జియో ఫైబ‌ర్ మార్కెట్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు: క్రిసిల్‌

జియో ఫైబ‌ర్ సేవ‌లు మార్కెట్‌పై అంత‌గా ప్ర‌భావం చూప‌వ‌ని క్రిసిల్ నివేదిక‌ పేర్కొంది

జియో ఫైబ‌ర్ మార్కెట్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు: క్రిసిల్‌

జియో ప్ర‌క‌టించిన జియో ఫైబ‌ర్ బ్రాబ్‌బ్యాండ్ సేవ‌లు, ధ‌ర‌ల‌తో టెలికాం, టీవీ రంగాల‌లో పెద్ద‌గా మార్పులేమి ఉండ‌వ‌ని క్రిసిల్ అభిప్రాయ‌ప‌డింది. క్రిసిల్ ప‌రిశోధ‌న ప్ర‌కారం మార్కెట్‌పై ఇవి అంత‌గా ప్ర‌భావం చూప‌వ‌ని పేర్కొంది. సెప్టెంబ‌ర్ 5 న ముకేష్ అంభానీ జియో ఫైబ‌ర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్నెట్ వేగం క‌నీసం 100 ఎంబీపీఎస్ నెల‌కు రూ.699 నుంచి ప్రారంభంకానున్నాయి.

అన్నింటికి క‌లిపి ఎక్కువ ధ‌ర‌లు ప్ర‌క‌టించ‌డం వంటివి అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పింది. రూ.2,500 రీఫండ్ కానీ డిపాజిట్ కూడా ఇందుకు కార‌ణం అని చెప్పింది. టీవీ, టెలికాం రంగాలు ఏకీకృతం కావ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. టెలివిజ‌న్ ధ‌ర‌ల్లో భ‌విష్య‌త్తులో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి జియో ఫైబ‌ర్ ప్లాన్‌ల‌కు అంత‌గా ఆక‌ర్షితులు కాక‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly