సిబిల్ - రుణ చరిత్ర !!

రుణం పొందాలంటే బ్యాంకులు, సంస్థలు ముందుగా కోరేది రుణ చరిత్ర. సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం తెలుసుకుందాం.

సిబిల్ - రుణ చరిత్ర !!

సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ.  సిబిల్‌ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని  సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్‌ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్‌ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి.

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ స్కోర్‌(సీఐఆర్‌) అంటే:

సీఐఆర్‌ అంటే సిబిల్‌ జారీ చేసే మూడంకెల సంఖ్య. ఇది రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయమవుతుంది. ఇందులో నిర్ణీత కాలానికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన రుణ చెల్లింపుల వివరాలు ఉంటాయి.

క్రెడిట్‌ స్కోర్‌ కోసం సిబిల్‌ వద్ద నమోదు చేసుకునే పద్ధతి:

ఆన్‌లైన్‌ ద్వారా:

  • క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర ఆన్‌లైన్‌లో సిబిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
    పాన్ ఉన్నవారు నిమ్పవలసిన వివరాలు కింది విధంగా ఉంటాయి.
    CIBIL-A.jpg

పాన్ లేనివారు నిమ్పవలసిన వివరాలు కింది విధంగా ఉంటాయి.
CIBIL-B.jpg

  • నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.
  • వివరాలను ఆన్‌లైన్‌ నమోదు ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
  • ధృవీకరణ పూర్తయిన తర్వాత రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్‌లను మెయిల్‌ ఐడీకి పంపిస్తారు.

ఆఫ్‌లైన్‌ ద్వారా:

  • పోస్ట్ ద్వారా సైతం ప‌త్రాల‌ను పంపి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.
  • మొదట వెబ్‌సైట్ నుంచి నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • నమోదు పత్రంలో వివరాలను నింపాలి.
  • నమోదు పత్రానికి, కేవైసీ పత్రాలు, నిర్దేశించిన రుసుము  డీడీని జతపరుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్‌ చేయాలి.
  • సిబిల్‌కి సీఐఆర్‌ కోసం ఆన్‌లైన్‌లో ఒక మెయిల్‌ను పంపించాలి.
    నమోదు పూర్తయిన తర్వాత మీ మెయిల్‌ ఐడీకి సమాచారం వస్తుంది.

ఉచితంగా రునచరిత్ర:

రుణ దరఖాస్తు సమయంలో వివిధ దశలు:

  1. దరఖాస్తు దారుడు దరఖాస్తు ఫారాన్ని నింపి బ్యాంకు, ఆర్థిక సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.
  2. వెంటనే రుణ సంస్థ, సిబిల్‌ను ఆశ్రయించి క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర నివేదికల కోసం ప్రయత్నిస్తుంది.
  3. ఈ దశలో క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే, దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తారు.
  4. అందుకు అవసరమైన పత్రాల కోసం రుణసంస్థలు రుణగ్రహీతను సంప్రదిస్తా

బ్యాంకుల పరిశీలన ఇలా:

cibil.jpg
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు క్రెడిట్‌ స్కోర్‌ ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక వ్యక్తి సమగ్ర రుణ చరిత్రను తెలియజేయడం వరకూ మాత్రమే సిబిల్‌ పరిమితమవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోర్‌తో పాటు వ్యక్తి ఆదాయ వనరులు, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆస్తి−అప్పుల నిష్పత్తి వంటి వాటిని బ్యాంకులు లోతుగా విచారిస్తాయి. తర్వాత మాత్రమే రుణం మంజూరీ గురించి ఆలోచిస్తాయి.

సీఐఆర్‌లో ఉండే సమాచారం:

సీఐఆర్‌లో గృహ, ఆటోమొబైల్‌, వ్యక్తిగత, వాహన రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌లకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఈ సమాచారాన్ని సిబిల్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

1. సిబిల్‌ ట్రాన్స్‌యూనియన్‌ స్కోర్‌:

ఖాతాలు, రుణ విచారణల ఆధారంగా ఈ స్కోర్‌ను నిర్ణయిస్తారు.
credit-score-1.jpg

2. వ్యక్తిగత సమాచారం:

పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు నెంబరు, పాన్‌ సంఖ్య‌, పాస్‌పోర్టు సంఖ్య‌, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలు ఉంటాయి.

3. సంప్రదించాల్సిన చిరునామా(కాంటాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌):

చిరునామాలు, టెలిఫోన్‌ నెంబర్లు ఉంటాయి. 4 వరకూ చిరునామాలను న‌మోదు చేయ‌వ‌చ్చు. ఇల్లు లేదా నివాస స్థలం మారినప్పుడు సిబిల్‌ను సంప్రదించి చిరునామాను అప్‌డేట్‌ చేయించాలి.

4. ఉద్యోగ సమాచారం:

బ్యాంకుల ద్వారా అందిన నెలవారీ లేదా సంవత్సర ఆదాయం వివరాలుంటాయి.

5. అకౌంట్‌ సమాచారం:

ఇక్కడ రుణ చరిత్ర ఉంటుంది. ఇది వరకూ తీసుకున్న అప్పుల వివరాలు అంటే ఎప్పుడు తీసుకున్నారు, చెల్లింపుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారం గత మూడేళ్లకు సంబంధించి ఉంటుంది.

6. రుణ విచారణ సమాచారం:

వ్యక్తులు రుణానికి దరఖాస్తు చేసిన ప్రతిసారీ, రుణ సంస్థ సీఐఆర్‌ సమాచారం కోసం అభ్యర్థిస్తుంది. ఇటువంటి సమాచారాన్ని అంతా సేకరించి ఇక్కడ జతపరుస్తారు.

క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకోండిలా:

  • నెలసరి వాయిదాలను క్రమం తప్పకుండా సమయానికి చెల్లించాలి. ఆలస్యంగా చేసే చెల్లింపులను రుణ సంస్థలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.

  • అవసరం లేకుండా అప్పులు తీసుకోకూడ‌దు. అత్యవసర సమయాల్లోనే రుణాలకోసం ప్రయత్నించాలి.

  • క్రెడిట్‌ కార్డును క్రమ శిక్షణతో ఉపయోగించండి. వాయిదా చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే రుణ చరిత్రపై ఆ ప్రభావం పడుతుంది.

  • ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్‌ కార్డులు కలిగి ఉంటే లేదా కుటుంబ సభ్యులకు అదనపు కార్డును ఇచ్చి ఉంటే వాటికీ సమయానికి చెల్లింపులు జరపడం ఎంతో అవసరం. లేదంటే ఇది క్రెడిట్‌ స్కోర్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

  • హామీగా ఉన్న వ్యక్తుల ఖాతాలను, సంయుక్తంగా నిర్వహించుకునే ఖాతాలను అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ వారు రుణాలను సక్రమంగా చెల్లించకపోతే ఆ ప్రభావం హామీదారుపై ఉంటుంది. అది మీ రుణ మంజూరును సైతం నిర్ణయించగలదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly