ప్ర‌యాణం ర‌ద్ద‌యితే భారీగా చెల్లించుకోవాల్సిందేనా ?

చివ‌రి నిమిష‌యంలో టిక్కెట్లు ర‌ద్దు చేసుకున్న‌ప్పుడు క‌లిగే న‌ష్ట‌మెంత ఎంత భారం ప‌డుతుంది తెలుసుకుందాం

ప్ర‌యాణం ర‌ద్ద‌యితే భారీగా చెల్లించుకోవాల్సిందేనా ?

ఇటీవ‌ల తాజాగా జెట్ ఎయిర్‌వేస్ ప్ర‌యాణాల‌ను ర‌ద్దు చేసింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న‌వారి ప్ర‌యాణాలు ర‌ద్ద‌య్యాయి. సాధార‌ణంగా అనుకోని కార‌ణాలు ఉంటే త‌ప్ప ఎప్పుడు ఇలా జ‌ర‌గ‌దు. చివ‌రి నిమిషంలో ప్ర‌యాణం ర‌ద్దు అయితే నిరాశతోపాటు అద‌న‌పు ఖ‌ర్చులుకూడా భారంగా మార‌తాయి. అయితే విమానం, రైలు , హోటళ్లు బుక్ చేసుకున్న త‌ర్వాత ర‌ద్దు చేసుకుంటే ఎంత అద‌న‌పు వ్య‌యాలు చెల్లించాల్సి వ‌స్తుందో తెలుసుకుందాం.

విమాన టిక్కెట్లు బుకింగ్
చివ‌రి నిమిషంలో ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకున్నా, వాయిదా వేసుకున్నా అద‌న‌పు ఛార్జీలు ప‌డ‌తాయి.

టిక్కెట్ల ర‌ద్దు
వివిధ అంశాల ఆధారంగా టిక్కెట్ క్యాన్సిలేష‌న్ పాల‌సీ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌కు వేర్వేరుగా ఉంటుంది. ఎకాన‌మీ, బిజినెస్, ప్రీమియం క్లాస్‌ల ఛార్జీలు కూడా భిన్నంగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు చాలా ఎయిర్‌లైన్స్ మాదిరిగానే విస్తారా బుక్ చేసిన 24 గంట‌ల్లో టిక్కెట్లు ర‌ద్దు చేసుకోవ‌చ్చు. టిక్కెట్‌ క్లాస్‌ను బ‌ట్టి ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఎక‌నామి లైట్‌లో కేవ‌లం ట్యాక్స్ రీఫండ్ అవుతుంది. ఎకాన‌మీ స్టాండ‌ర్ట్ అయితే రూ.3 వేలు రీఫండ్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. బిజినెస్ వ్యాల్యూ కి 24 గంట‌ల త‌ర్వాత ర‌ద్దు చేస్తే రూ.3,500, బిజినెస్ స్టాండ‌ర్డ్ టిక్కెట్ 24 గంట‌ల్లోపు ర‌ద్దు చేస్తే రూ.3 వేలు ల‌భిస్తాయి.

రీషెడ్యూల్‌
ప్ర‌యాణానికి రెండు గంటల ముందు వరకు ప్రయాణ తేదీని మార్చినట్లయితే అద‌నంగా టిక్కెట్ ధ‌ర‌పై అద‌నంగా రూ.2 వేలు వ‌ర్తిస్తాయి.

డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) 2016 స‌ర్క్కులార్ ప్ర‌కారం, బుకింగ్ చేసుకున్న 24 గంట‌ల్లోపు ర‌ద్దు చేసుకుంటే, ప్ర‌యాణానికి ఇంకా వారం రోజుల స‌మ‌యం ఉంటే అప్పుడు ఎటువంటి క్యాన్సిలేష‌న్ ఛార్జీలు ఉండ‌వు. ట్రావెల్ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే కొంత‌ స‌ర్వీస్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

డీజీసీఏ ప్ర‌కారం, ఎయిర్‌లైన్స్ చ‌ట్ట‌ప్ర‌కారం ప‌న్ను, డెవ‌ల‌ప్‌మెంట్ ఫీజు, ఎయిర్‌పోర్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫీజు , ప్యాసింజ‌ర్ స‌ర్వీస్ వంటి ఫీజులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నాన్‌-రీఫండబుల్ టిక్కెట్ల‌కు కూడా ఇవి వ‌ర్తిస్తాయి. 30 రోజుల్లోపు విమాన సంస్థ‌లు ఈ రీఫండ్ ప్రాసెస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే చాలావ‌ర‌కు ఎయిర్‌లైన్స్ 24 గంట‌ల త‌ర్వాత ర‌ద్దు చేసుకుంటే తిరిగి ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు. అయితే ప్రీమియం బిజినెస్ టిక్కెట్‌పై లేదా ప్ర‌యాణ‌ బీమా క‌లిగి ఉంటే తిరిగి పొంద‌వ‌చ్చు.

రైలు ప్ర‌యాణాలు
రైలు టిక్కెట్ల ర‌ద్దు నిబంధ‌న‌లు అంత క‌ఠినంగా ఉండ‌వు.

టిక్కెట్ల ర‌ద్దు
రైలు టిక్కెట్లు బుక్ అయిన త‌ర్వాత ప్ర‌యాణానికి ముందు 48 గంట‌ల్లోపు ర‌ద్దు చేసుకుంటే ఫ్లాట్ క్యాన్సిలేష‌న్ ఛార్జీలు రూ.240 ఏసీ ఫ‌స్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏసీ 2 టైర్ లేదా ఫ‌స్ట్‌ క్లాస్ రూ.200, ఏసీ 3 టైర్ లేదా ఏసీ చైర్ కార్, ఏసీ 3 ఎకాన‌మీకి రూ.180, స్లీప‌ర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్‌కి రూ.60 వ‌ర్తిస్తాయి.

టిక్కెట్ నిర్ధారించిన త‌ర్వాత 48 గంట‌ల్లోపు ర‌ద్దు చేసి, ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వ‌డానికి ఇంకా 12 గంట‌ల సమ‌యం ఉంటే టిక్కెట్ ధ‌ర‌లో 25 శాతం క్యాన్సిలేష‌న్ ఛార్జీల‌కు వ‌ర్తింప‌జేస్తారు. ప్ర‌యాణానికి నాలుగు గంట‌ల నుంచి 12 గంట‌ల ముందు ర‌ద్దు చేస్తే 50 శాతం తీసుకుంటారు. చార్ట్‌ రిజ‌ర్వేష‌న‌త్ త‌ర్వాత ఈ-టికెట్స్ ర‌ద్దు చేసేందుకు వీలుండ‌దు. త‌త్కాల్ టిక్కెట్ బుక్ చేసిన త‌ర్వాత ర‌ద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ల‌భించ‌దు. ఇది త‌దుప‌రి రోజు ప్ర‌యాణం అనగా ముందురోజు కూడా అధిక ధ‌ర‌తో టిక్కెట్ బుక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

రీషెడ్యూల్‌
ఇది విమాన టిక్కెట్ల మాదిరిగా కాకుండా, ఒక‌సారి ర‌ద్దు అయితే తిరిగి రీషెడ్యూల్ చేసే వీలుండ‌దు. ఈ టిక్కెట్ల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు ఇవ్వొచ్చు. ప్ర‌యాణానికి 24 గంట‌ల ముందు త‌మ ర‌క్త సంబంధీకుల‌కు ఈ టిక్కెట్ల‌ను బ‌దిలీ చేయ‌వ‌చ్చు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ టిక్కెట్ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.

హోట‌ల్ బుకింగ్స్‌
హోట‌ల్ బుకింగ్స్ రీషెడ్యూల్ లేదా ర‌ద్దు అనేది హోట‌ల్ ప‌రిమితులు, నిబంధ‌న‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

క్యాన్సిలేషన్‌
చాలా వ‌ర‌కు హోట‌ళ్లు క్యాన్సిల్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. ఆన్‌లైన్ హోట‌ల్ బుకింగ్ వెబ్‌సైట్స్ 24 గంట‌ల్లోపు టిక్కెట్ క్యాన్సిల్ చేసుకునే స‌దుపాయాన్ని ఉచితంగా క‌ల్పిస్తున్నాయి. ఎక‌నామిక‌ల్ లేదా ప్ర‌మోష‌న‌ల్ రేట్ల‌కు అయితే 48-72 గంట‌ల్లోపు ర‌ద్దు చేస్తే పూర్తిగా రీఫండ్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఫ్లాట్ రేట్లు, నాన్‌-ప్ర‌మోష‌న‌ల్ వ్య‌యాలు అయితే 48-72 గంట‌ల్లోపు ర‌ద్దు చేస్తే పూర్తిగా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. హోట‌ల్‌లో గ‌దులు అందుబాటులో లేన‌ప్పుడు పూర్తీ రీఫండ్ చేయ‌వ‌చ్చు.

రీషెడ్యూల్‌
రీషెడ్యూల్ చేయ‌డానికి సాధార‌ణంగా హోట‌ళ్లు ఎటువంటి ఛార్జీల‌ను వ‌సూలు చేయ‌వు. అయితే బుక్ చేసుకున్న‌ది కాకుండా కొత్త గ‌ది ఏర్పాటు చేయాల్సి వ‌స్తే ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు. మీ ప్ర‌యాణాల‌ను ర‌ద్దు చేయ‌డం లేదా రీషెడ్యూల్ చేయ‌డం చివ‌రి నిమిషంలో ఎక్కువ భారం ప‌డొచ్చు. ముఖ్యంగా విమాన టిక్కెట్ల‌ను ర‌ద్దు చేసుకుంటే ఎక్కువ‌గా ఉంటుది. అయితే ప్ర‌యాణ బీమా ఉంటే వ్య‌యాలు కొంచెం త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌యాణానికి ముందు 24 గంట‌ల స‌మ‌యానికి ముందు ప్ర‌యాణం ర‌ద్దు చేసుకుంటే ఎటువంటి ర‌ద్దు ఛార్జీలు ఉండ‌వు. రైలు ప్ర‌యాణాలు, హోట‌ల్ బుకింగ్స్ ర‌ద్దు చేసుకుంటే అంత ఎక్కువ‌గా ఖ‌ర్చు కాక‌పోయిన విమాన ప్ర‌యాలు ర‌ద్ద‌యితే మాత్రం అధికంగా భారం ప‌డుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly