తే వ‌చ్చే దానిని సీడీఆర్ అంటారు. బ్యాంకుకి వ‌చ్చే డిపాజిట్ల‌లో ప్ర‌తి వంద రూపాయ‌ల‌కు రూ.4 ఆర్‌బీఐ వ‌ద్ద‌ న‌గ‌దు నిల్వ‌ల నిష్ప‌త్తిగా, రూ.18.75 ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌లో పెట్టుబ‌డుల‌కు కేటాయిస్తాయి. అంటే వంద రూపాయ‌ల‌లో మిగిలిన రూ.77 బ్యాంక్ డిపాజిట్‌గా ప‌రిగ‌ణిస్తూ వాటిపై రుణాల‌ను జారీచేస్తాయి. 2019 ప్రారంభంలో, బ్యాంకుల సీడీఆర్ 77.6% వద్ద ఉంది. మార్చి నాటికి ఇది 78.2% వద్దకు చేరుకుంది. అంటే బ్యాంకులు డిపాజిట్ల నుంచే కాకుండా ఇత‌ర రుణాలు తీసుకొని మ‌రీ రుణాలు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

సీడీఆర్ ఎక్కువైతే ప్ర‌భావం ఎలా ఉంటుంది?
బ్యాంకులు తమ వద్ద ఉన్న దాదాపు అన్ని డిపాజిట్లను అప్పుగా ఇస్తున్నందున, వారు తమ డిపాజిట్లపై, రుణాల‌పై వడ్డీ రేట్లను తగ్గించే వీలుండ‌దు. అందుకే ఆర్‌బీఐ పాల‌సీ రేట్లు త‌గ్గించిన‌ప్ప‌టికీ బ్యాంకులు వ‌డ్డీ రేట్లు త‌గ్గించే అవ‌కాశం లేకుండా పోతుంది. జ‌న‌వ‌రి నుంచి ఆగ‌స్ట్ వ‌ర‌కు బ్యాంకుల రుణాల‌పై వ‌డ్డీ రేట్లు స‌గ‌టుగా 10.38 శాతం నుంచి 10.45 శాతానికి పెరిగాయి. అదేస‌మ‌యంలో ట‌ర్మ్ డిపాజిట్ రేట్లు 6.91 శాతం నుంచి 6.87 శాతానికి ప‌డిపోయాయి. ఇక ప్ర‌భుత్వ బ్యాంకుల టర్మ్ డిపాజిట్ రేట్లు స్వ‌ల్పంగా 6.78 శాతం నుంచి 6.79 శాతానికి పెరిగాయి. అంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు స‌రైన డిపాజిట్ల‌ను పొంద‌లేక‌పోయాయి.

త‌ర్వాత‌ వ‌చ్చిన మార్పులు?
సెప్టెంబ‌ర్ 27 నాటికి సీడీఆర్ 75.7 శాతానికి త‌గ్గింది. ఈ ఏడాదిలో ఇదే క‌నిష్ఠం. అందువల్ల బ్యాంకులు రుణాలకు నిధులు సమకూర్చడానికి తగినంత డిపాజిట్లు కలిగి ఉంటాయి. ఇప్పుడు డిపాజిట్లు, రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంటుంది.

సీడీఆర్‌ ఎందుకు త‌గ్గుతుంది?
ఈ ఏడాది ప్రారంభంలో బ్యాంకుల ఏడాది రుణ వృద్ధి 14.5 శాతంగా న‌మోదైంది. డిపాజిట్లు 10 శాతం పెరిగాయి. డిపాజిట్లు భారీ స్థాయిలో పెరుగుతుండ‌టంతో రుణ‌ వృద్ధి రేట్ల‌లో మార్పులు క‌నిపిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 27 నాటికి వార్షిక రుణ‌ వృద్ధి 8.8 శాతానికి ప‌డిపోయింది. గ‌త ఏడాదిగా ఇదే త‌క్కువ‌. మ‌రోవైపు సంవ‌త్స‌ర డిపాజిట్ వృద్ధి 9.4 శాతం. అంటే రుణ వృద్ధి డిపాజిట్ వృద్ధి కంటే వేగంగా పడిపోయింది, ఈ ప్రక్రియలో, సీడీఆర్ మెరుగుపడింది.

ఇది త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు దారితీస్తుందా
సాధార‌ణంగా బ్యాంకులు రుణ రేట్ల కంటే ముందుగా డిపాజిట్ రేట్ల‌ను త‌గ్గిస్తాయి. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంది. పెరిగిన సీడీఆర్‌ ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు డిపాజిట్‌ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. అదేస‌మ‌యంలో బ్యాంకులు రుణ రేట్ల‌ను త‌గ్గించ‌క‌పోతే మార్జిన్లు పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది . ఆ స‌మ‌యంలో భారీగా లాభం పొంద‌వ‌చ్చు, మొండిబ‌కాయిలు త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం బ్యాంకులు ఈ విధానాన్ని అనుస‌రిస్తున్నాయ‌ని ఆర్థిక‌వేత్త‌లు చెప్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly