సీపీఎస్ఈ ఈటీఎఫ్ లో మ‌దుపు చేయోచ్చా?

సీపీఎస్ఈ ఈటీఎఫ్ మార్చి 20 నుంచి మ‌దుప‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది

సీపీఎస్ఈ ఈటీఎఫ్ లో మ‌దుపు చేయోచ్చా?

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఈటీఎఫ్ ఎఫ్ఎఫ్ఓ ను మార్చి 20 నుంచి మ‌దుప‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది. ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్ ను రిలయన్స్ నిప్పన్ ఏఎమ్‌సీ నిర్వహిస్తుంది. ఈ ఈటీఎఫ్ లో మ‌దుపు చేసే వారికి “రిఫరెన్స్ మార్కెట్ ప్రైస్” పై 4% డిస్కౌంట్ను అందిస్తున్నారు. రిఫరెన్స్ మార్కెట్ ప్రైస్ అంటే రోజులో న‌మోదైన‌ ప‌రిమాణం వెయిటెడ్ యావ‌రేజ్ ప్రాతిపాదిక‌న ధ‌ర‌ను లెక్క‌వేస్తారు. దీనికి మార్చి20 నుంచి 22 తేదీల‌ను ప‌రిగ‌ణిలోకి తీసుకుంటారు. రిటైల్ మ‌దుప‌ర్ల‌కు ఈ ఆఫ‌ర్ మార్చి 20 నుంచి 22 వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. సీపీఎస్ఈ ఈటీఎఫ్ ను 2014 లో ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు ద‌ఫాల్లో ఆఫ‌ర్ ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుత ఆఫ‌ర్ నాల్గోది. సీపీఎస్ఈ ఈటీఎఫ్ తొలి ఆఫ‌ర్ లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు 5% తగ్గింపు, ఏడాది కంటే ఎక్కువ కాలం కొన‌సాగించిన వారికి బోనస్ అందించారు.తదుపరి మూడు ఆఫర్లలో పెట్టుబడిదారులు వరుసగా 5%, 3.5%, 4.5% తగ్గింపులను ఇచ్చారు. సీపీఎస్ఈ ఈటీఎఫ్ లో 11 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అయితే ఇందులో 4 కంపెనీలు - ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఓఎన్‌జీసీ), ఎన్‌టీపీసీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియా ఆయిల్ లిమిటెడ్ లు 77 శాతం ఉన్నాయి. 2014 లో ఉన్న కంపెనీల‌కు ప్ర‌స్తుతం ఉన్న కంపెనీల‌కు తేడా ఉంది.గెయిల్, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తొలిగించి, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, ఎస్‌జెవీఎన్, ఎన్‌బీసీసీ ఇండియాల‌ను చేర్చారు.

ఫిబ్రవరి 28 నాటికి, డివిడెండ్ ఈల్డు 5.52 శాతం, నిఫ్టీ 50 డివిడెండ్ ఈల్డు 1.25 శాతంగా ఉంది.నిఫ్టీ పీఈ నిష్పత్తి 26.32 తో పోలిస్తే ఈ ఈటీఎఫ్‌ 8.43గా ఉంది. పెట్టుబడిదారులకు 4% డిస్కౌంట్ను కూడా ప్రభుత్వం ఇస్తోందని’ అని రిలయన్స్ నిప్పన్ ఎఎమ్సీ ఫండ్ మేనేజ‌రు విశాల్ జైన్ అన్నారు.

ఈ ఈటీఎఫ్ లో మ‌దుపుచేసే అంశం నిపుణులు వివిధ ర‌కాల అభిప్రాయాల‌ను వ‌క్యం చేస్తున్నారు. కొందరు దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి చేసేందుకు ఈ ఈటీఎఫ్ అంత అనుకూలం కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రు స్థూల ఆర్థిక గ‌ణాంకాల ప‌రంగా చూస్తే రానున్న రోజుల్లో ఈ ఈటీఎఫ్ పెట్టుబ‌డి చేసే రంగాల‌కు సంబంధించి(ఎన‌ర్జీ సెక్టార్) మంచి ప‌రిణామం రానుంద‌ని కాబ‌ట్టి పెట్టుబ‌డి చేయోచ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ఈటీఎఫ్ లో ఉన్న కంపెనీల‌న్నీ ప్ర‌భుత్వ రంగ కంపెనీలే. ఇవి సాధార‌ణంగా లాభార్జ‌న‌కంటే ఎక్కువ‌గా దేశ ఆర్థిక ప‌రిస్థితి, ప్ర‌జ‌ల అవ‌స‌రాలు త‌దిత‌ర అంశాల‌ను ముఖ్యంగా ప‌రిగ‌ణిస్తాయి. రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా వీటి నిర్వ‌హ‌ణ పై ప్ర‌భావం చూపుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు జ‌న‌వ‌రి 2018 లో లాభాల‌ను ఆర్జించే ఓన్‌జీసీ కేంద్ర ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యాన్ని చేర‌కుకునేందుకు హెచ్‌పీసీఎల్ ను కొనుగోలు చేయాల్సి వ‌చ్చింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్ గ‌త రాబ‌డి కూడా అంత ఆక‌ర్ష‌ణీయంగా లేదు. ఈ ఈటీఎఫ్ ఐదేళ్ల రాబ‌డి శాతం 5.88శాతం (మార్చి12 నాటికి) గా ఉంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly