ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మార్పులు - మీరేం చేయాలి?

కొన్ని ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు పేర్ల‌తో పాటు పెట్టుబ‌డుల విధానంలో మార్పులు చేశాయి

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మార్పులు - మీరేం చేయాలి?

మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌ల‌ను వ‌ర్గీక‌రించ‌డం లేదా హేతుబ‌ద్దీక‌రించాల‌ని సెబీ ఆదేశించ‌డంతో కొన్నొ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు కొత్త నిబంధ‌న‌ల‌ను రూపొందించాయి. అలాంటి అయిదు మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌ల గురించి తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్‌ ఫండ్

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు: రూ.36,594 కోట్లు
వార్షిక రాబ‌డి : 6.89 శాతం
ఫండ్ మేనేజ‌ర్: ప్ర‌శాంత్ జైన్‌
మార్పులు : ఫండ్ పేరును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌గా మార్చారు. ముందు ఫండ్ ఈక్విటీ కేటాయింపులు 65-75% ఉండ‌గా, ఇప్పుడు ఈక్విటీ, డెట్‌ల‌లో క‌లిపి 100 శాతానికి పెంచారు.

హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్ గ‌తంలోలాగే వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తుంది. అయితే ఇప్పుడు బ్యాలెన్స్ చేసే విధంగా ఈక్విటీ, డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌నుంది. ఇది ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పెట్టుబ‌డుల‌ను మార్పు చేసేందుకు అనుగుణంగా ఉంటుంది.

రిల‌య‌న్స్ విజ‌న్ ఫండ్

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు: రూ.3,245 కోట్లు
వార్షిక రాబ‌డి: 11.11 శాతం
ఫండ్ మేనేజ‌ర్: అశ్వ‌నీ కుమార్
మార్పులు: ఇది లార్జ్ క్యాప్ ఫండ్. 20 నుంచి 25 శాతం కేటాయింపులో మిడ్‌క్యాప్‌లో ఉంటాయి. కొత్త‌గా చేసిన మార్పుల ప్ర‌కారం ఇది మ‌ల్టీ క్యాప్ ఫండ్‌గా మారింది. ఇప్పుడు క‌నీసం 30-35 శాతం చొప్పున‌ లార్జ్ క్యాప్‌లో, మిడ్ క్యాప్‌లో పెట్టుబ‌డులు కొన‌సాగించ‌నుంది.

మీ పోర్ట్‌ఫోలియో ప్ర‌కారం, మీ అవ‌స‌రాలకు త‌గిన‌ట్లుగా ఈ ఫండ్ ప‌నిచేస్తే పెట్టుబ‌డులను కొన‌సాగించ‌డం మంచింది. అదేవిధంగా సిప్, ఎస్‌టీపీ (సిస్ట‌మేటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌)ల‌ను కొన‌సాగించాలి. మీరు లార్జ్‌-క్యాప్ ఫండ్ల‌లో ఉంటే అవ‌స‌రాన్ని బ‌ట్టి అంచ‌నా వేసుకోవాలి.

ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తులు: రూ.2,089 కోట్లు
వార్షిక రాబ‌డి: 13.94 శాతం
ఫండ్ మేనేజ‌ర్: జ‌యేష్ గాంధీ
మార్పులు: ఫండ్ నేమ్ ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్‌గా మార్చారు. ఇందులో 10-50 శాతం స్మాల్‌క్యాప్‌ల‌లో కేటాయించేవారు. ఇప్పుడ‌ది 65 శాతం కంటే ఎక్కువ‌కు పెరిగింది.

ఈ స్కీమ్ ఇప్పుడు రిస్క్‌తో కూడిన ఫండ్‌గా పరిగ‌ణిస్తున్నారు. బెంచ‌మార్క్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 నంచి నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కి మారింది. మీర రిస్క్‌ను, ఆర్థిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి అందులో పెట్టుబ‌డులు కొన‌సాగించాలా లేదా అన్న‌దాన్ని ఆలోచించుకోవాలి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్‌ డైన‌మిక్ ప్లాన్

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల విలువ‌: రూ.11,137 కోట్లు
వార్షిక రాబ‌డి: 12.41 శాతం
మార్పులు: ఇప్పుడిది ఐసీఐసీఐ ప్రొడెన్షియ‌ల్ మ‌ల్టీ అసెట్ ఫండ్‌గా మారింది. ఇంత‌కుముందు ఫండ్ మేనేజ‌ర్ 100 శాతం నిధుల‌ను ఈక్విటీ లేదా డెట్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు. ఇప్పుడు క‌నీసం 10 శాతం ఈక్విటీ, డెట్, గోల్డ్, ఇన్విట్స్ లో పెట్టుబ‌డులు పెట్ట‌నుంది.

పెట్టుబ‌డుదారులు ఎవ‌రైతే పెట్టుబ‌డులు పెట్టారో వారు మూడు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో పెట్టుబ‌డులు చేయ‌వ‌సి ఉంటుంది. ఈ ఫండ్‌లో పెట్టుబ‌డులు కొన‌సాగించ‌డం మంచిద‌ని నిపుణుల అభిప్రాయం.

ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్ల‌స్ ఫండ్

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల విలువ: రూ.11,224 కోట్లు
వార్షిక రాబ‌డి: 12.07 శాతం
ఫండ్ మేనేజ‌ర్స్‌: ఆనంద్ రాధాక్రిష్ణ‌న్, ఆర్ జాన‌కీరామ‌న్‌
మార్పులు: ఈ స్కీమ్ పేరును ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ ఫండ్‌గా మార్చారు. ఇప్పుడు ఇది లార్జ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంది. ముందు ఇది ఎక్కువ‌గా లార్జ్ క్యాప్‌కు ప్రాధాన్య‌త ఇచ్చేది.

పేరులో మార్పు చేసిన‌ట్లుగానే పెట్టుబ‌డుల విధానంలో కొంత మార్పు వ‌చ్చింది. పెట్టుబ‌డుదారులు ఇందులో పెట్టుబ‌డులు కొన‌సాగించ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణుల‌ అభిప్రాయం.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly