కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ (సీపీపీ)తో మీ కార్డులు భ‌ద్రం

కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ ఉంటే క్రెడిట్, డెబిట్ కార్డుల‌తో పాటు వ్య‌క్తిగ‌త ఆధార ప‌త్రాల‌కు కూడా భ‌ద్ర‌త ఉంటుంది.

కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ (సీపీపీ)తో మీ కార్డులు భ‌ద్రం

చాలామందికి కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ (సీపీపీ) గురించి అంత‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ తో పాటు వాలెట్ పోయిన‌ప్పుడు త‌గిన ప‌రిష్కారం దొరుకుతుంది. సీపీపీ ద్వారా కార్డు లేదా వాలెట్ భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు ర‌మేష్ అనే వ్య‌క్తి కుటుంబంతో స‌హా భోజ‌నం చేసేందుకు ఒక రెస్టారెంట్‌కు వెళ్లాడు. బిల్లు చెల్లించే స‌మ‌యంలో త‌న‌ వాలెట్ పోయింద‌న్న విష‌యం గుర్తించాడు. వాలెట్‌లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌, పాన్ కార్డ్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన ప‌త్రాలు ఉన్నాయి. అయితే అత‌డికి కార్డ్ ప్రోటెక్ష‌న్ ప్లాన్ ఉంది. దీంతో వెంటనె ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ కేర్ స‌ర్వీస్‌కు కాల్ చేసి బిల్లు చెల్లించేందుకు ఎమ‌ర్జెన్సీ క్యాష్ పొందాడు. దాంతో పాటు పాన్ కార్డును తిరిగి సుల‌భంగా పొందేందుకు త‌గిన సాయంతో పాటు, కార్డును వెంట‌నే బ్లాక్ చేయ‌గ‌లిగాడు.

పైన చెప్పిన‌ట్లుగా ఎవ‌రికైనా ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు. అందుకే కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ ఉంటే వాలెట్ పోయినా క్రెడ‌ట్, డెబిట్ కార్డుల‌కు ముఖ్య‌మైన‌ ఇత‌ర డాక్యుమెంట్ల‌కు కూడా భ‌ద్ర‌త ఉంటుంది. కార్డును పోగొట్టుకున్న‌ప్ప‌టికీ ఎవ‌రు డ‌బ్బు తీసుకోకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు.

కార్ట్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ (సీపీపీ) అంటే ఏంటి ?
కార్ట్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ పేరులో ఉన్న‌ట్లుగానే మీ కార్డుల‌కు, డ‌బ్బుకు ర‌క్ష‌ణ ఉంటుంది. పోగొట్టుకున్న ఇత‌ర ముఖ్య‌మైన డాక్యుమెంట్ల‌ను కూడా సుల‌భంగా తిరిగి పొంద‌వ‌చ్చు. చాలా వర‌కు బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు సీపీపీ ప్లాన్ ఆఫ‌ర్ చేస్తాయి. కార్డ్ ద్వారా ఇత‌రులు లావాదేవీలు జ‌ర‌ప‌కుండా ఆపొచ్చు. సీపీపీ ప్ర‌యోజ‌నాలేంటో వివ‌రంగా తెలుసుకుందాం…

 1. అన్ని కార్డుల‌ను ఒకేసారి బ్లాక్ చేయ‌వ‌చ్చు
  వాలెట్‌ పోయిన‌ప్పుడు అందులో ఉన్న‌ క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డులు అన్ని ఒకేసారి పోతే అన్ని బ్యాంకుల క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌కు కాల్ చేసి బ్లాక్ చేయ‌డం చాలా క‌ష్టం. అయితే సీపీపీ ఒకేసారి అన్ని కార్డుల‌ను బ్లాక్ చేసే స‌దుపాయం క‌ల్పిస్తుంది. కేవ‌లం క‌స్ట‌మర్ కేర్ కు ఫోన్ చేసి స‌మాచారం ఇస్తే చాలు వారు అన్ని కార్డుల‌ను ఒకేసారి బ్లాక్ చేస్తారు.
 2. మోస‌పూరిత లావాదేవీలకు అడ్డుక‌ట్ట‌
  కార్డ్ ప్రోటెక్ష‌న్ ఫీచ‌ర్లు మీ కార్డు పోయిన‌ప్ప‌టికీ ఎటువంటి లావాదేవీలు జ‌ర‌గ‌కుండా చూస్తాయి. ఎవ‌రైనా మీ కార్డును దొంగ‌త‌నం చేసి కార్డు నుంచి న‌గ‌దు తీసుకోవాల‌ని చూస్తున్న‌ట్లు మీరు గుర్తిస్తే సీపీపీకి ముందే స‌మాచారం ఇచ్చి ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడ‌వ‌చ్చు.
 3. ముఖ్య‌మైన ప‌త్రాల‌ను తిరిగి పొంద‌డం
  వాలెట్‌లో పాన్ కార్డ్, ఆధార్ కార్డు వంటి ముఖ్య‌మైన ఆధారాలు ఉంటే తిరిగి పొంద‌డం చాలా క‌ష్టం. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వివిధ ఏజెన్సీల చుట్టూ తిర‌గాల్సి ఉంటుంది. అయితే సీపీపీ ఉంటే ఆ కంపెనీని కార్డుల రీప్లేస్‌మెంట్ కోసం అడిగితే ఎటువంటి అద‌న‌పు ఖ‌ర్చులు లేకుండా తిరిగి పొంద‌వ‌చ్చు.
 4. ఎమ‌ర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ ఫెసిలిటీ
  దాదాపు అన్ని సీపీపీ ప్లాన్స్ ఎమ‌ర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ ఫెసిలిటీని క‌ల్పిస్తాయి. అయితే ఎంత మొత్తం ఇస్తార‌న్న‌ది ఒక్కో ప్లాన్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. సాధార‌ణంగా రూ.5 వేల నుంచి ప్రారంభ‌మముతుంది. ఒక‌వేళ వాలెట్ పోగొట్టుకుంటే సీపీపీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు స‌మాచారం ఇస్తే ఎమ‌ర్జెన్సీ క్యాష్‌ను అందిస్తారు. 28 రోజుల్లో ఈ డ‌బ్బును తిరిగి ఇవ్వాలి.
 5. అత్య‌వ‌స‌ర ప్ర‌యాణం, హోట‌ల్ స‌దుపాయం
  అదేవిధంగా మీకు అత్య‌స‌ర ప్ర‌యాణం, హోట‌ల్ స‌దుప‌యాలు కూడా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు దూర‌ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాలెట్ పోతే ఆ తర్వాత ఖ‌ర్చుల‌కు, హోట‌ల్ బిల్లులు చెల్లించ‌డం చాలా క‌ష్ట‌మైపోతుంది. అదే సీపీపీ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్ర‌యాణం పూర్తి చేసుకొని రావొచ్చు. ఇది దేశీయ, విదేశీ ప్ర‌యాణాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. బ్యాంకుకి , బ్యాంకుకి మ‌ధ్య ప్ర‌యోజ‌నాలు వేరుగా ఉంటాయి.
 6. మొబైల్ పోగొట్టుకుంటే సిమ్ బ్లాక్ చేయ‌డం
  ఒక‌వేళ మొబైల్ పోతే సీపీపీ సాయంతో సిమ్ బ్లాక్ చేయ‌డంతో పాటు మొబైల్ పోయిన‌ట్లుగా పోలిస్ స్టేష‌న్లో తెల‌ప‌వ‌చ్చు. సీపీపీ వ‌ద్ద ఫోన్ ఐఎంఈఐ నంబ‌ర్ రిజిస్ట‌ర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మొబైల్ ఎక్క‌డుందో ట్రాక్ చేసే వీలుంటుంది.
 7. డెడికేటెడ్ కేస్ ఆఫీస‌ర్‌
  కొన్ని ప్లాన్స్‌ డెడికేటెడ్ కేస్ ఆఫిస‌ర్ ఫెసిలిటీని కూడా అందిస్తాయి. దీంతో మీరు పోగొట్టుకున్న కార్డ్స్‌, వాలెట్‌ను గుర్తించడం సుల‌భ‌మ‌వుతాయి. మీ కేసును ప‌రిష్క‌రించేందుకు డెడికేటెడ్ కేస్ ఆఫీస‌ర్ కావాల‌నుకుంటే సీపీపీ టీమ్‌కు తెలియ‌జేయ‌వ‌చ్చు.
 8. కాల్ బ్యాక్ స‌ర్వీసుల‌కు ఎస్ఎంఎస్‌
  కాల్ బ్యాక్ స‌ర్వీసుల కోసం ఎస్ఎంఎస్ చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. డెడికేటెడ్ నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయ‌డం ద్వారా కాల్ బ్యాక్ స‌ర్వీసుల‌ను పొంద‌వ‌చ్చు. జ‌రిగిన సంఘ‌ట‌న‌ గురించి స‌మాచారం అందించ‌వ‌చ్చు.

కార్డ్ ప్రోటెక్ష‌న్ ప్లాన్ ఎలా కొనుగోలు చేయాలి?
సీపీపీ కొనుగోలు చేయ‌డం చాలా సుల‌భం. దీనిని ఆన్‌లైన్, అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ప్లాన్ తీసుకునేముందు ఏ కంపెనీ నుంచి తీసుకోవాలో నిర్ణ‌యించుకోవాలి. సీపీపీ అందించే బ్యాంకులు, సంస్థల వివ‌రాలు

 • ఎస్‌బీఐ
 • ఐసీఐసీఐ బ్యాంక్
 • బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌
 • య‌స్ బ్యాంక్‌
 • సీపీపీ గ్రూప్‌
  ప్లాన్ తీసుకునేందుకు కార్డు వివ‌రాలు, ఫోన్ నంబ‌ర్‌, ఈమెయిల్ , ఇత‌ర వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఫారంలో అందించాలి. కంపెనీ ప్ర‌తినిది మీకు ఫోన్ ప్లాన్ గురించి వివ‌రిస్తారు. ప్లాన్‌ వార్షిక ప్రీమియం రూ.1650 నుంచి రూ.2600 వ‌ర‌కు ఉంటుంది.

సీపీపీ అవ‌స‌ర‌మా?
సీపీపీ కొనుగోలు చేయ‌డం అనేది వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం ఏం కాదు. ఉన్న‌త‌ మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి సీపీపీ అద‌న‌పు బాధ్య‌త‌గా చెప్పుకోవ‌చ్చు. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు, ఒక‌టి కంటే ఎక్కువ‌గా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న‌వారు సీపీపీని తీసుకోవ‌చ్చు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేసేవారు, కొంత‌మంది ఊరికే వ‌స్తువుల‌ను పోగొట్టుకుంటారు వారికి సీపీపీ ఉంటే మంచిది . విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు, అత్య‌వ‌స‌ర స‌దుపాయాలు పొందేందుకు కూడా సీపీపీ అవ‌స‌రం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly