కంపెనీ చెల్లించ‌క‌పోయినా ఇంటి అద్దె భ‌త్యాన్ని పొంద‌డ‌మెలా?

కంపెనీ చెల్లించ‌క‌పోయిన‌ ఇంటి అద్దె భ‌త్యం ఎలా పొందాలో తెలుసుకుందాం

కంపెనీ చెల్లించ‌క‌పోయినా ఇంటి అద్దె భ‌త్యాన్ని పొంద‌డ‌మెలా?

ఇంటి అద్దె భ‌త్యం లేదా హెచ్ఆర్ఏని ఉద్యోగుల‌కు సంబంధిత యాజమాన్యం చెల్లిస్తుంటుంది. అద్దెకుంటున్న ఉద్యోగులకు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. హెచ్ఆర్ఏని క్లెయిం చేసుకోవ‌డం అంత క‌ష్ట‌మైన ప‌ని కాక‌పోయిన‌ప్ప‌టికీ, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అంటే అర్హ‌తలు, ఎంత మొత్తం అందుతుంది, ఇత‌ర నిబంధ‌న‌ల గురించి ప్ర‌తీ ఉద్యోగి తెలుసుకోవ‌డం అవ‌స‌రం. హెచ్ఆర్ఏని ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా క్లెయిం చేసుకోవాలి?మీరు పొందుతున్న‌ జీతంలో భాగంగానే అద్దె భత్యాన్ని మీ కంపెనీ మీకు చెల్లిస్తుంటుంది. దీని కోసం మీరు మీ ఇంటి య‌జమానితో ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి చేసుకున్న అద్దె ఒప్పంద ప‌త్రం, అద్దె ర‌శీదులు కంపెనీకి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అద్దె ర‌శీదుల‌పై ఈ వివ‌రాలు క‌చ్చితంగా ఉండాలి - అద్దె మొత్తం, పూర్తి చిరునామా వివ‌రాలు, య‌జ‌మాని పేరు, సంత‌కం వివ‌రాలు. మ‌రో ముఖ్య‌మైన విష‌య‌మేమిటంటే మీరు చెల్లిస్తున్న అద్దె ఏడాదికి రూ.1 ల‌క్ష దాటితే మీరు త‌ప్ప‌నిస‌రిగా మీ ఇంటి య‌జమాని శాశ్వ‌త ఖాతా సంఖ్య(పాన్‌) వివ‌రాలు తెల‌పండి. ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కోసం ఎంత మొత్తం హెచ్ఆర్ఏని క్లెయిం చేసుకోవ‌చ్చు? ఈ క్రింద వివ‌రించిన అంశాల ఆధారంగా క‌నీస హెచ్ఆర్ఏని క్లెయిం చేసుకోవ‌చ్చు:

  • అద్దె భ‌త్యం మీ జీతంలో భాగంగానే ఉంటుంది.
  • మీ బేసిక్ సాల‌రీలో 10 శాతం లోపు మీ ఇంటి అద్దె ఉండాలి.
  • మెట్రో న‌గ‌రాల‌లో మీ ఇంటి అద్దె 50 శాతం లోపు ఉండాలి. అలాగే ఇత‌ర ప‌ట్ట‌ణాల‌లో అయితే 40 శాతం లోపు అద్ద ఉంటే మీకు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటే అద్దె భత్యం పొందేందుకు వీలుందా?

మీరు మీ తల్లిదండ్రుల‌తో క‌లిసి వారి సొంతింటిలో నివ‌సిస్తున్న‌ప్ప‌టికీ మీరు భ‌త్యాన్ని పొందేందుకు అర్హులే. మీ త‌ల్లిదండ్రుల‌కు చెల్లిస్తున్న హెచ్ఆర్ఏని మీరు క్లెయిం చేసుకోవ‌చ్చు. మీర చెల్లిస్తున్న అద్దె మీ త‌ల్లిదండ్రుల ఇత‌ర ఆదాయ వ‌న‌రుల ప‌రిధిలోకి వ‌స్తుంది.

గృహ రుణం చెల్లిస్తూ, అద్ద ఇంటిలో ఉంటున్నట్ల‌యితే హెచ్ఆర్ఏని క్లెయిం చేసుకోవ‌చ్చా?

మీరు గృహ రుణం చెల్లిస్తూ, అద్దె ఇంటిలో ఉంటున్న‌ప్ప‌టికీ మీరు ప‌న్ను ప్రయోజ‌నాల‌తో పాటు హెచ్ఆర్ఏని కూడా క్లెయిం చేసుకోవ‌చ్చు. మీరు గృహరుణంలో అస‌లు మొత్తం చెల్లిస్తుంటే ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపులు పొందుతారు. అలాగే రుణంపై మీరు వ‌డ్డీని కూడా చెల్లిస్తుంటే మీకు సెక్ష‌న్ 24 ప్ర‌కారం మ‌రో రూ.50 వేల వ‌ర‌కు పన్ను మిన‌హాయింపులు ల‌భించే వీలుంది.

అద్దె ఇంటిలో ఉంటున్న‌ప్ప‌టికీ కంపెనీ య‌జ‌మాని మీకు అద్దె భ‌త్యం ఇవ్వ‌ట్లేదు. దీనిని ఎలా పొందాలి?

అద్దె ఇంటిలో ఉంటున్న‌ప్ప‌టికీ కంపెనీ య‌జ‌మాని మీకు అద్దె భ‌త్యం ఇవ్వ‌కుంటే మీరు సెక్ష‌న్ 80 జీజీ ప్ర‌కారం హెచ్ఆర్ఏని పొందే వీలుంది. దీనికోసం మీరు ఈ క్రింద వివ‌రించిన కొన్ని నిబంధ‌న‌లను పాటించాలి.

  • మీరు ఉద్యోగి లేదా స్వ‌యం ఉపాధిని క‌లిగి ఉండాలి.
  • ఆర్థిక సంవ‌త్స‌రంలో సెక్ష‌న్ 80 జీజీ ప్ర‌కారం మీరు హెచ్ఆర్ఏని క్లెయిం చేసుకుని ఉండ‌రాదు.
  • మీ జీవిత భాగ‌స్వామి, మీ పిల్ల‌లు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాల పేరిట ప్ర‌స్తుతం మీరుంటున్న ప్రాంతంలో ఎలాంటి వ‌స‌తితో కూడిన స్థిరాస్తులు ఉండ‌రాదు.
  • మీకు ఇత‌ర ప్రాంతాల‌లో వ‌స‌తితో కూడిన స్థిరాస్తుల ద్వారా ఆదాయం వ‌స్తుంటే సెక్ష‌న్ 80 జీజీ ప్ర‌కారం హెచ్ఆర్ఏని పొందేందుకు మీరు అన‌ర్హులు.

పై అర్హ‌త‌ల‌ను మీరు క‌లిగి ఉంటే, సెక్ష‌న్ 80 జీజీ ప్ర‌కారం ఈ క్రింద వివ‌రించిన మొత్తాల‌లో ఏది త‌క్కువైతే దానిని అద్దె భ‌త్యం రూపంలో పొందే అవ‌కాశం ఉంది.

  • నెల‌కు రూ.5 వేలు
  • మీ మొత్తం ఆదాయంలో 25 శాతం
  • మీ మొత్తం ఆదాయంలో 10 శాతం నుంచి ప్ర‌స్తుత మీ అద్దె మొత్తాన్ని తీసివేసియ‌గా మిగిలిన మొత్తం

గ‌మనిక:

ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 ప్ర‌కారం అన్ని మిన‌హాయింపుల‌ను తీసివేసిన త‌ర్వాత మిగిలిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. సెక్ష‌న్ 80 జీజీ క్రింద అద్దె భ‌త్యం క్లెయిం కోసం మీరు అద్దె ర‌శీదుల‌తో పాటు 10 బీఏ ఫారంని జ‌త చేయాల్సి ఉంటుంది.

ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసే క్ర‌మంలో అద్దె భత్యం పొంద‌డానికి మీరు అన్ని ప‌న్ను నిబంధ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly