మ‌రో రూ.3500 కోట్ల‌కు సీపీఎస్ఈ-ఈటీఎఫ్‌లు

సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్టార్ ఎంట‌ర్‌ప్రైజ‌స్‌ (సీపీఎస్‌ఈ) ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)ల‌ను మార్చి 19 నుంచి జారీ చేయ‌నుంది

మ‌రో రూ.3500 కోట్ల‌కు  సీపీఎస్ఈ-ఈటీఎఫ్‌లు

సీపీఎస్ఈ ఈటీఎఫ్ (ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) నాలుగో విడ‌త‌లో రూ.17 వేల కోట్ల‌ను స‌మీక‌రించింది. దీనికి అద‌నంగా మ‌రో రూ.3500 కోట్ల రూపాయ‌ల‌ను స‌మీక‌రించేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్దం చేసింది. మార్చి 19 నుంచి సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్టార్ ఎంట‌ర్‌ప్రైజ‌స్‌ (సీపీఎస్‌ఈ) ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)ల‌ను జారీ చేయ‌నుంది. ఫాలో ఆన్ ఫండ్ ఆఫ‌ర్లో అందుబాటులో ఉన్న గ్రీన్‌ షూ ఆప్షన్ ద్వారా రూ. 5 వేల కోట్ల వ‌ర‌కు నిధులు స‌మీక‌రించేందుకు వీల‌వుతుంది. ఇప్ప‌టికే ఒక సారి మ‌దుప‌ర్ల ద్వారా నిధులు స‌మీక‌రించి మ‌ళ్లీ నిధులు స‌మీక‌రించేందుకు ఆఫ‌ర్ జారీ చేస్తే దాన్ని ఫాలో ఆన్ ఫండ్ ఆఫ‌ర్ అంటారు. ఈ ఏడాది ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో వాటాల విక్ర‌యం ద్వారా మొత్తం రూ.80 వేల కోట్ల‌ను స‌మీక‌రించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఈ ఆఫ‌ర్ ద్వారా స‌మీక‌రించే నిధులు తోడ్ప‌డ‌తాయ‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం 2018-19కి గానూ లక్ష్యంగా పెట్టుకున్న రూ. 80 కోట్ల నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 28వ తేది నాటికి రూ.56,473.32 కోట్లు ప్ర‌భుత్వం పొందింది.

సీపీఎస్ఈ ఈటీఎఫ్ తొలిసారిగా 2014 లో 10 కంపెనీల‌ షేర్ల‌ను 4 విడ‌త‌లుగా విక్ర‌యించి రూ.28,500 కోట్ల‌ నిధులు స‌మీక‌రించింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్ పోర్టుఫోలియోలో మొత్తం 11 ప్ర‌భుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి. ఇండియ‌న్ ఆయిల్ అండ్ నాచ్యుర‌ల్ గ్యాస్‌ కార్పోరేష‌న్లి, కోల్ ఇండియా, ఇండియ‌న్ ఆయిల్ కంపెనీ, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌, రూర‌ల్ ఎల‌క్రిఫికేష‌న్ కార్పొరేష‌న్‌, భార‌త ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఎన్‌టీపీసీ, ఎస్‌జెవీఎన్‌, ఎన్ఎల్‌సీ, ఎన్‌బీసీసీ ఈటీఎఫ్‌లో భాగంగా ఉన్నాయి, సీపీఎస్ఈలో, ఎన్‌టీపీఎస్ అత్య‌ధికంగా 19.59 శాతం వాటాతో మొద‌టి స్థానంలో ఉండ‌గా ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ 18.98 శాతంలో రెండ‌వ స్థానంలో, 18.92 శాతంలో ఓఎన్‌జీసీ మూడ‌వ స్థానంలోనూ కొన‌సాగుతున్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly