రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

పిండి కొల‌ది రొట్టి అనే సామెత చెబుతుంటారు క‌దా! దాన్ని కాస్త బాండ్ల పెట్టుబ‌డికి అన్వ‌యిస్తే రేటింగ్ కొల‌దీ నాణ్య‌త‌ అనొచ్చేమో. ఈ క‌థ‌నంలో బాండ్ల‌పై రాబ‌డి, రేటింగ్ సంబంధాన్ని కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా తెలుసుకుందాం.

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

సాధార‌ణంగా ప్ర‌భుత్వం జారీ చేసే బాండ్ల‌కు, ప్ర‌భుత్వ పూచిక‌త్తు ఉండే బాండ్ల‌కు అత్యుత్త‌మ రేటింగ్ కేటాయిస్తుంటారు. అయితే ప్ర‌భుత్వ‌రంగానికి చెంద‌ని సంస్థ‌లు కూడా బాండ్ల‌ను జారీ చేస్తుంటాయి. వాటిని కార్పోరేట్ బాండ్లు అంటారు. ఉదాహ‌ర‌ణ టాటా,రిల‌య‌న్స్ మొద‌లైన సంస్థ‌లు జారీ చేసే బాండ్ల‌ను కార్పోరేట్ బాండ్ల‌ని అంటారు. ఇష్యూ చేసే సంస్థ‌ల‌ ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి క్రెడిట్ రేటింగ్ కేటాయింపు ఉంటుంది.

కార్పోరేట్ బాండ్లలో కొంత న‌ష్ట‌భ‌యం ఉంటుంద‌ని చెప్పాలి. కాబ‌ట్టి వాటి వ్యాపార, ఆర్థిక, పెట్ట‌బ‌డి సంబంధిత విష‌యాలు విశ్లేషించి వాటి ఆధారంగా వాటికి రేటింగ్ కేటాయిస్తారు. ఆ రేటింగ్ ఆధారంగా వాటికి వ‌చ్చే రాబ‌డి రేట్లు మారుతుంటాయి. రేటింగ్ ప్ర‌కారం వ‌డ్డీరేట్లు ఏవిధంగా మారుతాయో కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా తెలుసుకుందాం. కింది ఉదాహ‌ర‌ణ‌ల్లో కంపెనీ తాలుకా స్థితిని అంచ‌నావేసి ప్ర‌క‌టించిన రేటింగ్‌లు, కూప‌న్ రేట్లు, ఇష్యూ ప్రారంభం, మెచ్యూరిటీ తేదీలు వివ‌రాలు చూడండి. ఉదాహ‌ర‌ణ 1 - కంపెనీ’A’ చాలా విశ్వ‌స‌నీయ‌త‌ను క‌లిగి ఉంది. ఆ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్ కు రేటింగ్ సంస్థ‌ ‘AAA’ రేటింగ్ ఇచ్చింది. కూప‌న్ రేటు- 8 శాతం (ఏడాదికి). ఇష్యూ ప్రారంభ‌ తేదీ- ఆగ‌స్టు 13,2015. మెచ్యూరిటీ తేదీ - ఆగ‌స్టు13,2020. కాల‌ ప‌రిమితి - 5 ఏళ్లు. కూప‌న్ చెల్లింపు -ఏడాదికో సారి. ఉదాహ‌ర‌ణ 2 - ఒక కంపెనీ ‘B’ విశ్వ‌స‌నీయ‌మైందే కానీ వ్యాపారంలో అనిస్థితి నెల‌కొంది. ఆ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్ కు రేటింగ్ సంస్థ‌ ‘BBB’ రేటింగ్ ఇచ్చింది. కూప‌న్ రేటు - 8.5 శాతం (ఏడాదికి). ఇష్యూ ప్రారంభ‌ తేదీ - ఆగ‌స్టు 13,2015. మెచ్యూరిటీ తేదీ - ఆగ‌స్టు13,2020. కాల‌ ప‌రిమితి - 5 ఏళ్లు. కూప‌న్ చెల్లింపు - ఏడాదికోసారి. ఉదాహ‌ర‌ణ 3 - ఒక కంపెనీ ‘C’ కొంత బ‌ల‌హీన‌మైంది… ఆ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్ కు రేటింగ్ సంస్థ‌ ‘CCC’ రేటింగ్ ఇచ్చింది. కూప‌న్ రేటు - 9 శాతం (ఏడాదికి). ఇష్యూ ప్రారంభ‌ తేదీ - ఆగ‌స్టు 13,2015. మెచ్యూరిటీ తేదీ - ఆగ‌స్టు13,2020. కాల‌ ప‌రిమితి - 5 ఏళ్లు. కూప‌న్ చెల్లింపు - ఏడాదికోసారి. ఉదాహ‌ర‌ణ 4 - ఒక కంపెనీ ‘D’ అన్నివిధాల బ‌ల‌హీన‌మైంది. ఆ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్ కు రేటింగ్ సంస్థ‌ ‘D’ రేటింగ్ ఇచ్చింది. కూప‌న్ రేటు - 10 శాతం (ఏడాదికి). ఇష్యూ ప్రారంభ‌ తేదీ - ఆగ‌స్టు 13, 2015. మెచ్యూరిటీ తేదీ - ఆగ‌స్టు13, 2020. కాల‌ప‌రిమితి -5 ఏళ్లు. కూప‌న్ చెల్లింపు - ఏడాదికోసారి.

RATING-J.jpg

నాలుగు ఉదాహ‌ర‌ణల్లో మెచ్యూరిటీ తేదీ ఐదేళ్లు పూర్త‌య్యాక అస‌లు మ‌దుప‌ర్ల‌కు అందుతుంది. పై నాలుగు ఇష్యూల్లో రేటింగ్ త‌గ్గుతున్న‌ కొల‌దీ వ‌డ్డీ రేటు పెరుగుతుంది. న‌ష్ట‌భ‌యం,రాబ‌డి (రిస్క్, రిట‌ర్న్) సంబంధం గ‌మ‌నించ‌వ‌చ్చు. న‌ష్ట‌భ‌యం ఎక్కువున్న వాటికి ఎక్కువ రాబ‌డి, త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న వాటికి త‌క్కువ రాబ‌డిఉంటుంది. అత్యుత్త‌మ‌ రేటింగ్ ఉంటే రాబ‌డి శాతం త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. రేటింగ్ త‌గ్గే కొల‌దీ రాబ‌డి శాతం పెరుగుతుంది.

Grade-Rate.png

అవ‌గాహన కోసమే రేటింగ్‌లు:

అత్య‌ధిక రేటింగు ఉన్న బాండ్లు క‌చ్చితంగా ఉంటాయా అంటే దానికి స‌మాధానం చెప్ప‌లేం. క్రెడిట్ రేటింగ్ సంస్థ‌లు ఇచ్చేనివేదిక వారి అభిప్రాయంగా తెలుపుతారు. రిస్క్ తీసుకునే మ‌దుప‌ర్లు ‘C’ గ్రేడ్ బాండ్ల‌లో ఎక్కువ కూప‌న్ రేటు వ‌స్తుంద‌ని మ‌దుపుచేయోచ్చు. రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌నివారు ‘AAA’ బాండ్ల‌లో మ‌దుపుచేయోచ్చు. ‘AAA’ రేటింగు ఉన్న కంపెనీలు డీఫాల్టు అవ్వ‌వ‌ని , ‘D’ గ్రేడ్ బాండ్లు త‌ప్ప‌కుండా డీఫాల్టు అవుతాయ‌ని చెప్ప‌డం రేటింగ్ నివేదిక‌ల ఉద్దేశ్యం కాదు. మ‌దుప‌ర్లు ఆ నివేదిక‌లు, గ్రేడ్ల‌ను అర్థంచేసుకుంటే మంచి పెట్టుబ‌డి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఉద్దేశించిన‌వి.

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

గ‌మ‌నిక:
పైన పేర్కొన్న ఉదాహ‌ర‌ణల్లో గ్రేడింగ్, రేట్లు, ఇష్యూ ప్రారంభం, మెచ్యూరిటీ తేదీలు అంచ‌నా మాత్ర‌మే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly