కార్డు చెల్లింపుల్లో డ‌బ్బులు పోతే ఏం చేయాలి?

ఛార్జ్ బ్యాక్ మెకానిజం అనేది వినియోగ‌దారుడు మోసం, వివాదం లేదా తిరస్కరించడం వంటి వాటికి గురైన‌పుడు మొత్తాన్ని రీఫండ్‌గా పొందేంద‌కు ఉద్దేశించిన ప్రక్రియ.

కార్డు చెల్లింపుల్లో డ‌బ్బులు పోతే ఏం చేయాలి?

మీరు మీ కార్డు ద్వారా ఒక రెస్టారెంట్ బిల్లును చెల్లించ‌డ‌మో లేదా ఆన్లైన్ టిక్కెట్ను బుక్ చేస్తున్నారనుకుందాం. ఆ స‌మ‌యంలో డబ్బు మీ ఖాతాలో డెబిట్ అయి వ్యాపారి ఖాతాలో చేరని సంద‌ర్భంలో ఏం చేయాలి? చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి, మీ సెషన్ సమయం ముగిసింది లాంటి మెసేజ్ స్క్రీన్ పై క‌నిపిస్తుంది. అయితే డబ్బు చెల్లింపు అయిన‌ట్లు ఎస్ఎమ్ఎస్ కూడా మీకు లభిస్తుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో ఏంచేయాలి? ఇలాంటి అవాంత‌రాలు ఏర్ప‌డిన‌పుడు సాధారణంగా, ఆ మొత్తం మీ ఖాతాకు తిరిగి కొన్ని రోజుల్లో క్రెడిట్ అవుతుంది. ఒక వేళ అలా కాక‌పోతే? అటువంటి పరిస్థితిలో, మీరు మీ బ్యాంకుకు “ఛార్జ్ బ్యాక్” అభ్యర్థనను పెట్ట‌వ‌చ్చు .ఛార్జ్ బ్యాక్ మెకానిజం అనేది ఒక వివాద పరిష్కార యంత్రాంగం, ఇది వినియోగ‌దారుడు మోసం, వివాదం లేదా తిరస్కరించడం వంటి వాటికి గురైన‌పుడు మొత్తాన్ని రిఫండ్గా పొందేంద‌కు ఉద్దేశించిన ప్రక్రియ.

ప్రక్రియ: బ్యాంకును బ‌ట్టి ఖాతాదారులు త‌మ ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను పెట్టేందుకు 45-120 రోజుల గ‌డువు ఉంటుంది. ఈ అభ్య‌ర్థ‌న చేసేందుకు వినియోగ‌దారులు త‌మ కార్డు క‌లిగి ఉన్న బ్యాంకుకు పూర్తి వివ‌రాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తు నింపి అందించాలి. వినియోగ‌దారులు ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ చేసేందుకు గ‌ల కార‌ణాలు, జ‌రిపిన లావాదేవీ వివ‌రాలు అందించాలి. వినియోగదారులు ఇచ్చిన‌ వివ‌రాల ప్ర‌కారం బ్యాంకులు లావాదేవీ జ‌రిపిన విధానం, మ‌ర్చెంట్ త‌దిత‌ర వివ‌రాల‌ను క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తుంది. బ్యాంకులు వినియోగ‌దారుల ఖాతా నుంచి ఏ ఖాతాలోకి మొత్తం జ‌మ అయింద‌నే విష‌యం తెలుసుకుంటారు.

బ్యాంకు స‌ద‌రు మ‌ర్చెంట్ ను క‌నుగొన్న త‌రువాత వారికి ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను పెడుతుంది. ఈ సంద‌ర్భంలో మ‌ర్చెంట్ ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను తీసుకోవ‌డం లేదా తిర‌స్క‌రిచండం చేయోచ్చు. అయితే తిర‌స్క‌రించినందుకు త‌గిన కార‌ణాల‌ను, వ‌స్తువులు లేదా సేవ‌లు డెలివ‌రీ చేసిన‌ట్లు ఆధారాలు ఉంటే వాటిని అందించాలి. ఈ స‌మ‌చారం మ‌ర్చెంట్ ఖాతా ఉండే బ్యాంకు, వినియోగ‌దారుని బ్యాంకు, వినియోగ‌దారునికి తెలియ‌చేస్తారు. ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను అంగీక‌రించిన త‌రువాత ఆ మొత్తాన్ని మ‌ర్చెంట్ బ్యాంకు ఖాతా నుంచి వినియోగ‌దారుని బ్యాంకు ఖాతాకు బ‌దిలీ జ‌రిపి అనంత‌రం కార్డు య‌జ‌మాని ఖాతాలోకి జ‌మ‌చేస్తారు. బ్యాంకు ఇచ్చిన స‌మ‌యంలోగా మ‌ర్చెంట్ స్పందించ‌క‌పోతే బ్యాంకు మ‌ర్చెంట్ ఖాతా నుంచి మొత్తాన్ని తీసి కార్డు య‌జ‌మాని ఖాతాలోకి జ‌మ‌చేస్తుంది.

ఒక వేళ మ‌ర్చెంట్ వ‌స్తువ‌లు లేదా సేవ‌లు వినియోగ‌దారునికి చేర‌వేసిన‌ట్లు చెప్పినా, వినియోగ‌దారునికి ఆ వ‌స్తువులు లేదా సేవ‌లు అంద‌క‌పోతే మ‌ర్చెంట్ దీనికి సంబంధించి మ‌రిన్ని ఆధారాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే త‌దుప‌రి ఆర్బిట్రేష‌న్‌కు వెళ్ల‌వ‌చ్చు. ఇక్క‌డ మొత్తం లావాదేవీ జ‌రిగిన క్ర‌మాన్ని మొత్తంగా ప‌రిశీలించి వినియోగ‌దారుడు, మ‌ర్చెంట్ ఎక్క‌డ‌ త‌ప్పు జ‌రిగింద‌నేది ప‌రిశీలించి చివ‌ర‌గా త‌ప్పు జ‌రిగిన వైపు పెనాల్టీ విధిస్తారు.

నిబంధనలు, షరతులు: ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ పెట్టే ముందు వినియోగ‌దారులు అంగీకరించిన నిబంధనలు, షరతులను ప‌రిశీలించుకోవాలి. ఉదాహరణకు, వర్తకుడు ఐదు రోజుల వ్యవధిలో డెలివరీని పొందుతారని చెప్పిన‌ప్ప‌టికీ, మీరు 10 రోజుల్లో దాన్ని పొందుతారు. అలాంట‌పుడు ఛార్జ్ బ్యాక్ క్లెయిమ్ చేస్తే తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. వివాదాలకు సంబంధించి పేర్కొన్న కాల వ్యవధి నిబంధన‌ను చూసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly