ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత‌?

భార‌తీయ స్టేట్ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఐసీఐసీఐతో స‌హా దాదాపు అన్ని బ్యాంకులు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత‌?

మీరు రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని పెట్టుబ‌డిదారుడా? ఈ దీపావ‌ళికి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నారా? అవును, అయితే మీకు ఒక శుభ‌వార్త‌. భార‌త‌దేశ ప్రైవేట్ రంగం బ్యాంకుల‌లో పెద్ద‌దైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, 50 బేసిస్ పాయింట్ల మీద‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. పెంచిన వ‌డ్డీరేట్లు నవంబ‌రు 6, 2018 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. పెరిగిన వ‌డ్డీ రేట్లు రూ. 1కోటి లోపు దేశీయ డిపాజిట్లు, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ ట‌ర్మ్ డిపాజిట్లుకు వ‌ర్తిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అక్టోబ‌ర్‌ 6, 2018న చివ‌రి సారిగా వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది.

భార‌తీయ స్టేట్ బ్యాంకుతో స‌హా, కొటాక్ బ్యాంక్‌, ఐసీఐసీఐ వంటి దాదాపు అన్ని బ్యాంకులు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచాయి. చివ‌రిసారిగా స‌వ‌రించిన వ‌డ్డీ రేట్ల ప్ర‌కారం, ఒక సంవ‌త్స‌ర కాల‌ప‌రిమితికి, రూ.1కోటి లోప‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్ర‌స్తుతం 7.30 శాతం వ‌డ్డీ రేటునిస్తుంది. ఇది ఇంత‌కు ముందు 7.25 శాతంగా ఉండేది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.75 శాతం నుంచి 7.80 శాతానికి పెంచింది. అదేవిధంగా 2సంవ‌త్స‌రాల 16 రోజుల కాల‌ప‌రిమితికి, 7.10 శాతం నుంచి 7.40 శాతానికి, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.60 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. 8 సంవ‌త్స‌రాల 1 రోజు నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి 6శాతం నుంచి 6.50 శాతానికి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 6.50 శాతం నుంచి 7 శాతానికి వ‌డ్డీ రేట్లు పెంచింది.

రూ.1 కోటి లోపు దేశీయ డిపాజిట్లు, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ ట‌ర్మ్ డిపాజిట్లుకు హెచ్‌డీఎఫ్‌సీ అందించే ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్లు:

t2.jpg

వివిధ బ్యాంకుల ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్లు

INT-RATE.png

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly